ఫోర్బ్స్ జాబితాలో 2023 లో కూడా స్థానం సంపాదించుకున్న కేశుబ్ మహీంద్రా కన్నుమూశారు

మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ పారిశ్రామికవేత్త కేశుబ్ మహీంద్రా (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయంకా ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా ఆయనకి ఘన నివాళి అర్పించారు. కేశుబ్ మహీంద్రా మంచి వ్యక్తి. అతను వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాలను ఎలా కనెక్ట్ చేశాడనే దాని నుంచి ప్రేరణ పొందాను. ఓం శాంతి.. అని గోయంకా ట్విట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేశుబ్ మహీంద్రా మృతికి నివాళులు అర్పించారు. కేశుబ్ […]

Share:

మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ పారిశ్రామికవేత్త కేశుబ్ మహీంద్రా (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయంకా ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా ఆయనకి ఘన నివాళి అర్పించారు. కేశుబ్ మహీంద్రా మంచి వ్యక్తి. అతను వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాలను ఎలా కనెక్ట్ చేశాడనే దాని నుంచి ప్రేరణ పొందాను. ఓం శాంతి.. అని గోయంకా ట్విట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేశుబ్ మహీంద్రా మృతికి నివాళులు అర్పించారు.

కేశుబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాల్లో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌కి చైర్మన్‌గా పని చేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్ మహీంద్రా కేశుబ్. 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. ఆ బాధ్యతలను అతని మేనల్లుడు ఆనంద్ మహీంద్రా కు అప్పగించారు. 1947లో కేశుబ్ మహీంద్రా యుటిలిటీ వాహనాలను తయారు చేయడం, విక్రయించడం ద్వారా తన తండ్రి ప్రారంభించిన కంపెనీలో చేరాడు. 1987లో ఫ్రెంచ్ ప్రభుత్వం వారి నుండి మహీంద్రాకు అవార్డు లభించింది. 2004 నుంచి 2017 వరకు వాణిజ్య పరిశ్రమల ప్రధానమంత్రి మండలి సభ్యునిగా కూడా కేశుబ్ మహీంద్రా పనిచేశారు.

మేనమామ కేశుబ్ మహేంద్ర మరణంపై ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. ఏ సెంచరీ ఆఫ్ 1.2 బిలియన్ డాలర్ల నికర విలువతో 2023లో భారత దేశపు అత్యంత ధనవంతుల ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ ప్రవేశించిన కొద్ది రోజులకే కేశుబ్ మహీంద్రా మరణించారు. రాజీలేని సమగ్రత, విలువల శతాబ్దం. మేము ఎప్పటికీ మీ విలువలలోనే ప్రయాణిస్తూ ఉంటామని తెలిపారు.

ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియన్ ఇయర్ జాబితాలో 2023లో భారత దేశంలోని 16 మంది బిలియనీయర్స్‌లో ఆయన కూడా ఒకరు. కేశుబ్ వ్యాపారవేత్తగా, మహీంద్రా సేల్, టాటా స్టీల్ , టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐసిఐసిఐ తో సహా అనేక కంపెనీల బోర్డులలో పని చేశారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.  

1947లో మహీంద్రా గ్రూపులో కేశుబ్ చేరారు. 1963 నుంచి 2012 మధ్య చైర్మన్‍గా సంస్థను విజయవంతంగా, వృద్ధిపథంలో ముందుకు నడిపించారు. వాహనాల తయారీలో ఉన్న సంస్థను ఆయన పలు రంగాలకు విస్తరించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 1945లో కేశుబ్ మహీంద్రా తండ్రి కైలాశ్ చంద్ర మహీంద్రా.. సోదరుడు జగదీశ్ చంద్ర మహీంద్రా, మాలిక్ గుహ్లమ్ మహమ్మద్‍తో కలిసి మహీంద్రా & మహమ్మద్ బ్రదర్స్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత క్రమంగా ఈ సంస్థ పేరు మహీంద్రా & మహీంద్రాగా మారింది. 1947లోనే ఈ గ్రూప్‍లో చేరారు కేశుబ్ మహీంద్రా. 70 సంవత్సరాలకు పైగా సంస్థకు సేవలు అందించారు. వాహనాల ఉత్పత్తి, అమ్మకాల్లో మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఒకానొక టాప్ సంస్థగా రూపాంతరం చెందటంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల వెల్లడైన ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత వృద్ధ బిలీనియర్‍గా కేశుబ్ మహీంద్రా నిలిచారు.