Scam Alert: ఈ స్కామ్ లతో జాగ్రత్తగా ఉండండి..

స్కామ్.. స్కామ్.. స్కామ్.. (Scam) ప్రస్తుతం ఈ పదం కామన్. స్కామ్స్ (Scam) జరగడం కామన్ గా జరుగుతూ ఉంటుంది కానీ ఈ స్కామ్స్ (Scam) ఎందుకు జరుగుతాయో చాలా మందికి తెలియదు. ఇక కొంత మందైతే స్కామ్స్ (Scam) జరకగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ స్కామ్స్ (Scam) జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి వారు తీవ్రంగా నిరాశపడే చాన్స్ ఉంది.  ఇక ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి స్కామ్స్ (Scam) జరిగే చాన్స్ ఎక్కువగా […]

Share:

స్కామ్.. స్కామ్.. స్కామ్.. (Scam) ప్రస్తుతం ఈ పదం కామన్. స్కామ్స్ (Scam) జరగడం కామన్ గా జరుగుతూ ఉంటుంది కానీ ఈ స్కామ్స్ (Scam) ఎందుకు జరుగుతాయో చాలా మందికి తెలియదు. ఇక కొంత మందైతే స్కామ్స్ (Scam) జరకగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ స్కామ్స్ (Scam) జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి వారు తీవ్రంగా నిరాశపడే చాన్స్ ఉంది.  ఇక ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి స్కామ్స్ (Scam) జరిగే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. కావున అటువంటి వారు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఏ మాత్రం ఆదమరిచినా కానీ స్కామ్ (Scam) లకు బలికావాల్సి ఉంటుంది. ఇక పండుగల సమయంలో స్కామర్స్ (Scammers) రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రజలను చైతన్యమంతులను చేసినా కానీ ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట స్కామ్స్ (Scam) జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట అమాయకులు మోసపోతూనే ఉన్నారు. కాబట్టే మన కార్డులను ఆన్ లైన్ క్రెడెన్షియల్స్ ను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ మాత్రం లైట్ తీసుకున్నా కానీ మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మనం స్కామ్ లు జరగకుండా ఎలా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

ఈ కామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేసేటపుడు మనలో చాలా మంది కార్డు డిటేయిల్స్ (Card Detais) లేదా బ్యాంక్ డిటేయిల్స్ ఇచ్చే షాపింగ్ (Shopping) చేస్తారు. పే ఆన్ డెలివరీ చేసే వారు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వారు చాలా కేర్ ఫుల్ (Carefull) గా ఉండాలి. ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా కానీ స్కామర్స్ మన అకౌంట్ల (Accounts) నుంచి వేలల్లో డబ్బులను కాజేసే అవకాశం ఉంది. నిపుణులు (Experts) కూడా ఆన్ లైన్ లో కార్డులు వాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

అప్రమత్తతే శ్రీ రామ రక్ష

ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ప్రసిద్ధ మరియు విశ్వసనీయ ఈ-కామర్స్ (E-Commerce) ప్లాట్‌ఫారమ్స్ నుంచే ఆన్‌ లైన్ కొనుగోళ్లు చేయాలి. కేవలం ఆన్ లైన్ షాపింగ్ మాత్రమే కాకుండా నేటి రోజుల్లో అనేక విషయాల కోసం కార్డులను (Cards) వాడుతున్నారు. అలా కార్డులను వాడే సమయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అలా కాదంటే మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 

ఆఫర్ లు అంటే ఒకటికి రెండు సార్లు చూడండి.. 

ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ (Digital) యుగంలో ఆఫర్ (Offer) అంటూ ప్రతి ఒక్కరూ ఊరిస్తారు. ఇక పండుగ వేళల్లో (Festival Time) అయితే ఈ ఆఫర్ లకు కొదువే ఉండదు. మార్కెట్లో ఉన్న ఆన్ లైన్ షాపింగ్ (Online Shopping) సైట్లు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. కానీ ఈ ఆఫర్ల పట్ల  జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే మన అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసమే ఆఫర్స్ అంటూ వచ్చే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అందులో ఎంత వరకు ఆఫర్ ఉందనే విషయాన్ని గుర్తించాలి. అలా కాకుండా ఆఫర్ అనగానే ఎగేసుకుంటూ వెళ్తే మాత్రం మనకు భంగపాటు తప్పదు. ఆఫర్ అనేది కేవలం ఆన్ లైన్ షాపింగ్ లోనే కాకుండా ఇంకా అనేక విషయాలలో ఉంటుంది. ఆఫర్ అని వచ్చినపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

పాస్ వర్డ్ తో పిచ్చెక్కించండి.. 

మనం ఎటువంటి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ దానికి పాస్ వర్డ్ (Password) ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం పాస్ వర్డ్ (Password) ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈజీగా గెస్ చేసే పాస్ వర్డ్ కాకుండా ఎవరూ గెస్ చేసేందుకు వీలు లేని పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి. ఇలా బలమైన పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవడం వల్ల మన అకౌంట్ ను స్కామ్ చేద్దామని ఎవరైనా చూసినా కానీ మనం స్కామ్ కు గురి కాకుండా ఉంటాం. అందుకోసమే పాస్ వర్డ్ అనేది చాలా ముఖ్యం. పాస్ వర్డ్ విషయంలో మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకోసమే స్ట్రాంగ్ (Strong) పాస్ వర్డ్  ను క్రియేట్ చేసుకోవాలి. 

అదనపు సమాచారం ఇవ్వకండి.. 

నేటి రోజుల్లో మనం షాపింగ్ చేసినపుడు లేదా బ్రౌజింగ్ చేసినపుడు అదనపు సమాచారం  (Extra Information) ఇవ్వడం పరిపాటిగా మారింది. మనకు ఇష్టం లేకపోయానా కానీ అదనపు సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనకు రోజూ ఎన్నో లింక్స్ వస్తుంటాయి. వాటిల్లో స్కామ్స్ కు సంబంధించిన లింక్సే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి లింక్స్ (Links) పట్ల జాగ్రత్త వహించాలి. ఏది పడితే ఆ లింక్ క్లిక్ చేయకూడదు. అది ఆథరైజ్డ్ అని తెలిస్తేనే దాని మీద క్లిక్ (Click) చేయాలి.