Dabur India: డాబర్ ఇండియా ఉత్పత్తుల్లో కాన్సర్ కారకాలు..

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్(Dabur) వివాదాల్లో చిక్కుకుంది. డాబర్ కేశ సౌందర్య ఉత్పత్తులు కాన్సర్(Cancer) కు కారణమవుతున్నాయంటూ అమెరికా(America), కెనడా(Canada) న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. డాబర్ కంపెనీ(Dabur Company)కి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ(LLC), డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్ సీ, డాబర్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్టు డాబర్ ఇండియా(Dabur India) ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జాన్సన్(Johnson) అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌(Johnson Baby Powder)లో కాన్సర్ కారకాలున్నట్టు […]

Share:

ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్(Dabur) వివాదాల్లో చిక్కుకుంది. డాబర్ కేశ సౌందర్య ఉత్పత్తులు కాన్సర్(Cancer) కు కారణమవుతున్నాయంటూ అమెరికా(America), కెనడా(Canada) న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. డాబర్ కంపెనీ(Dabur Company)కి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ(LLC), డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్ సీ, డాబర్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్టు డాబర్ ఇండియా(Dabur India) ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల జాన్సన్(Johnson) అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌(Johnson Baby Powder)లో కాన్సర్ కారకాలున్నట్టు ఆరోపిస్తూ వేలాది మంది కోర్టుల్లో దావాలు వేశారు. కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ప్రస్తుతం డాబర్ కంపెనీ ఉత్పత్తుల వాడకం వల్ల అండాశయ, గర్భాశయ కాన్సర్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ అమెరికా, కెనడాలోని పలువురు కోర్టుల్లో దావాలు వేశారు.

కేశ సంరక్షణ(hair care) ఉత్పత్తుల వల్ల అండాశయ, గర్భాశయ కాన్సర్(Cervical cancer) సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ అమెరికా, కెనడాలోని పలువురు దావా వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ఈ వ్యాజ్యలకు సంబంధించిన కేసులు.. ఆరంభ ఆవిష్కరణ దశలలో ఉన్నాయి’ అని పేర్కొంది. అంతేకాదు, ఈ ఆరోపణలు నిరాధారమైన, అసంపూర్ణ అధ్యయనం ఆధారంగా చేసేనవేనని ఆ సంస్థ తెలిపింది.

నమస్తే ల్యాబొరేటరీస్(Namaste Laboratories), డెర్మోవివా స్కిన్ ఎస్సెన్షియల్స్(Dermoviva Skin Essentials), డాబర్ ఇంటర్నేషనల్‌(Dabur International)తో సహా పలు కంపెనీలపై దాదాపు 5,400 కేసులకు సంబంధించిన వ్యాజ్యాలన్నీ ఇల్లినాయిస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఉన్నాయని డాబర్ ఇండియా వెల్లడించింది. ఈ ఆరోపణలను ఆయా యూనిట్లు తిరస్కరించాయని, తమ తరఫున లాయర్‌ను కూడా నియమించాయని చెప్పింది.

వాటికా షాంపూ, హోనిటస్ దగ్గు సిరప్ బ్రాండ్‌లను విక్రయించే డాబర్ ఇండియా(Dabur India).. ఈ దశలో సెటిల్‌మెంట్ లేదా తీర్పు ఫలితాల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను నిర్ణయించలేమని వ్యాఖ్యానించింది. అయితే సమీప భవిష్యత్తులో భద్రత ఖర్చులు పెరుగుతాయని అంచనా వేస్తోంది. కాగా, దీనిపై అదనపు వివరాల కోసం సంప్రదించగా.. కంపెనీ వెంటనే స్పందించలేదు.

శిరోజాలు నిగనిగ లాడుతూ, కోరుకున్న విధంగా ఉంచడంలో హెయిర్ స్ట్రెయిటనర్(Hair straightener), హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు సాయపడతాయి. వీటిల్లో ఎండోక్రైన్ వ్యవస్థకు విఘాతం కలిగించే కెమికల్స్ ను వాడుతుంటారు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు(Health problems) వస్తాయనే వాదన ఉంది. సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయంటూ గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు దాఖలు కావడం గమనార్హం.

కాగా, ఇటీవల డాబర్ తేనె(Honey)లో కాన్సర్ కారకాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు వినియోగదారుల్లో అలజడి రేపిన విషయం తెలిసిందే. సంఘటిత తేనె మార్కెట్లో డాబర్ కంపెనీకి ఎక్కువ వాటా కలిగి ఉంది. డాబర్ తేనెలో కార్సినోజెనిక్ మెటీరియల్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలను డాబర్ ఇండియా ఖండించింది.

మరోవైపు, మంగళవారం మేజర్ వడ్డీ, పెనాల్టీతో సహా రూ. 320.60 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డాబర్ ఇండియాకు ఐటీ నోటీసులు అందాయి. దీనిపై కూడా స్పందించిన ఆ సంస్థ.. సంబంధిత అధికారుల ముందు నోటీసును సవాలు చేస్తామని తెలిపింది. ‘CGST చట్టం, 2017లోని సెక్షన్ 74(5) ప్రకారం చెల్లించాల్సిన పన్ను గురించి కంపెనీకి సమాచారం అందింది.. దీనిలో GST షార్ట్ పేమెంట్ / చెల్లించని మొత్తం రూ. 320.60 కోట్లతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాలని సూచించారు. విఫలమైతే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు’ అని డాబర్ కంపెనీ పేర్కొంది.