మూతపడిన తెచ్చిన సిలికాన్ వ్యాలీ బ్యాంకును కొంటానన్న ఎలన్ మస్క్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంకుగా పరిగణిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లు, సంస్థలకు రుణాలు అందించే బ్యాంకుగా SVB చాలా ప్రాచుర్యం పొందింది. SVB ఫైనాన్షియల్ గ్రూప్ ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు 10 దేశాలలో ఈ బ్యాంకుకు ఫ్రాంచైజీలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా యూఎస్ రెగ్యులేటర్లు సిలికాన్ వాలీ బ్యాంక్‌ను మూసి వేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.. ఆ తరువాత ఆ బ్యాంక్ కి సంబంధించిన ఆస్తులు కూడా […]

Share:

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంకుగా పరిగణిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లు, సంస్థలకు రుణాలు అందించే బ్యాంకుగా SVB చాలా ప్రాచుర్యం పొందింది. SVB ఫైనాన్షియల్ గ్రూప్ ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు 10 దేశాలలో ఈ బ్యాంకుకు ఫ్రాంచైజీలు ఉన్నాయి. కానీ అనూహ్యంగా యూఎస్ రెగ్యులేటర్లు సిలికాన్ వాలీ బ్యాంక్‌ను మూసి వేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.. ఆ తరువాత ఆ బ్యాంక్ కి సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ చేసింది.. 

SVB ని ఎలన్ మస్క్ కొంటున్నారా?

2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా సిలికాన్ వాలీ బ్యాంక్ నమోదయింది. ఇది ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. కంపెనీ బిలియన్ డాలర్లను పోగొట్టుకుంది. ఈ బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు, ఆస్తులను జప్తు చేయడంతో, ఈ బ్యాంకు మాతృ సంస్థ SVB ఫైనాన్షియల్ గ్రూప్ షేర్ సుమారు 60 శాతం పడిపోయాయి.

ఇటువంటి బ్యాంక్ మూసివేత గందరగోళ పరిస్థితుల మధ్య.. అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిస్ ట్విట్టర్ వేదికగా.. “ట్విట్టర్‌‌‌ను కొనుగోలు చేసినట్లు SVB ని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంకుగా మార్చాలని” ఎలన్ మస్క్‌‌కి ట్విట్టర్ వేదికగా సూచించారు.. ఈ ట్వీట్‌కు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందిస్తూ.. SVBని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అర్థం వచ్చేలాగా “నేను ఈ ఆలోచనలకు సిద్ధంగా ఉన్నా” అంటూ ట్వీట్ చేశారు.

SVB పతనానికి కారణాలు

గత కొన్నేళ్లుగా స్టార్టప్ రంగంలోని కంపెనీలు భారీగా లాభాలను అర్జించడంతో సిలికాన్ వాలీ బ్యాంకులో ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయడం ప్రారంభించారు. 2017లో ఈ బ్యాంకు డిపాజిట్ పరిణామం 3.60 లక్షల కోట్ల నుంచి 20201 చివరి నాటికి 15.50 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో రుణాల పరిమాణం 1. 90 లక్షల కోట్ల నుంచి 5.4 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది.  అంటే బ్యాంకు తన డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బ్యాంకు మొత్తం ఆదాయం కంటే చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయింది.. మరోవైపు బ్యాంకు మిగులు నిధులను ఎక్కువగా అమెరికా ప్రభుత్వ బాండులో పెట్టుబడి పెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచడం ప్రారంభించగానే.. బాండ్ వడ్డీ రేట్లు తగ్గడం మొదలయ్యాయి. కొత్త పెట్టుబడి తగ్గడంతో, టేక్ కంపెనీలు కూడా సిలికాన్ వాలీ బ్యాంకుల నుండి వారి డిపాజిట్లను ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి. అప్పుడు బ్యాంక్ అనివార్యంగా బాండ్లను కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. దాంతో కొద్ది రోజుల్లోనే బ్యాంక్ 16 వేల కోట్లు నష్టపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మార్కెట్ నుంచి రూ.20 వేల కోట్లు సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు సిలికాన్ వాలీ బ్యాంక్ మాతృ సంస్థ SVB ఫైనాన్షియల్ గ్రూప్ ప్రకటించింది. ఆ తరువాత బ్యాంకు కష్టాల్లో కోరుకుపోయిందనే వార్త బయటకు వచ్చింది..