పరాగ్ అగర్వాల్ దానికి సరిపోడు: ఎలాన్ మస్క్

2023 సెప్టెంబర్ 12న ఎలాన్ మస్క్ బయోగ్రఫి పుస్తకం ఆవిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తక రచయిత వాల్టర్ జాక్సన్.. అతను మూడు సంవత్సరాల పాటు స్టడీ చేశారు. అయితే మస్క్ బయోగ్రఫీ పుస్తకానికి సంబంధించి వివరణతోపాటు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ పై చేసిన వ్యాఖ్యలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.  పుస్తకం సారాంశం ప్రకారం.. పరాగ్ అగర్వాల్, ఎలాన్ మస్క్ మార్చి 2022లో విందు కోసం కలుసుకున్నారు. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు […]

Share:

2023 సెప్టెంబర్ 12న ఎలాన్ మస్క్ బయోగ్రఫి పుస్తకం ఆవిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తక రచయిత వాల్టర్ జాక్సన్.. అతను మూడు సంవత్సరాల పాటు స్టడీ చేశారు. అయితే మస్క్ బయోగ్రఫీ పుస్తకానికి సంబంధించి వివరణతోపాటు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ పై చేసిన వ్యాఖ్యలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. 

పుస్తకం సారాంశం ప్రకారం.. పరాగ్ అగర్వాల్, ఎలాన్ మస్క్ మార్చి 2022లో విందు కోసం కలుసుకున్నారు. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి- ట్విట్టర్ సీఈఓతో సమావేశమైన తర్వాత మస్క్ ఇలా అన్నారట. అగర్వాల్ ఇలా నిజంగా మంచి వ్యక్తి..కానీ సీఈఓగా ఉండటానికి ఇది అవసరం లేదు. CEO కావాలంటే  ప్రజలు ఇష్టపడాల్సిన అవసరం లేదని మస్క్ అన్నాడట. 

అయితే సమావేశం తర్వాత ట్విట్టర్ స్టాక్ లను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు.. 2022 ఏప్రిల్ నాటికి అతిపెద్ద వాటాదారుగా మారాడు. దీంతో పాటు మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విట్టర్ విలువ 50 శాతానికి పైగా తగ్గింది. USD 44 బిలియన్లకు మస్క్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఐదు నెలల తర్వాత, సోషల్ మీడియా సైట్ విలువ USD 20 బిలియన్లకు చేరుకుంది. ఈ పరిణామాల తర్వాత అక్టోబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ సీఈఓగా వ్యవహరించారు. కానీ 2023 జూన్‌లో మస్క్ ఆ పదవి నుండి వైదొలిగి లిండా యక్కరినో కు అప్పగించారు. 

X లో  ఏమి జరుగుతోంది?

 తాజాగా ఎక్స్- ట్విట్టర్ మరో కీలక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఎక్స్‌లో తర్వలో ఆడియో, వీడియో కాల్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌గా ఆడియో, వీడియో కాల్స్ వంటి ఫీచర్లను X చూస్తుందని ఆగస్టు 31న ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్,పీసీ, మాక్ కి అనుకూలంగా ఉంటుందన్నారు. 

ఈ ఫీచర్ కోసం ఎటువంటి సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఫోన్ నంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. X అనేది ప్రభావవంతమైన గ్లోబల్ అడ్రస్ బుక్.. ఇది ప్రత్యేకమైనది’’ అంటూ మస్క్ ట్టిట్టర్ హ్యాండిల్ X లో రాసుకొచ్చారు. అయితే ఫీచర్ల లాంచ్ కి సంబంధించి ఎలాంటి తేదీ ఇవ్వలేదు. కానీ ఇందులోని ఫీచర్లన్ని యూనిక్ గా ఉంటాయని మస్క్ స్పష్టం చేశారు. జూలైలో కంపెనీ డిజైనర్ ఆండ్రూ కాన్వే ఈ ఫీచర్‌ను సూచించారు. X ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మారాలనే సంకల్పంతో ఎలోన్ మస్క్ ఆడియో, వీడియో కాల్‌ సౌకర్యాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

ఫేస్‌బుక్ ఇతర సైట్ల తరహాలోనే Xని పెద్ద బ్లాగింగ్ సైట్‌గా మార్చాలనే దృష్టితో మస్క్ కొత్త ఫీచర్లను తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 25న X ప్లాట్‌ఫారమ్‌లో ఆడియో, వీడియో ఫీచర్ల గురించి పోస్ట్ చేశారు మస్క్‌. ఇందులో ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు 2 గంటల వరకు సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేయడానికి అనుమతించడం, మొబైల్ నుంచి మెరుగైన ప్రత్యక్ష ప్రసారం నాణ్యత. ఆండ్రాయిడ్, ఐఓఎస్లో  వీడియో ప్లేయర్, కో-హోస్ట్‌లో మాట్లాడటం వంటివి ఉన్నాయి. వెబ్‌లో ఒక స్పేస్ – స్పేసెఎస్ లో  మిలియన్ల మంది పాల్గొనేవారికి మద్దతునిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మధ్య కేజ్ మ్యాచ్ జరుగుతుందని జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జూకర్ బర్గ్ మరోసారి మ్యాచ్‌కు సంబంధించిన విషయంపై ఆన్‌లైన్‌లో ఛాట్ చేసుకున్నారు. అసలు ఎలాన్ మాస్క్ తన కేజ్‌ఫైట్‌కు డేట్లు ఇవ్వడం లేదని జూకర్ బర్గ్ ఆరోపించారు. దీంతో మస్క్ తన ఇంటి తలుపు తట్టడానికి రేపటి వరకు వేచి చూడలేనంటూ స్పందించారు.

 ఇక వాళ్లు మాట్లాడుకున్న విషయాల్ని గమనిస్తే.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనతో కేజ్ ఫైట్‌ను తేలికగా తీసుకున్నారని జూకర్ బర్గ్ అన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా థ్రెడ్స్‌‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఎలాన్ మస్క్ గంభీరంగా తీసుకోవండ లేదు.. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. అయితే తాను ఇప్పటికే మస్క్‌కు డేట్ కూడా సూచించానని పేర్కొన్నారు.