ఏప్రిల్ 1 వ తారీకు నుంచి ఆదాయపు పన్నులో వచ్చిన 10 నిబంధనల గురించి పూర్తి వివరాలు..

సెక్షన్ 80C, 80D, 80CCD కింద చేసిన పెట్టుబడులు మొదలైనవాటికి, 2.5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్స్ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యింది.. ఇప్పటినుంచి ఆదాయపు పనులు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకనుంచి ఆ మార్కులను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఆదాయపు పన్నులో 2023, ఏప్రిల్ 1 నుండి, కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారనుంది. ఇకనుంచి పన్ను చెల్లింపుదారులు తమకు ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.. ఈ […]

Share:

సెక్షన్ 80C, 80D, 80CCD కింద చేసిన పెట్టుబడులు మొదలైనవాటికి, 2.5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్స్

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యింది.. ఇప్పటినుంచి ఆదాయపు పనులు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకనుంచి ఆ మార్కులను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే ఆదాయపు పన్నులో 2023, ఏప్రిల్ 1 నుండి, కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారనుంది. ఇకనుంచి పన్ను చెల్లింపుదారులు తమకు ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.. ఈ కొత్త విధానంలో వచ్చిన ముఖ్యమైన 10 మార్పులు గురించి వివరంగా తెలుసుకున్నాం..

1. డిఫాల్ట్ ట్యాక్స్.. 

2023, ఏప్రిల్ 1 నుండి, కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ ట్యాక్స్ విధానంగా మారింది.  టాక్స్ పేస్ తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. హిందూ అవిభక్త కుటుంబాలు, ఇంటి అద్దె , నిర్దిష్ట మినహాయింపు, తగ్గింపులను పొందకుంటే తక్కువ రేట్లకే వారికి ట్యాక్స్ విధానం అమలవుతోంది. హోమ్ లోన్ పై వడ్డీ, సెక్షన్ 80C, 80D, 80CCD కింద చేసిన పెట్టుబడులు మొదలైనవాటి కింద, 2.5 లక్షల రూపాయల వరకు ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్స్ ఉంది.

2. పన్ను రాయితీ పెంపు.. 

ట్యాక్స్ రిబేట్ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయలకు పెంచడం అంటే, 7 లక్షల  రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఏమీ పెట్టుబడి పెట్టనవసరం లేదు. పెట్టుబడి పరిమాణంతో సంబంధం లేకుండా మొత్తం ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది.

3. స్టాండర్డ్ డిడక్షన్‌..

పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్‌ లో ఎలాంటి మార్పు లేదు. పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.15.5 లక్షల రూపాయలు, లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగికి 52,500  రూపాయల మేర ప్రయోజనం పొండచ్చు.

4. ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు..

కొత్త పన్ను రేట్లు

0-3 లక్షలు – పన్ను చెల్లించక్కర్లేదు.

3-6 లక్షలు – 5 శాతం పన్ను చెల్లించాలి.

6-9 లక్షలు- 10 శాతం పన్ను చెల్లించాలి.

9-12 లక్షలు – 15 శాతం పన్ను చెల్లించాలి.

12-15 లక్షలు – 20 శాతం పన్ను చెల్లించాలి.

15 లక్షల పైన- 30 శాతం పన్ను చెల్లించాలి. 

5. ఎన్‌క్యాష్‌మెంట్..

ప్రభుత్వేతర ఉద్యోగులకు సెలవు ఎన్‌‌క్యాష్‌‌మెంట్‌‌కు కొంత పరిమితి వరకు మినహాయింపు వర్తిస్తుంది. ఈ పరిమితి 2002 నుండి ₹3 లక్షలుగా ఉండగా దానిని ఇప్పుడు ₹25 లక్షలకు పెంచారు.

6. మ్యూచువల్ ఫండ్స్..

ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాలపై ట్యాక్స్ పడుతుంది.‌ 

7. మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు..

ఏప్రిల్ 1 తర్వాత మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ లో పెట్టుబడి స్వల్పకాలిక మూలధన ఆస్తులు గా ఉంటాయి.

8. జీవిత బీమా పాలసీ..

వార్షిక ప్రీమియం ₹5 లక్షల కంటే ఎక్కువ జీవిత బీమా ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయంపై కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అంటే ఏప్రిల్ 1, 2023 నుండి పన్ను విధించనున్నారు.

9. సీనియర్ సిటిజన్స్..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితి ₹15 లక్షల నుండి ₹30 లక్షలకు పెంచారు.

నెలవారీ ఆదాయ పథకం కోసం గరిష్ట డిపాజిట్ పరిమితి సింగిల్ ఖాతాల కోసం 4.5 లక్షల నుండి ₹ 9 లక్షలకు, జాయింట్ ఖాతాలకు ₹ 7.5 లక్షల నుండి ₹ 15 లక్షలకు పెంచారు.

10. మూలధన లాభాల ట్యాక్స్ ను ఆకర్షించడానికి బంగారాన్ని ఇ-గోల్డ్ రసీదుగా మార్చడం.

2023 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుగా మార్చినట్లయితే మూలధన లాభం పన్ను ఉండదని ఆర్థికమంత్రి సీతారామన్ చెప్పారు. 

పైన చెప్పుకున్నవన్నీ కూడా ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి రానున్నాయి.