గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా?

బంగారం అంటే ప్రీతి ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరూ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు. అయితే ఎప్పుడు పెట్టాలి? ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది? అసలు ఏ సందర్భాలలో తప్పక లాభాలు వస్తాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే.. ఇప్పుడు చేపబోయే టిప్స్ ఫాలో అయిపోండి..  ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి:  గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర 15% పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ద్రవయోల్బణం కారణంగా బంగారం ధర అటు ఇటు అయినప్పటికీ […]

Share:

బంగారం అంటే ప్రీతి ఎవరికి ఉండదు? ప్రతి ఒక్కరూ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారు. అయితే ఎప్పుడు పెట్టాలి? ఎలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది? అసలు ఏ సందర్భాలలో తప్పక లాభాలు వస్తాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే.. ఇప్పుడు చేపబోయే టిప్స్ ఫాలో అయిపోండి.. 

ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి: 

గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర 15% పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ద్రవయోల్బణం కారణంగా బంగారం ధర అటు ఇటు అయినప్పటికీ ప్రస్తుతానికి బంగారం ధర స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి భారత దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సుమారు 60,000. కానీ పసిడి ప్రియులకు మాత్రం, బంగారం ధర స్థిరంగా ఉన్నా లేకపోయినప్పటికీ, బంగారం అంటే ఎప్పటికీ ప్రీతి తగ్గదు. ముఖ్యంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొన్ని సరైన సమయాలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అనవసరంగా డబ్బు వృధా చేసే బదులు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ విధంగా చేస్తే మనకు లాభం వస్తుంది అనేది ముందుగా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. 

తమ డబ్బు వృధా కాకూడదని, ద్రవయోల్బనాన్ని ఎదుర్కోవటానికి, ఈజీగా లోన్ పొందటానికి, డబ్బు ఆదా చేసుకోవడానికి, తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ లాభం పొందడానికి, ఇలా రకాలుగా ప్రజలు ఆలోచించి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. 

ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు: 

అయితే మనం సంపాదించిన దాంట్లో 5 నుంచి 10 శాతం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతో ఉత్తమం. అయితే ఇందులో కూడా మన ఆదాయాన్ని అంచనా వేసుకుని, మెయింటెనెన్స్ విషయం ఆలోచించుకుని దానికి తగ్గట్లు ఇన్వెస్ట్ చేయడం మంచిది. 

ఇన్వెస్ట్మెంట్ లో రకాలు: 

అయితే బంగారం మీద అనేక రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా బంగారాన్ని కొనుక్కోవచ్చు, గోల్డ్ మైనింగ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సోవరణ్ గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, నమ్మకమైన వాటిలో మంత్లీ SIP ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 

ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన టైమ్: 

అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలామంది కొద్దిగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. మరి కొంత మంది సరైన టైమ్ చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గనక ముందుగా బంగారం ధర ఎంత ఉంది చూసుకోవాలి. కరెక్ట్ గా బంగారం ధర తగ్గింది అని మనకి తెలిసినప్పుడు వెంటనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, డాలర్ రేట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గుతుందని గుర్తుంచుకోండి. అదే సమయంలో మన ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎక్కువ రేటు వచ్చినప్పుడు మనం దాని ద్వారా మనం లాభాన్ని పొందొచ్చు. 

గోల్డ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

చాలామంది చిన్న షాపుల్లో ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం, ఇక్కడే అలవాటు అని చాలామంది ఎప్పుడూ తీసుకునే షాపుల్లోనే గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మనం, ఏ షాపులో తీసుకున్నప్పటికీ, ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది హాల్ మార్పు ఉందా లేదా అని. ఎందుకంటే భారత దేశంలో ప్రతి బంగారు వస్తువు మీద హాల్ మార్క్ ముద్ర అనేది తప్పకుండా ఉంటుంది. ఇది స్వచ్ఛమైన బంగారానికి గుర్తు అనమాట. హాల్ మార్క్ విధానంలో మనం కొనే బంగారం వస్తువు మీద బిఐఎస్ ముద్ర ఉంటుంది. అంతే కాకుండా ఆరు అంకెల నెంబర్ ఒకటి ఉంటుంది. ఇలాంటివి గనుక మీ బంగారు వస్తువులు మీద కనిపించకపోతే అది మంచి బంగారం కాదు అని లెక్క. కాబట్టి బంగారం తీసుకుంటూనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.