ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి.. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న CEA

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు డీలపడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు డీలపడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు చేసింది. మూడో వంతు దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఇటీవల పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని, ప్రభుత్వాలు, వ్యాపారులు, వ్యక్తుల ఆర్థిక , కార్పొరేట్ పొదుపు ఖాతా ప్రణాళికలో భద్రత మార్జిన్లను […]

Share:

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు డీలపడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు డీలపడుతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు చేసింది. మూడో వంతు దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఇటీవల పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని, ప్రభుత్వాలు, వ్యాపారులు, వ్యక్తుల ఆర్థిక , కార్పొరేట్ పొదుపు ఖాతా ప్రణాళికలో భద్రత మార్జిన్లను ఉంచాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ అన్నారు.. 

ఐఎంఎఫ్:

జనవరిలో ఇచ్చిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రపంచవృద్ది అంచనాలు పాతవిగా ఉన్నాయని, గత వారం అమెరికాలో జరిగిన పరిణామాల దృష్ట్యా బ్యాంకు రుణ వృద్ధి, మిగతా లింకింగ్ ఉన్న దేశాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో చూడవలసి ఉంటుందని ఆయన తెలిపారు. అమెరికాలోని రెండు బ్యాంకులు గతవారం పూర్తిస్థాయిలో డౌన్ అయ్యాయి. క్రిప్టో కరెన్సీ ఎక్కువగా రుణాలు ఇచ్చిన న్యూయార్క్ లోని సిగ్నేచర్ బ్యాంక్ వారి డిపాజిట్లపై ఎక్కువ మార్జిన్ రావడంతో ఆదివారం రెగ్యులేటర్లు ఆ బ్యాంకును మూసివేశారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యం: 

అంతేకాకుండా గత వారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యం.. అనేక స్టార్ట్ కంపెనీలు వ్యవస్థాపకులు బిసి ఫండ్లను భయాందోళనకు గురి చేసింది. యునైటెడ్ స్టేట్స్ లో 16వ అతిపెద్ద బ్యాంక్ అయినా సిలికాన్ వాలీబాల్ కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా ఈ శుక్రవారం పూర్తిగా సంస్థ యొక్క పనులన్నింటినీ నిలిపివేశారు. ఇది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిసీవర్ గా నియమించింది. 

వి అనంత నాగేశ్వరన్ మాటల్లో..

అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా సాగవచ్చని, ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అని వి అనంత నాగేశ్వరన్ అన్నారు. తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయి అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించిన కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని.. ఇది సానుకూల అంశమని నేను నమ్ముతున్నాను. వడ్డీ రేట్ల పెంపుకి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే ప్రపంచంలోనే పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టించింది.

ఇలాంటి తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంచెం క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలుగుతుందని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8 నుంచి 9 శాతం జిడిపి వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7-8 సంవత్సరాల్లో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని సూచించారు.