Byjus: బైజూస్ కంపెనీను వీడిన అజయ్ గోయల్

Byju’s CFO : ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ (byjus) ఆర్థిక శాఖలో కీలకమైన మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది. బైజుస్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ గోయల్ (Ajay Goel) తన పదవి నుండి వైదొలగుతున్నారు. ఆయన ఈ కంపెనీలో చేరి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. కాగా అజయ్ గోయల్ తిరిగి వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో బాధ్యతలు చేపట్టనున్నట్టు ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.  ఈ సందర్భంగా అజయ్ […]

Share:

Byju’s CFO : ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ (byjus) ఆర్థిక శాఖలో కీలకమైన మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది. బైజుస్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ గోయల్ (Ajay Goel) తన పదవి నుండి వైదొలగుతున్నారు. ఆయన ఈ కంపెనీలో చేరి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. కాగా అజయ్ గోయల్ తిరిగి వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో బాధ్యతలు చేపట్టనున్నట్టు ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ సందర్భంగా అజయ్ గోయల్(Ajay Goel) మాట్లాడుతూ బైజుస్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. మూడు నెలల్లో FY22 ఆడిట్ ను సమీకరించడం లో తనకు సహాయం చేసిన బైజూస్ వ్యవస్థాపకులు మరియు సహచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది కాలంలోనే బైజూస్ కంపెనీలో తనకు లభించిన మద్దతుకు అభినందనలు తెలిపారు. 

బైజూస్ సీనియర్ అడ్వైజర్ గా ప్రదీప్ కనకియా ను నియమించినట్లు కూడా బైజూస్ సంస్థ ప్రకటించింది. మరియు భారత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నితిన్ గోలానీ కు అదనపు బాధ్యతలు కేటాయించినట్లు ప్రకటించారు. నితిన్ ప్రస్తుతం ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తునే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కూడా తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. 

ప్రదీప్ కనకియా KMPG మరియు ప్రైస్ వాటర్ హౌస్ లో 35 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు. కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలకు ఫైనాన్స్ స్ట్రాటజీ, ట్రాన్స్ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, ఆడిటింగ్, కంటోల్స్ మరియు గవర్నెన్స్ లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది అని బైజూస్ (Byju’s) పేర్కొన్నది. 

బైజూస్ వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ తమ ఫైనాన్స్ టీం లో కొత్తగా నియమితులు అయిన వారి వలన తమ కంపెనీకి మంచి అభివృద్ధి ఉంటుంది అని ఆశావాదం వ్యక్తం చేశారు. బిజినెస్ మరియు ఫైనాన్స్ రంగంలో వారికి ఉన్న అనుభవం ప్రస్తుతం కంపెనీ చేస్తున్న టర్న్ అరౌండ్ ప్రయత్నాల్లో సహాయపడతాయి అని అన్నారు.

బైజూస్ సంస్థ లో కొత్తగా నియమితులైన CFO (Byju’s CFO) మరియు ప్రెసిడెంట్ గతంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా పని చేశారు. 2021 సంవత్సరంలో ఆకాష్ ను బైజూస్ 1 బిలియన్ కు కొనుగోలు చేయడంలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. నితిన్ గోలాని ( Nitin Golani) ఒక చార్టెడ్ అకౌంటెంట్, గ్రాంట్ థర్న్ టన్ లో తన వృత్తిని మొదలు పెట్టారు. మెట్ లైఫ్, యాక్సెంచర్ మొదలైన కంపెనీలలో స్ట్రాటజీస్ట్ పాత్రలను నిర్వహించారు. ప్రస్తుతం బైజూస్ కంపెనీలో నితిన్ స్ట్రాటజీ డెవలప్మెంట్, క్యాపిటల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ అనాలసిస్ పై బోర్డు సభ్యులు మరియు కంపెనీ వ్యవస్థాపకులు తో కలిసి పని చేయనున్నారు. 

బైజూస్ (Byju’s ) మల్టీ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ, ఈ సంస్థ ను 2011 సంవత్సరంలో బైజూ రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ కలిసి ప్రారంభించారు. సెప్టెంబర్ 2023 సంవత్సరానికి ఈ సంస్థ విలువ 5.1 బిలియన్ల గా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ కు 150 మిలియన్ కు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ సంస్థ అన్ని రంగాలలోనూ విద్యార్థులకు వివిధ కోర్సులను అందిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ కంటెంట్ ను పాఠ్యాంశాల గా పిల్లలకు బోధిస్తున్నారు.