ధూత్ కి వార్నింగ్ ఇచ్చిన దీపక్ కొచ్చర్‌

చర్చ్‌గేట్‌లోని సీసీఐ ఛాంబర్స్‌లోని ఫ్లాట్‌ను తమకు బదిలీ చేయాలని, లేదంటే వీడియోకాన్ గ్రూప్‌లోని రుణాల ఖాతాలన్నీ నాన్‌గా ప్రకటిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను బెదిరించారు. పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చార్జిషీట్ లో పేర్కొంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో మార్చిలో దాఖలు చేసిన చార్జిషీట్ గత వారంలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్‌ను బదిలీ […]

Share:

చర్చ్‌గేట్‌లోని సీసీఐ ఛాంబర్స్‌లోని ఫ్లాట్‌ను తమకు బదిలీ చేయాలని, లేదంటే వీడియోకాన్ గ్రూప్‌లోని రుణాల ఖాతాలన్నీ నాన్‌గా ప్రకటిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను బెదిరించారు. పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPA), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చార్జిషీట్ లో పేర్కొంది.

ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో మార్చిలో దాఖలు చేసిన చార్జిషీట్ గత వారంలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్‌ను బదిలీ చేయడం వల్ల తన భార్యకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఆమె జైలుకు వెళ్లే అవకాశం ఉందని దీపక్ కొచ్చర్‌ని ధూత్ హెచ్చరించినట్లు తెలుస్తుంది 

చందా కొచ్చర్ ప్రైవేట్ బ్యాంక్‌ వ్యవహారాలు నడిపినప్పుడు వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలకు ₹1,875 కోట్ల రుణాల మంజూరులో అవకతవకలపై సీబీఐ విచారణ ప్రారంభించింది.  మొత్తం బకాయిలు ₹1,730 కోట్లుగా చూపబడ్డాయి, FIR నమోదు చేసినప్పుడు అందులో ₹1,033 కోట్లు బకాయిలు ఉన్నాయి.

సిబిఐ తన ఛార్జిషీట్‌లో, ధూత్‌తో సంబంధం ఉన్న ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్ల వాంగ్మూలాలను జతచేసింది, దీపక్ కొచ్చర్ ధూత్‌ను తన కంపెనీలో ₹64 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎలా ఎర చూపాడు మరియు తరువాత CCI ఛాంబర్స్ ఫ్లాట్‌ను వారి కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేయమని ధూత్‌ను బలవంతం చేసారు అని తెలిపారు 

2016లో ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌ల మధ్య జరిగిన మీటింగ్‌పై సీబీఐ తనను ప్రశ్నించిందని గలాండే తన ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ గొడవకు దిగడం గమనించిన గలాండే కొన్ని డాక్యుమెంటేషన్ కోసం ధూత్‌ను చూడటానికి వెళ్లినట్లు తెలిపారు

45 CCI ఛాంబర్స్‌లోని ఫ్లాట్ తనదేనని చెబుతున్న ధూత్ మరియు దీపక్ కొచ్చర్ మధ్య అసహ్యకరమైన వాగ్వాదం జరిగింది” అని గలాండే తన ప్రకటనలో తెలిపారు. “తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ₹5.38 కోట్లు చెల్లించానని, ఫ్లాట్ టైటిల్‌ను విడుదల చేశానని, అది తనకు చెందినదని ధూత్ అతనికి చెప్పరూ . ధూత్ కొచ్చర్‌లను అక్కడ ఊరికే  ఉండేందుకు అనుమతించారని అంటే అది దీపక్ కొచ్చర్ ఫ్లాట్ అని కాదు,అని గలాండే తన ప్రకటనలో తెలిపారు..

చందా కొచ్చర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నందున, ఫ్లాట్‌ను ఆ విధంగా బదిలీ చేయవద్దని ధూత్ కొచర్‌ను హెచ్చరించినట్లు గలాండే తెలిపారు. చందా కొచ్చర్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఫ్లాట్‌ని బదిలీ చేయవద్దని ధూత్ అతనికి చెప్పాడు, జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీతో తో  జైలు గదిని పంచుకోవలసి వస్తుంది  అని ఆయన హెచ్చరించారు . ఆ మాటకి ఆగ్రహించిన దీపక్ కొచ్చర్ తన సలహాను వినమని ధూత్‌తో చెప్పాడు, లేకుంటే అతనిని నాశనం చేస్తాను అని బెదిరించాడు అని గలాండే పేర్కొన్నారు. 

దీపక్ కొచ్చర్ వీడియోకాన్ కార్యాలయంలో ధూత్‌ను కలిశారూ  మరియు  విద్యుత్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ₹64 కోట్ల పెట్టుబడిని అడిగాడు. అతను తన విండ్ పవర్ డివిజన్ కోసం ఒక కొత్త వెంచర్‌ను విలీనం చేయడానికి ఒక వెబ్ నిర్మాణాన్ని సృష్టించాడు మరియు దానికి న్యూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ అని పేరు పెట్టాడు, అని పుంగ్లియా తన ప్రకటనలో తెలిపారు. 

అయితే, ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో తన భర్త వ్యాపార లావాదేవీల గురించి వెల్లడించడం తప్పనిసరి. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం ఆమె రుణాలపై నిర్ణయం తీసుకునే కమిటీలో భాగం కాకూడదు అని తెలిపారు