ఈపీఎఫ్, పీపీఎఫ్ మధ్య తేడా ఏంటి? ఏ పథకం ఎవరి కోసమంటే..?

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వేతర ఉద్యోగి తప్పకుండా తమ జీతంలో నెలవారి ఆదాయం నుండి చిన్న మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది తప్పనిసరిగా జమ చేయాల్సిన అంశం. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఉద్యోగి ఇబ్బంది పడకుండా ఉండడానికి కేంద్రం ఇలాంటి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పీఎఫ్ లో దాచుకునే డబ్బు పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ప్రధాన మూలధనంగా మారుతుంది. ప్రతి ఉద్యోగి సంపాదనలో ప్రతినెలా కొంత […]

Share:

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వేతర ఉద్యోగి తప్పకుండా తమ జీతంలో నెలవారి ఆదాయం నుండి చిన్న మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది తప్పనిసరిగా జమ చేయాల్సిన అంశం. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఉద్యోగి ఇబ్బంది పడకుండా ఉండడానికి కేంద్రం ఇలాంటి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా పీఎఫ్ లో దాచుకునే డబ్బు పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ప్రధాన మూలధనంగా మారుతుంది. ప్రతి ఉద్యోగి సంపాదనలో ప్రతినెలా కొంత కొంత మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ ద్వారా డిపాజిట్ చేసి.. పదవి విరమణ తర్వాత వడ్డీతో కలిపి ఉద్యోగికి ఈ డబ్బు అందించడం జరుగుతుంది.

ముఖ్యంగా ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పిఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  వాటిలో ముఖ్యంగా ఈపీఎఫ్ , పీపీఎఫ్ పథకాల గురించి తెలుసుకోవాలి. అయితే చాలా మందికి వీటి  మధ్య తేడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వీటి మధ్య తేడాను అలాగే ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు ఈ పథకాలు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

పీపీఎఫ్..

వాస్తవానికి పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు ప్రతి ఏడాది నిర్ణయించబడుతుంది. మరోవైపు పీపీఎఫ్ పథకం పై వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం సవరిస్తుంది. మరి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు నిర్ణయించే బాధ్యతను ఈపీఎఫ్ఓ తీసుకుంటే.. దీని ఆమోదాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. పీపీఎఫ్ అనేది ప్రభుత్వ పథకం..ఇక జీపీఎఫ్ అనేది జనరల్ ఫ్రావిడెడ్ ఫండ్.. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి.

ఈపీఎఫ్..

ఇక ఈపీఎఫ్.. ఎవరికి వర్తిస్తుంది?  ఎలా పనిచేస్తుంది? అనే విషయానికి వస్తే.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది పూర్తిస్థాయి పెట్టుబడి పథకం.. ప్రతి ఉద్యోగికి ఈ పథకం అందుబాటులో ఉంది. అందుకే వారి ఖాతా నుండి ప్రతినెల కొంత మొత్తం జమ చేయబడుతుంది. ఇకపోతే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులందరి సహకారాన్ని రక్షిస్తుంది. ఈపీఎఫ్ అనేది అన్ని రకాల ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన పెట్టుబడి పథకం.. కేంద్రం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఉన్న ఏ కంపెనీ అయినా సరే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ ను కలిగి ఉండడం తప్పనిసరి. ఈ క్రమంలోని ఈపీఎఫ్ మొత్తం ప్రతి ఉద్యోగి జీతంలో నుండి కొంత మొత్తం తీసివేయబడుతుంది.  ఉదాహరణకు ఉద్యోగికి వచ్చే బేసిక్ శాలరీలో 12 శాతం, కంపెనీ కూడా 12 శాతం కలిపి పిఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇందులో 8.33 శాతం ఉద్యోగి ఈపీఎస్ ఖాతాలో,  మిగిలిన 3.67 ఈపీఎఫ్ లో జమ చేస్తారు.  మొత్తంగా ఈపీఎఫ్ పై 8.65 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇక పీపీఎఫ్ విషయానికి వస్తే.. ఇది ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం.. ఈ ఖాతాను ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ నుండి మనం తెరవచ్చు. ఇందులో ఉద్యోగి మాత్రమే కాదు సాధారణ పౌరులు కూడా ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది.  దీనిపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది.  అలాగే పీపీఎఫ్ లో పెట్టుబడికి 80 C  సెక్షన్ కింద  రూ.1.5లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇది కూడా భారత ప్రభుత్వం చేత ఆమోదించబడింది. కాబట్టి మెచ్యూరిటీ తర్వాత ఎటువంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags :