అశోక్ లేలాండ్ సరికొత్త ఆవిష్కరణ

డిజిటల్ సర్వీస్ కస్టమర్లు ధృవీకరించబడిన పత్రాలతో పాటు మీకు నచ్చిన వాహనాలు ఎంచుకోవడానికి అనేక రకాల ఫీచర్లను అనుమతించింది అశోక్ లేలాండ్. తాజాగా హిందూజా గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అశోక్ లేలాండ్.. ఆల్రెడీ ఉపయోగించిన కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కోసం.. ఈ-మార్కెట్ ప్లేస్ ను రూపొందించినట్లు ఆటోమేజర్ శనివారం స్పష్టం చేశారు. ఇకపోతే ఈ మార్కెట్ ప్లేస్ సదుపాయం అనేది కష్టమర్లు తమ ప్రస్తుత వాహనాలను మార్చుకోవడానికి అలాగే అశోక్ లేలాండ్ అందించే ట్రక్ లేదా […]

Share:

డిజిటల్ సర్వీస్ కస్టమర్లు ధృవీకరించబడిన పత్రాలతో పాటు మీకు నచ్చిన వాహనాలు ఎంచుకోవడానికి అనేక రకాల ఫీచర్లను అనుమతించింది అశోక్ లేలాండ్. తాజాగా హిందూజా గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అశోక్ లేలాండ్.. ఆల్రెడీ ఉపయోగించిన కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కోసం.. ఈ-మార్కెట్ ప్లేస్ ను రూపొందించినట్లు ఆటోమేజర్ శనివారం స్పష్టం చేశారు. ఇకపోతే ఈ మార్కెట్ ప్లేస్ సదుపాయం అనేది కష్టమర్లు తమ ప్రస్తుత వాహనాలను మార్చుకోవడానికి అలాగే అశోక్ లేలాండ్ అందించే ట్రక్ లేదా బస్సుకు దీనిని అప్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. 

వాస్తవానికి ఉపయోగించిన కమర్షియల్ వాహనాలు పరిశ్రమకు అంతరాయం కలిగించవచ్చు.. ఇదే విషయంపై అశోక్ లేలాండ్ ఎండి మరియు సీఈఓ శేను అగర్వాల్ మాట్లాడుతూ.. ఉపయోగించిన వాణిజ్య వాహనాలు పరిశ్రమకు అంతరాయం కలిగిస్తాయి. మా డిజిటల్ ప్లాట్ ఫారం ను ఉపయోగించడం వల్ల కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్ లను అందించడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది అంటూ ఆయన వెల్లడించారు. డిజిటల్ సర్వీస్ కస్టమర్లు ధ్రువీకరించబడిన పత్రాలతో పాటు మీకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి అనుమతించే విధంగా ఈ – మార్కెట్ ప్లేస్ సర్వీస్ లో ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇకపోతే యూజుడ్ వెహికల్ ఈ మార్కెట్ ప్లేస్ సొల్యూషన్ మా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది అంటూ సీఈవో షేన్ అగర్వాల్ తెలిపారు.. ఇకపోతే అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ మీడియం మరియు హెవీ కమర్షియల్ వెహికల్స్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఉపయోగించిన వాహన వ్యాపార కష్టమర్లు తమ వాహనాలను మెరుగైన రీసేల్ విలువతో లిక్విడేట్ చేయడానికి వీలు కల్పిస్తారని.. ఇది ఒక కీలకమైన అంశమని ఆయన తెలిపారు. ఈ-మార్కెట్ ప్లేస్ లో తమ పాత వాహనాలను సరికొత్త అశోక్ లేలాండ్ ట్రక్కులు మరియు బస్సుల కోసం మార్చుకోవడంలో మొత్తం కస్టమర్ అనుభవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని తాము నమ్ముతున్నాము అంటూ ఆయన స్పష్టం చేశారు.

ఈ మార్కెట్ ప్లేస్ అనేది కస్టమర్లు తమకు నచ్చిన వాహనాలను సులభంగా ఐడెంటిఫై చేయడానికి అనేక రకాల ఫీచర్లను అందించడానికి ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో అశోక్ లేలాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మనకు నచ్చిన ఫీచర్లతో నచ్చిన ధరలో ఒక వెహికల్ కొనాలి అంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. అయితే ఇప్పుడు అలాంటివన్నీటిని ఒకే చోటకి చేర్చుతూ ఈ-మార్కెట్ ప్లేస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది అశోక్ లేలాండ్.  ముఖ్యంగా బస్సులను అలాగే ట్రక్కులను సులభంగా మార్చుకోవడానికి ఈ యాప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 

అంతేకాదు ఈ మార్కెట్ ప్లేస్ అనేది కస్టమర్లకు వారికి తగిన వాహనాలను సులభంగా కనుగొనడంతో పాటు ధృవీకరించబడిన పత్రాలు, మూల్యాంకన నివేదికల వంటి అనేక రకాల ఫీచర్లను కూడా అందించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ల కోసం అశోక్ లేలాండ్ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన ఫీచర్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని విశ్వసిస్తున్నామని  అశోక్ లేలాండ్ సీఈవో వెల్లడించారు. ఎందుకంటే పెద్దపెద్ద వాహనాలను కొనుగోలు చేయడం లక్షల ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు ఎక్కడ ఏ మార్కెట్లో సెర్చ్ చేస్తే వాహనం మనకు కరెక్ట్ గా దొరుకుతుంది అని అనుమానం ఉంటుంది. అందుకే ఇప్పుడు అశోక్ లేలాండ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ కస్టమర్లకు రిస్క్ లేకుండా నాణ్యత కలిగిన వాహనాలను అందించడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.