స్పేస్ ఎక్స్ నుండి $1 బిలియన్ అప్పు తీసుకున్న ఎలాన్ మస్క్

మోస్ట్ పవర్‌ఫుల్‌ మెన్. అనుకుంటే ఏమైనా చేయగలడు. ఎవ్వరికీ భయపడడు. అది ప్రత్యర్థులు అయినా.. రష్యా ప్రెసిడెంట్ అయినా.. తనకు నచ్చినట్లు మాట్లాడతాడు. నచ్చినట్లు జీవిస్తాడు. ఒక్క ట్వీట్‌తో ప్రపంచ పరిస్థితులను తారుమారు చేయగల సత్తా ఆయనది. అపర కుబేరుడు. ఈ భూమి మీద ఆయనకున్న సందప మరెవరికీ లేదు. అయినా కూడా ఒక్కోసారి ఆఫీస్‌లోనే నిద్రపోతాడు. పని పిచ్చోడు.. రోజులో 18 గంటల పాటు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. డాన్స్‌లు వేస్తాడు. ఎప్పుడు ఎలా […]

Share:

మోస్ట్ పవర్‌ఫుల్‌ మెన్. అనుకుంటే ఏమైనా చేయగలడు. ఎవ్వరికీ భయపడడు. అది ప్రత్యర్థులు అయినా.. రష్యా ప్రెసిడెంట్ అయినా.. తనకు నచ్చినట్లు మాట్లాడతాడు. నచ్చినట్లు జీవిస్తాడు. ఒక్క ట్వీట్‌తో ప్రపంచ పరిస్థితులను తారుమారు చేయగల సత్తా ఆయనది. అపర కుబేరుడు. ఈ భూమి మీద ఆయనకున్న సందప మరెవరికీ లేదు. అయినా కూడా ఒక్కోసారి ఆఫీస్‌లోనే నిద్రపోతాడు. పని పిచ్చోడు.. రోజులో 18 గంటల పాటు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. డాన్స్‌లు వేస్తాడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, తన నెక్ట్స్ మూవ్ ఎలా ఉండబోతోందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది. ఇదంత ఎవరికి గురించి అనుకుంటున్నారా? ఆయనే ఎలాన్ మస్క్. ఇప్పుడు ఈయన గురించి ఎందుకని ఆలోచిస్తున్నారా? ట్విట్టర్ కొనుగోలుతో ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. టెక్ ప్రపంచంలోని అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటి. అందువల్ల మస్క్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనకు మస్క్ అనగానే టెస్లా గుర్తుకు వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ. ఈ కంపెనీ కొన్నేళ్ల కిందట దివాలా అంచులకు చేరింది. అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇక ఎలాన్ మస్క్ సంగతి అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఎలన్ మస్క్ కుంగిపోలేదు. పడిపోయిన చోటే మళ్లీ లేచినిల్చున్నారు. టెస్లాను విజయ పథంలో నడిపించారు. ఇప్పుడు ఈ కంపెనీ దూసుకుపోతోంది. ఈయన ప్రపంచ కుబేరుడిగా మారడానికి టెస్లా షేర్ల జోరు ప్రధాన కారణం.

ఎలాన్ మస్క్ ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారు. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ ఏమో. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. 2-3 రోజుల కిందట ఈయన ట్విట్టర్‌కు భారీ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆఫర్‌కు ట్విట్టర్ (డీల్ విలువ 44 బిలియన్ డాలర్లు) ఓకే చెప్పేసింది. కేవలం ఇదే కాదు.. గతంలో కూడా ఎలాన్ మస్క్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో కొన్ని విజయాలను అందిస్తే.. మరికొన్ని ఓటములను మిగిల్చాయి. ఓటమి వచ్చిందని కుంగిపోలేదు. విజయం వరించిందని పొంగిపోలేదు. ఎప్పటికీ ఒకే యాటిట్యూడ్‌తో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.

అప్పుల పాలు

ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎప్పుడూ ఇబ్బందులు ఎదర్కోలేదు. వాటిని విజయవంతంగా నిర్వహించాడు. కానీ ట్విటర్‌ (ఇప్పుడు ‘ఎక్స్‌’) మాత్రం మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పేందుకు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్‌ కొనుగోలు సమయంలో తనకు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ నుంచి 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా ఓ కథనం వెలువరించింది.

ట్విటర్‌ కోసమేనా..

స్పేస్‌ఎక్స్ గత అక్టోబర్‌లో ఎలాన్‌ మస్క్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించగా ఆ మొత్తాన్ని మస్క్ అదే నెలలో డ్రా చేశారని కొన్ని పత్రాలను చూపుతూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. కాగా అదే అక్టోబర్ నెలలో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విటర్‌ కొనుగోలు మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇందుకోసం స్పేస్‌ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని తెలిపింది. కాగా స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, దాదాపు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌లో దాఖలు చేసిన నివేదిక పేర్కొంది.