Byjus: 2250 కోట్లు న‌ష్ట‌పోయిన‌ట్లు వెల్ల‌డించిన బైజూస్

Byju’s: ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App). ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం చాలామంది పేరెంట్స్ మొదట ఎంపిక చేసుకున్నది బైజూస్ (Byju’s) యాప్. కానీ కరోనా తర్వాత, బైజూస్ (Byju’s) తీవ్ర నష్టాల్లో (Loss) కూరుకుపోయినట్లు తెలుస్తోంది. నష్టాల్లో (Loss) నుంచి బయట పడేందుకు మార్గాలు వెతుకుతోంది బైజూస్ (Byju’s).  […]

Share:

Byju’s: ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టడీ మెటీరియల్స్ అందిస్తుంది ఈ బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App). ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లల ఆన్లైన్ తరగతుల కోసం చాలామంది పేరెంట్స్ మొదట ఎంపిక చేసుకున్నది బైజూస్ (Byju’s) యాప్. కానీ కరోనా తర్వాత, బైజూస్ (Byju’s) తీవ్ర నష్టాల్లో (Loss) కూరుకుపోయినట్లు తెలుస్తోంది. నష్టాల్లో (Loss) నుంచి బయట పడేందుకు మార్గాలు వెతుకుతోంది బైజూస్ (Byju’s). 

నష్టాల్లో ఉన్నట్లు వెల్లడించిన బైజూస్: 

బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థ బైజూస్ (Byju’s) పేరెంట్ థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్. మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 22.5 బిలియన్ రూపాయల ($271 మిలియన్లు) నష్టాన్ని (Loss) నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం 24 బిలియన్ రూపాయల నష్టంతో పోలిస్తే, రెండు బిలియన్ల నష్టం కవర్ చేసినట్లు వెల్లడించింది బైజూస్ (Byju’s). అయితే మరోపక్క సంస్థ మొత్తం ఆదాయం రెండింతలు పెరిగి 35.7 బిలియన్ రూపాయలకు చేరుకుంది. కానీ ఇప్పటికీ ఉన్న $1.2 బిలియన్ల రుణ (Debt) వివాదం, బైజూస్ (Byju’s) చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. రుణాలు (Debt) అందించిన వాళ్లు, బైజూస్ (Byju’s) మీద దావా వేశారు. అయితే ఒకప్పుడు విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించారనే అనుమానంతో ఆర్థిక నేరాల-పోరాట ఏజెన్సీ కూడా సంస్థపై రిపోర్ట్ చేసింది మరియు $1.2 బిలియన్ల టర్మ్ రుణాన్ని (Debt) పునర్నిర్మించడంపై చట్టపరమైన వివాదంలో బైజూస్ (Byju’s) చిక్కుకుంది.

ఒకప్పుడు బైజూస్ (Byju’s) భారత దేశ నేషనల్ క్రికెట్ టీంకు స్పాన్సర్ గా వ్యవహరించింది. ఇదే ఎంతో మంది పెట్టుబడిదారులకు (investors) బైజూస్ (Byju’s) వైపు మక్కువ చూపించేలా చేసింది అని చెప్పుకోవచ్చు. కానీ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత నుండి వృద్ధి మందగించింది. బైజూస్ (Byju’s) ప్రధాన పెట్టుబడిదారులలో (investors) ఒకరైన ప్రోసస్ NV, జూన్‌లో దాని హోల్డింగ్ విలువను తగ్గించింది, ఇది స్టార్టప్ యొక్క మొత్తం విలువను $5.1 బిలియన్‌గా నిర్ణయించింది. గత సంవత్సరంలాగానే, బైజూస్ (Byju’s) $22 బిలియన్ల నిధులను సేకరించింది. 

బైజూస్ గురించి మరింత: 

ఈ అప్లికేషన్ (App) 2015లో ఇంప్లిమెంట్ చేశారు. అయితే 2017 నుంచి భారత దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం మరింత అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ అప్లికేషన్ (App) ఉపయోగించే వినియోగదారులు ఎక్కువయ్యారు. ముఖ్యంగా 2020లో, బైజుస్ అప్లికేషన్ (App) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థాపించుకుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉండి పాటలు నేర్చుకునేందుకు ఈ అప్లికేషన్ (App) చాలా వరకు ఉపయోగపడింది. అంతే కాదు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App) వైపు విదేశీ పెట్టుబడిదారులు (investors) కూడా మక్కువ చూపించారు. 

ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉంటున్న వారికి బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App) తన వంతు సహకారాన్ని అందించింది. 60 శాతం మంది గ్రామీణ విద్యార్థులు బైజూస్ (Byju’s) ద్వారా చదువుకోగలుగుతున్నారు. అంతేకాకుండా బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App)లు అందుబాటులో ఉండే మరెన్నో ఎగ్జామ్ కోర్సులు, కాంపిటేషన్ ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండడం వల్ల, ఉపాధి కూడా సంపాదించగలుగుతున్నారు. ఇలా అనేకమైన తరహాల్లో, బైజూస్ (Byju’s) అప్లికేషన్ (App) తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 

అకడమిక్ సబ్జెక్ట్‌లు మరియు కాన్సెప్ట్‌లు 12-20 నిమిషాల డిజిటల్ యానిమేషన్ వీడియోలతో ఈ అప్లికేషన్ (App) లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు ప్రతి కాన్సెప్టు క్లుప్తంగా, స్వయంగా అర్థం చేసుకొని నేర్చుకుంటారు. బైజూస్ (Byju’s) నివేదికల ప్రకారం, మొత్తం 40 మిలియన్ల వినియోగదారులు, 3 మిలియన్ల ప్రీమియం వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 2018లో, యాప్ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు విస్తరించింది.