మైక్రో ఫైనాన్స్ రంగానికి మంచి రోజులు.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా

మైక్రో ఫైనాన్స్ రంగానికి మంచి రోజులు రానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. సూక్ష్మ ఋణ సంస్థలు, అంటే మైక్రో ఫైనాన్స్ రంగంలోని సంస్థలు,  కరోనా సమయంలో తగిలిన ఎదురుదెబ్బ నుండి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. వచ్చే […]

Share:

మైక్రో ఫైనాన్స్ రంగానికి మంచి రోజులు రానున్నాయా?

అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. సూక్ష్మ ఋణ సంస్థలు, అంటే మైక్రో ఫైనాన్స్ రంగంలోని సంస్థలు,  కరోనా సమయంలో తగిలిన ఎదురుదెబ్బ నుండి బయటకు వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి క్రెడిట్ వ్యయాలు తక్కువ స్థాయికి చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి మంచి వృద్ధిని చూస్తున్నాయని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థిరమైన రేటింగ్ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మఋణ పరిశ్రమ 20 నుంచి 30 శాతం మధ్య.. వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమస్య పోవడంతో ఇంకా ఎక్కువ మంది  ఋణాల కోసం ముందుకు వస్తున్నట్లు తెలిపింది.  ఋణ వసూళ్లు మెరుగుపడడం, ఋణ వితరణ పెరగడం, క్రెడిట్ వ్యయాలు 15-5 శాతం నుంచి 1-3  శాతం వరకు దిగి రావడం వంటివి అనుకూలించబోయే అంశాలుగా పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ప్రతికూలతను దాదాపుగా డిసెంబర్ నుండి రాబోయే త్రైమాసికానికి సర్దుబాటు చేసుకున్నట్లు వివరించింది. ఋణ వితరణ పెరుగుతుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది. దీంతో మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉన్న పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకూ మంచి రోజులొస్తున్నాయని ఇక తమ భవిష్యత్​కు ఎటువంటి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పెరిగిన వడ్డీ రేట్లు కూడా మైక్రో ఫైనాన్స్ రంగానికి ఎంతో కొంత కలిసొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనాతో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో అని భావించిన చాలా మంది రుణాలు తీసుకునేందుకు ఇన్నాళ్లూ వెనకడుగు వేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో రుణాలు తీసుకోవాలని మళ్లీ యోచిస్తున్నారట.  

భవిష్యత్తులో రాబోయే రిస్కులు

12 నుంచి 18 నెలల కాలంలో సూక్ష్మ ఋణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్కులు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, ఎన్నికలను ప్రస్తావించింది. ఈ రెండు అంశాలు రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలలో ఋణగ్రహీతల ఆదాయంపై ప్రభావం చూపించవచ్చని అంచనా వేసింది. ఎగవేతలు, క్రెడిట్ విజయాలు సాధారణ స్థాయికి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థల ఋణాల్లో అధిక శాతం కరోనా మహమ్మారి తర్వాత జారీ అయినవేనని వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద క్రెడిట్ వ్యయాలు, ఈ ఆర్ధిక సంవత్సరం కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి.  ముఖ్యంగా ఎంఎఫ్ఐలలోని ఋణగ్రహీతలలో 65% అత్యవసర వస్తువులు సేవలోనే ఉపాధి పొందుతున్నందున వీరిపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా పడుతుందని,వారి ఆదాయ వ్యయాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. దీనిని బట్టి మైక్రో ఫైనాన్స్ భవిష్యత్తు బాగానే ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో ఉన్న వారికి బాగానే ఉన్నప్పటికీ కొన్ని రిస్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున చాలా జాగ్రత్తగా మెదులుకోవడం చాలా అవసరం. 

ఇదండీ మరి,  మైక్రో ఫైనాన్స్ రంగం భవిష్యత్తుకు సంబంధించిన అంచనా ఇలా ఉంది. కానీ వాస్తవం ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేం.! ఏదేమైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ మైక్రో ఫైనాన్స్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది.