బైజుస్ లో 4,000 ఉద్యోగులకు ముప్పు

ఈ సంవత్సరంలో చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు సైతం, లే ఆఫ్స్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ నుంచి ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి వరకు ప్రస్తుతం లే ఆఫ్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం బైజూస్ కూడా అదే బాటలో నడవనున్నట్లు సమాచారం. సుమారు నాలుగు వేల ఉద్యోగులకు ముప్పు తప్పదు అంటున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ […]

Share:

ఈ సంవత్సరంలో చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు సైతం, లే ఆఫ్స్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ నుంచి ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి వరకు ప్రస్తుతం లే ఆఫ్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం బైజూస్ కూడా అదే బాటలో నడవనున్నట్లు సమాచారం. సుమారు నాలుగు వేల ఉద్యోగులకు ముప్పు తప్పదు అంటున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ Byju’s అప్లికేషన్. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం చాలామంది పేరెంట్స్ మొదట ఎంపిక చేసుకున్నది Byju’s యాప్. 

లేఅఫ్ బాటలో బైజుస్!: 

అనేక నివేదికల ప్రకారం, edtech సంస్థ తన కొత్త భారతదేశ CEO ఆధ్వర్యంలో భారీ పునర్నిర్మాణ దశలో భాగంగా మరొక రౌండ్ లేఆఫ్ కు ప్లాన్ చేస్తోంది, ఇది 4,000 ఉద్యోగాలపై ప్రభావం శోభన ఉన్నట్లు సమాచారం.

కంపెనీ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ విధుల్లోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత తాజా లే ఆఫ్ సమాచారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. livemint.com ప్రకారం, లేఆఫ్‌లు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సీనియర్ మేనేజ్‌మెంట్ ఖర్చులపై సంస్థ అధిక ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ప్రస్తుతం లేఆఫ్స్ ఉంటున్నట్లు సమాచారం.

అర్జున్ మోహన్ నిన్న కొంతమంది సీనియర్ సిబ్బందితో సమావేశమయ్యారు. వారిలో ఉన్న కొంతమంది టీం చెప్పిన దాన్ని బట్టి, కొత్తగా రాబోతున్న కొన్ని రూల్స్ ప్రకారం కొంతమందికి ముప్పు తప్పదు అని, వారికి తెలియజేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంతవరకు ఎవరినీ తొలగించలేదని, ఈ వారంలోగానీ, వచ్చేవారం ప్రారంభంలోగానీ లేఆఫ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

ఇటీవల బయటపడిన వాల్యుయేషన్ సమస్యలు, నిధుల సమస్యలు, లేఆఫ్‌లు, ఉన్నత స్థాయి రాజీనామాలు మరియు లోన్ కి సంబంధించిన ఒత్తిడి, కొనసాగుతున్న న్యాయపోరాటం వంటి కారణాలతో బైజూస్ కష్ట కాలాన్ని ఎదుర్కొంటుందని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు భారతదేశపు అత్యంత విలువైన స్టార్టప్‌గా ఉన్న కంపెనీ, 2021 తర్వాత భారతదేశంలో ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన డిమాండ్ క్షీణించడంతో, ఖర్చులను తగ్గించడానికి మరియు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 

Byju’s గురించి మరింత: 

ఈ అప్లికేషన్ 2015లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే 2017 నుంచి భారత దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం మరింత అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ అప్లికేషన్ ఉపయోగించే వినియోగదారులు ఎక్కువయ్యారు. ముఖ్యంగా 2020లో, బైజుస్ అప్లికేషన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థాపించుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉండి పాటలు నేర్చుకునేందుకు ఈ అప్లికేషన్ చాలా వరకు ఉపయోగపడింది. అంతే కాదు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న Byju’s అప్లికేషన్ వైపు విదేశీ పెట్టుబడిదారులు కూడా మక్కువ చూపించారు. 

ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉంటున్న వారికి Byju’s అప్లికేషన్ తన వంతు సహకారాన్ని అందించింది. 60 శాతం మంది గ్రామీణ విద్యార్థులు Byju’s ద్వారా చదువుకోగలుగుతున్నారు. అంతేకాకుండా Byju’s అప్లికేషన్లు అందుబాటులో ఉండే మరెన్నో ఎగ్జామ్ కోర్సులు, కాంపిటేషన్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండడం వల్ల, ఉపాధి కూడా సంపాదించగలుగుతున్నారు. ఇలా అనేకమైన తరహాల్లో, Byju’s అప్లికేషన్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

అకడమిక్ సబ్జెక్ట్‌లు మరియు కాన్సెప్ట్‌లు 12-20 నిమిషాల డిజిటల్ యానిమేషన్ వీడియోలతో ఈ అప్లికేషన్ లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రతి కాన్సెప్టు క్లుప్తంగా, స్వయంగా అర్థం చేసుకొని నేర్చుకుంటారు. Byju’s నివేదికల ప్రకారం, మొత్తం 40 మిలియన్ల వినియోగదారులు, 3 మిలియన్ల ప్రీమియం వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 2018లో, యాప్ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు విస్తరించింది.