యూపీఐ యూజర్స్ ఈ విషయాల్లో జాగ్రత్త!

అఫీషియల్ బ్యాంకు యూపీఐ కి ట్రాన్సాక్షన్ చేయండి. యూపీఐ ద్వారా డబ్బు కడుతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి. సెక్యూర్డ్ యూపీఐ కి మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. సెక్యూర్డ్ కాకుంటే డబ్బులు అస్సలు ట్రాన్స్ఫర్ చేయకండి. ఎందుకంటే హ్యాకర్స్ అప్పుడప్పుడు సెక్యూర్డ్ కానీ వాటిని వాడి మీ డబ్బు కొల్లగొడతారు. యూపీఐ ని ఆర్బిఐ అప్రూవ్ చేసింది. ఇందులో పేమెంట్ చేయాలంటే మనం పాస్వర్డ్ టైప్ చేయాల్సిందే. అలాగే డబ్బు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కొన్ని […]

Share:

అఫీషియల్ బ్యాంకు యూపీఐ కి ట్రాన్సాక్షన్ చేయండి. యూపీఐ ద్వారా డబ్బు కడుతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి. సెక్యూర్డ్ యూపీఐ కి మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. సెక్యూర్డ్ కాకుంటే డబ్బులు అస్సలు ట్రాన్స్ఫర్ చేయకండి. ఎందుకంటే హ్యాకర్స్ అప్పుడప్పుడు సెక్యూర్డ్ కానీ వాటిని వాడి మీ డబ్బు కొల్లగొడతారు. యూపీఐ ని ఆర్బిఐ అప్రూవ్ చేసింది. ఇందులో పేమెంట్ చేయాలంటే మనం పాస్వర్డ్ టైప్ చేయాల్సిందే. అలాగే డబ్బు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ఇప్పుడు దేశం మొత్తం యూపీఐ వాడుతున్నారు. మనం ఏది కొనాలన్నా యూపీఐ వాడాల్సిందే. పానీపూరి బండి దగ్గరి నుండి, చికెన్ మటన్ దుకాణాల్లో కూడా యుపిఐ తన ఆధిపత్యాన్ని చెల్లాయిస్తుంది. ప్రతి చోట యూపీఐ ఉపయోగించి ట్రాన్సాక్షన్ జరుపుతున్నాం. 

మనం జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం:

మీ యూపీఐ పిన్ జాగ్రత్త మీ యూపీఐ పిన్ ఎవరికైనా తెలిస్తే మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అయిపోతుంది. సో అకౌంట్ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. పిన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. అఫీషియల్ యూపీఐ మాత్రమే వాడండి:

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి అఫీషియల్ సైట్ల ద్వారా మాత్రమే మీ లావాదేవీలు జరపండి. వేరే సైట్లను అస్సలు నమ్మకండి. 

మీరు డబ్బు జమ చేసే అకౌంట్ ని ఒకసారి వెరిఫై చేసుకోండి:

మీరు అకౌంట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ కొట్టాక పర్సన్ డీటెయిల్స్ వస్తాయి అవన్నీ కరెక్ట్ గా చూసుకొని ట్రాన్సాక్షన్ చేయండి. లేదంటే మీరు రాంగ్ పర్సన్ కి డబ్బులు పంపుతారు. అప్పుడు మీ డబ్బు తిరిగి రమ్మన్నా రాదు. 

మీరు ట్రాన్స్ఫర్ చేసే డబ్బును ఒకసారి చూసుకోవాలి: కొన్నిసార్లు వెయ్యి పంపబోయి పదివేలు పంపుతుంటారు. దీనికి కారణం మనం ఎంత పంపుతున్నామో సరిగ్గా చూసుకోకపోవడమే

అందుకే సరిగ్గా చూసుకొని పంపండి. అప్పుడు మీ డబ్బు జాగ్రత్తగా ఉంటుంది. 

ఫేక్ కాల్స్ నుండి జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు మేం ఫోన్ పే నుండి చేస్తున్నాం, గూగుల్ పే నుండి చేస్తున్నాం మీ పిన్ నెంబర్ చెప్పండి అని కొందరు కాల్ చేస్తుంటారు. పిన్ నెంబర్ చెప్పారంటే మీ డబ్బులు స్వాహా. హ్యాకర్స్ ఇలా చేస్తుంటారు. అఫీషిల్ బ్యాంక్ వాళ్ళు ఎవరు పిన్ నెంబర్ అడగరు. 

ఇంటర్నెట్ సరిగా ఉందా లేదా చూసుకోండి ఇంటర్నెట్ సరిగా లేకుంటే మీరు డబ్బులు పంపిన వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళవు. అవి మీ అకౌంట్లోకి చాలా రోజులకు జమవుతాయి. దీనివల్ల సెంటర్ కి రిసీవర్ కి ప్రాబ్లమ్. అందుకే డబ్బులు పంపే ముందు నెట్వర్క్ చెక్ చేసుకోండి. 

మీరు ఎవరెవరికి డబ్బు పంపిస్తున్నారో రికార్డ్ చేసుకోండి:మీరు ఎవరెవరికి డబ్బులు పంపిస్తున్నారు అవన్నీ ఒక రికార్డు లాగా మీ ఫోన్ యాప్ లో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి

మీ అప్లికేషన్ ని అప్పుడప్పుడు అప్డేట్ చేయండి: 

యూపీఐని అప్పుడప్పుడు అప్డేట్ చేయడం వల్ల అకౌంట్ లో ఉన్న డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఏవైనా బగ్స్ ఉంటే డిలీట్ అయిపోతాయి. 

అప్పుడప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి: 

మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మీ బ్యాంకు 

అధికారికి  చెప్తే తను వాటిని సెట్ చేస్తాడు. 

బయోమెట్రిక్ ని ఉపయోగించండి:

మీ డబ్బులు మీ ఫింగర్ ప్రింట్ వెరిఫై అయ్యాకే పంపేలాగా సెట్టింగ్ పెట్టుకోండి. దానివల్ల మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి.