స్విగ్గీకి డేల్ వాజ్ రాజీనామా.. ఆయన స్థానంలో ఎవరంటే…

ఈ మధ్యకాలంలో వరుసగా ప్రధాన కంపెనీలలోని వ్యక్తులు ఆయా కంపెనీలకి రిజైన్ ఇచ్చేస్తున్నారు.. చాలామంది పాపులర్ వ్యక్తులు ఇటీవల రాజీనామా చేసిన సంగతి చూస్తూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలో స్విగ్గీకి కూడా రాజీనామా చేశారు.. ఈయన స్విగ్గీకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది.. మిగతా దేశాలలో కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు.. అసలు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. డేల్ వాజ్ స్విగ్గీకి రాజీనామా..  […]

Share:

ఈ మధ్యకాలంలో వరుసగా ప్రధాన కంపెనీలలోని వ్యక్తులు ఆయా కంపెనీలకి రిజైన్ ఇచ్చేస్తున్నారు..

చాలామంది పాపులర్ వ్యక్తులు ఇటీవల రాజీనామా చేసిన సంగతి చూస్తూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలో స్విగ్గీకి కూడా రాజీనామా చేశారు.. ఈయన స్విగ్గీకి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది.. మిగతా దేశాలలో కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు.. అసలు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

డేల్ వాజ్ స్విగ్గీకి రాజీనామా.. 

స్విగ్గీలో ఒక వారం వ్యవధిలోనే సీనియర్ మేనేజ్మెంట్ లో రెండవ నిష్క్రమణలు గుర్తించిన డేల్ వాజ్ స్విగ్గీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశారు. ఈయన రాజీనామా వచ్చే నెల నుంచి అమలు కానుంది అప్పటివరకు కంపెనీలో కొనసాగుతారు.

మధుసూదన్ రావు..

వాజ్ తరువాత మధుసూదన్ రావు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈయన ఫిన్టెక్ సీనియర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా స్విగ్గీలో ప్రధానమైన లీడ్ పొజిషన్ లో కూడా ఉన్నారు. ఈ కామర్స్ దిగ్గజానికి 11 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయనకు అమెజాన్ లో పనిచేసిన అనుభవం ఉంది. మే తర్వాత నుంచి మధుసూదన్ రావు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాధ్యతలు తీసుకోనున్నారు.. ఆహారం, కిరాణా డెలివరీలో మంచిపేరు తెచ్చుకున్న ఈ దిగ్గజ కంపెనీకి ఇప్పుడు ఇబ్బందికరమైన సమయం అనే చెప్పుకోవాలి. 

ఫుడ్ డెలివరీ వ్యాపారంలో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ మాత్రం స్విగ్గీ జోమాటోల మధ్య ఉంది. ఈ రెండు ఫుడ్ డెలివరీ స్టార్ట్ అప్ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నప్పటికీ లాభాల్లోకి రావడం లేదు.. పైగా గతంలో కంటే నష్టాలు పెరగడం వీటి పరిస్థితికి అద్దం పడుతోంది.   

భారీగా నష్టాలు.. 

ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ఫ్లాట్ ఫామ్ స్విగ్గీ 2022లో భారీగానే నష్టాలను చవిచూసింది.. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 3628 కోట్లను నష్టపోయింది.. బిజినెస్ ఇంటిలిజెంట్ ఫ్లాట్ ఫామ్ పాపులర్ యాక్సెస్ చేసిన ఆర్థిక డేటా ప్రకారం.. ఈ విషయం వెల్లడైంది. ఇంతకుముందు సంవత్సరం కంపెనీ నష్టాలు 1616 కోట్లకు ఉండగా.. ఒక్కసారిగా ఈ కంపెనీ నష్టాలు రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వ్యాపార కార్యకలాపాల ద్వారా స్విగ్గీ 5 వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సమీక్షలో ఉన్న ఆర్థిక సంవత్సరంలో దానికి మొత్తం ఆదాయం ఏడాది క్రితం రెండు రెట్లు పెరిగి ఆరువేల కోట్లకు చేరింది.. కరోనా తర్వాత వ్యాపారం పునరుద్ధరణ, విస్తరణపై దృష్టి సారించినట్లు ఈ కంపెనీ తెలిపింది.

పొదుపుచర్యలో భాగంగా స్విగ్గీ తమ క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్నితీసుకొచ్చింది. తన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కిచెన్స్ ఏ కు అమ్మేసినట్లు కూడా ఇటీవల తెలిపింది. ఇప్పటికే వ్యయాలను తగ్గించుకునే పనిలో భాగంగా 380 మంది ఉద్యోగులను తొలగించి, అంచనాలకు అనుగుణంగా వ్యాపార వృద్ధి చోటు చేసుకోవడం లేదని.. ఈ నేపథ్యంలో లాభదాయకత పై ప్రభావం చూపుతున్న పరోక్ష వ్యాయాలను సమీక్షించుకోవలసి వస్తుందని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష తెలిపారు. రెస్టారెంట్లు లేని ప్రాంతంలో ఫుడ్ డెలివరీకి డిమాండ్ ఉన్నచోట్ల ప్రత్యేకంగా డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 2017లో స్విగ్గీ యాక్సెస్ ను ప్రారంభించింది. ఇందుకోసం 175 కోట్ల వ్యయాన్ని కూడా ఖర్చుపెట్టినట్లు అప్పట్లో తెలిపింది. కిచెన్ క్లౌడ్ ను ఎంత మొత్తానికి విక్రయించిందనేది తెలుపలేదు. ఇలా స్విగ్గీ కొన్నాళ్లుగా వరుసగా నష్టాల బాట పట్టింది.