సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ మించితే టాక్స్ బాదుడు

ఎవరైనా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, ముఖ్యంగా డబ్బులు దాచుకోవడం విషయంలో పలు బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అంత ఉత్తమమైన పని మరొకటి లేదు అని భావిస్తారు కదా. ముఖ్యంగా చేతిలో ఉంటే డబ్బులు ఈజీగా ఖర్చు అయిపోతాయేమో అని చాలామంది సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ క్రమంలోనే చాలామందికి ఎన్నో రకాల డౌట్స్ ఏర్పడతాయి. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బాలన్స్ ఎంత ఉండాలి. ఎంత దాచుకుంటే […]

Share:

ఎవరైనా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, ముఖ్యంగా డబ్బులు దాచుకోవడం విషయంలో పలు బ్యాంకులో డబ్బులు దాచుకోవడం అంత ఉత్తమమైన పని మరొకటి లేదు అని భావిస్తారు కదా. ముఖ్యంగా చేతిలో ఉంటే డబ్బులు ఈజీగా ఖర్చు అయిపోతాయేమో అని చాలామంది సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ క్రమంలోనే చాలామందికి ఎన్నో రకాల డౌట్స్ ఏర్పడతాయి. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బాలన్స్ ఎంత ఉండాలి. ఎంత దాచుకుంటే టాక్స్ పడకుండా ఉంటుంది. ఇలా చాలా సందేహాలు తమలో ఉంటాయి. ఈ సందేహాలు అన్ని పోవాలంటే, ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది..

ఈ విషయాలు మీ కోసమే:

బ్యాంకింగ్ ఫైనాన్స్ విషయాల్లోకి వస్తే మనం ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్కమ్ టాక్స్ రెగ్యులేషన్స్ గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలి. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ విషయానికి వస్తే, డిపాజిట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డిపాజిట్ విషయాలలో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి.  సేవింగ్స్ అకౌంట్స్ తో డిపాజిట్ కొంత మొత్తం దాటితే కనుక, తప్పకుండా ఇన్కమ్ టాక్స్ పే చేయాల్సి ఉంటుంది మరి.

సేవింగ్స్ ఎకౌంట్ ఓపెన్ చేసిన అనంతరం, మనం ఎంత మొత్తంలో అయినా డబ్బు వేసుకోవచ్చు కానీ, రోజుకి కేవలం లక్ష రూపాయల డిపాజిట్ మాత్రమే, సేవింగ్స్ అకౌంట్ లో వేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒకేసారి రెండున్నర లక్షల వరకు ఒకరోజు డిపాజిట్ వేసుకోవచ్చు. ఇక వార్షిక సేవింగ్స్ అకౌంట్ లో లిమిట్, అంటే మనం సంవత్సరంలో మన సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 10 లక్షల కన్నా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన పర్వాలేదు కానీ, మన యాన్యువల్ డిపాజిట్ పది లక్షలు దాటితే తప్పకుండా ఐటీ డిపార్ట్మెంట్ కు టాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గైడ్లైన్స్ ప్రకారం, ఎవరి అకౌంట్ నుంచి అయినా వార్షిక క్యాష్ డిపాజిట్ పది లక్షలకు మించి ఉంటే కనుక, బ్యాంకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటారు? కచ్చితంగా కాస్త వడ్డీ పడుతుంది అనే ఉద్దేశంతో కదా.. అయితే ప్రతి బ్యాంకు తాము ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ వేస్తామని చెప్పి కష్టమర్స్ ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మనం బ్యాంకులో మనం జమ చేసిన మొత్తానికి ఇంట్రెస్ట్ 10,000 దాటితే గనుక వాటికి కూడా మనం టాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 

అందుకే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన వార్షిక డిపాజిట్ కచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా టాక్స్ నుంచి మినహాయించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఐ టి ఆర్ ఫామ్ ఎప్పటికప్పుడు మనం ఫిల్ చేసుకుంటూ ఉంటే మనం కట్టిన టాక్స్ డిడక్షన్స్ మళ్లీ మనకి వాపస్ వచ్చి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం సేవింగ్స్ అకౌంట్స్ లో పది లక్షలకు మించి డిపాజిట్ చేయకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఇంకా చెప్పాలంటే ఫిక్స్ డిపాజిట్ వేసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా, మన డబ్బు అనేది వృధాగా టాక్స్ రూపంలో వెళ్లి పోవలసిన అవసరం ఉండదు. మన చేతిలో ఉన్న మొత్తం బట్టి మనం ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయడం ఉత్తమమో మనమే డిసైడ్ చేసుకోవాలి. లేదంటే అనవసరంగా టాక్స్ బారిన పడే అవకాశం ఉంటుంది.