బ్లాక్‌ స్టోన్ సీఈవో జీతం

పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ ఇంక్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ గత సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో కంపెనీ నుండి రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.10,000 కోట్లకు పైగా జీతంగా అందుకున్నారు. మీరు బ్లాక్‌ స్టోన్ ఇంక్ అనే కంపెనీ పేరును ఎప్పుడు అయినా విన్నారా? మీకు వ్యాపార ప్రపంచం గురించి కొంచెం అయినా అవగాహన ఉండి ఉంటే, మీరు కూడా ఈ పేరును ఎప్పుడో ఒకప్పుడు […]

Share:

పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ ఇంక్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ గత సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో కంపెనీ నుండి రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.10,000 కోట్లకు పైగా జీతంగా అందుకున్నారు.

మీరు బ్లాక్‌ స్టోన్ ఇంక్ అనే కంపెనీ పేరును ఎప్పుడు అయినా విన్నారా? మీకు వ్యాపార ప్రపంచం గురించి కొంచెం అయినా అవగాహన ఉండి ఉంటే, మీరు కూడా ఈ పేరును ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడి కంపెనీలలో ఒకటి. ఈ రోజు ఈ కంపెనీకి సంబంధించిన ఒక విషయాన్ని మీకు చెప్పబోతున్నాం. ఆ విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది ఏంటి అనుకుంటున్నారా? అది ఇంకెదో కాదు.. ఇది పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ తీసుకునే జీతం గురించి అన్నమాట.

డివిడెండ్‌లో మాత్రమే ఇంత మొత్తం వచ్చింది

పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ ఇంక్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ గత సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో కంపెనీ నుండి రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.10,000 కోట్లకు పైగా జీతంగా అందుకున్నారు. ఇందులో దాదాపు 1 బిలియన్ డాలర్లు కేవలం డివిడెండ్ రూపంలోనే ఆయన అందుకున్నారు. అదే సమయంలో కంపెనీ నుంచి 253.1 మిలియన్ డాలర్లను పరిహారంగా పొందారు. ఇందులో ఎక్కువ భాగం ఇన్సెంటివ్ ఫీజుల ద్వారా వచ్చే పెట్టుబడులు ద్వారా పెట్టిందే ఉంది.

స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్ యొక్క నికర విలువ

బ్లాక్‌ స్టోన్ ఇంక్‌లో స్క్వార్జ్‌ మాన్ ప్రస్తుతం 20 శాతం మేర తన వాటాను కలిగి ఉన్నారు. అతను 3 దశాబ్దాల క్రితం కొంత మంది వ్యక్తులతో కలిసి పెట్టుబడి సంస్థ బ్లాక్‌ స్టోన్‌ను స్థాపించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్టీఫెన్ స్క్వార్జ్‌ మాన్ నికర విలువ ప్రస్తుతం 30.6 బిలియన్ డాలర్లు దాకా ఉంటుందని అంచనా. అతను వాల్ స్ట్రీట్‌లో అత్యధికంగా చెల్లించే వాళ్లలో ఒకడు.

వారసుడు చాలా డబ్బు అందుకున్నాడు

బ్లాక్‌ స్టోన్ ఇంక్ ప్రెసిడెంట్ మరియు CEOగా స్క్వార్జ్‌మాన్ వారసుడు జాన్ గ్రే 2022లో 479.2 మిలియన్ డాలర్లను అందుకున్నారు. ఇందులో 182.7 మిలియన్ డాలర్లు గ్రేకు డివిడెండ్‌గా వచ్చాయి. బ్లాక్‌ స్టోన్‌లో గ్రేకు దాదాపు 3 శాతం మేర వాటా ఉంది. గ్రే 2022లో కంపెనీ నుండి 30 మిలియన్ డాలర్లను స్టాక్ బోనస్‌గా పొందారు. ఇది ఏడాది కిందటి మాట. 2021 సంవత్సరంలో అతను 38 మిలియన్ డాలర్లను స్టాక్ బోనస్‌ను పొందాడు.

ఈ ఏడాది స్టాక్స్ జోరందుకున్నాయి

బ్లాక్‌ స్టోన్ ప్రపంచంలోని అతిపెద్ద పెట్టుబడి బ్యాంకింగ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గత ఏడాది ఇతర ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీల మాదిరిగానే బ్లాక్‌స్టోన్ లాభాలు కూడా ప్రభావితమయ్యాయి. అయితే కంపెనీ దానిని సులభంగా నిర్వహించగలిగింది. ఈ సంవత్సరం గురించి మాట్లాడుతే.. బ్లాక్‌స్టోన్ షేర్లలో మంచి బూమ్ కనిపిస్తోంది. 2023 సంవత్సరంలో ఇప్పటివరకు దాని షేర్లు 21 శాతానికి పైగా లాభపడ్డాయి.

ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వివాదం నుండి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, మాంద్యం ఆందోళనలు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బ్లాక్‌ స్టోన్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు కొంతమేర నష్టం చేశాయి.

చివరగా డొనాల్డ్ ట్రంప్ యొక్క 2020 ఎన్నికల ప్రచారానికి వాల్ స్ట్రీట్ యొక్క అతిపెద్ద సహకారిలో ఒకరిగా స్క్వార్జ్‌ మాన్ ఉన్నారు. అయితే నవంబర్‌లో 2024లో ట్రంప్‌కు తాను మద్దతు ఇవ్వనని చెప్పాడు.