ఆ తేదిలోపు నామినేషన్ ఇవ్వకపోతే డీమ్యాట్ ఖాతా ఫ్రీజ్

మీకు కూడా డీమ్యాట్ ఖాతా ఉంటే, ఈ ముఖ్యమైన పనిని మార్చి 31లోపు పూర్తి చేయండి, లేకుంటే మీ డీమ్యాట్ ఖాతా ఫ్రీజ్ కావచ్చు. డీమ్యాట్ ఖాతా గురించి వినే ఉంటారు. కానీ చాలామందికి డీమ్యాట్ ఖాతా గురించి తెలియదు.. వాస్తవానికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. డీమ్యాట్ ఖాతాను తెరిచిన ప్రతి ఒక్కరూ ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిందే.. మార్చి […]

Share:

మీకు కూడా డీమ్యాట్ ఖాతా ఉంటే, ఈ ముఖ్యమైన పనిని మార్చి 31లోపు పూర్తి చేయండి, లేకుంటే మీ డీమ్యాట్ ఖాతా ఫ్రీజ్ కావచ్చు.

డీమ్యాట్ ఖాతా గురించి వినే ఉంటారు. కానీ చాలామందికి డీమ్యాట్ ఖాతా గురించి తెలియదు.. వాస్తవానికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా లేకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. డీమ్యాట్ ఖాతాను తెరిచిన ప్రతి ఒక్కరూ ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిందే.. మార్చి 31 నాటికి ప్రతి ఒక్కరూ తమ ఖాతాకు సంబంధించిన నామినేషన్ ఇవ్వాలి..

నామినేషన్ తప్పనిసరి..

డీమ్యాట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ వారి నామినిని ఎంచుకోవాలి.. లేదంటే నామినేషన్ ఆఫ్ట్ అవుట్ ఆప్షన్ అయినా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే మీ ఖాతాను ఫ్రీజ్ చేస్తారు దాంతో ఖాతాలో ఉన్న షేర్లు విక్రయించడానికి వీలుండదు.. నామినేషన్ సమర్పించిన తర్వాతే ఫ్రీజ్ చేసినా ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేస్తారు. 

నామినేషన్లను ఖాతాదారులందరికీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తప్పనిసరి చేసింది. డీమ్యాట్ ఖాతాలో 2023, మార్చి 31 తేదీలోగా నామినీని జోడించాలని, అప్‌డేట్ చేయాలని తెలిపింది. ఈ గడువులోగా ఆ పని చేయకపోతే.. డీమ్యాట్ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారుతుందని తెలిపింది. అప్పుడు ఇన్వెస్టర్లు మునుపటిలా షేర్‌లను ట్రేడ్ చేయలేరు. అంతేకాదు, డెబిట్‌ల కోసం కూడా అకౌంట్ పనికిరాదు. అంటే డీమ్యాట్ అకౌంట్ నుంచి డబ్బులు లేదా సెక్యూరిటీలను విత్‌డ్రా చేసుకోలేరు. కాబట్టి షేర్లను ట్రేడింగ్ చేయడానికి, ఆర్థిక నష్టాలను నివారించడానికి గడువుకు ముందే మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరును అప్‌డేట్ చేయడం చాలా మంచిది.

వారికి అవసరం లేదు..

మార్చి 31 నాటికి మీ ఖాతాకు సంబంధించిన నామినేషన్ ఆఫ్ట్  ఇన్ లేదా ఆఫ్ట్ అవుట్ ఆప్షన్ చేసుకోవాలని ఎన్ఎస్ డిఎల్ తన కస్టమర్లకు సూచించింది. వాస్తవానికి 2022 మార్చితో మొదటి గడువు ముగిసింది. దీనికి సెబి మరో ఏడాది గడువు ఇచ్చింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటికే తమ డీమ్యాట్ ఖాతాకు సంబంధించి నామినేషన్ ను రిజిస్టర్ చేసిన వారు తాజాగా మళ్లీ నామినిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో నామినిని ఇవ్వనివారు, చేసుకుని వారు మాత్రమే చేసుకోవాలి. గతంలో నామినినీ ఇచ్చినవారికి ఇది అవసరం లేదు వారి ఖాతాలు యధావిధిగా పనిచేస్తాయి. మార్చి 31 తర్వాత కూడా వారి ఖాతాలు పనిచేస్తాయి. ఇప్పటివరకు నామినేషన్ ఇవ్వని వారికే ఈ సరికొత్త నిబంధనలు వర్తిస్తాయి.. 

నామినేషన్ ఎందుకంటే..

నామినేషన్ ఉన్న ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఖాతా తెరిచే సమయంలో దీని గురించి చాలామంది పట్టించుకోరు కానీ.. సదరు ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లో దాన్ని క్లైమ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు లేదంటే.. వారి వారసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సెబీ ఈ నిబంధనను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ఖాతాలో మై అకౌంట్ లేదా నామినేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆన్లైన్లో అంతా డిజిటల్ గానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ప్రాసెస్ చేయడానికి ఐదు నిమిషాల సమయం కూడా పట్టదు. మీ అకౌంట్ కు నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. మీరు చేసే చిన్న తప్పు మీ వారికి ఇబ్బందులు కలిగించకూడదని గుర్తుంచుకుంటే వెంటనే డీమ్యాట్ ఖాతాకి నామినేషన్ ఇవ్వండి.