అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీతో యాపిల్ ఐఫోన్ 17 ప్రో..! ఎప్పుడు అందుబాటులోకి రానుందంటే…

అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీ.. ప్రస్తుతం iPhone ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం చాలామంది ఒక కలగా కూడా పెట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళు అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయమే పడుతోంది. ప్రస్తుతం EMI ల కాలం కావడంతో..  మరికొంత మంది కొంత ధైర్యం చేసి ఇన్ స్టాల్ మెంట్స్ లో ఐఫోన్స్ కొంటూ వారి కలను నెరవేర్చుకుంటున్నారు. కాని […]

Share:

అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీ..

ప్రస్తుతం iPhone ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం చాలామంది ఒక కలగా కూడా పెట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళు అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయమే పడుతోంది. ప్రస్తుతం EMI ల కాలం కావడంతో..  మరికొంత మంది కొంత ధైర్యం చేసి ఇన్ స్టాల్ మెంట్స్ లో ఐఫోన్స్ కొంటూ వారి కలను నెరవేర్చుకుంటున్నారు. కాని ఇంకొంతమంది మాత్రం ధరలు తగ్గితే కొందాం, మంచి ఆఫర్స్ ఏవైనా పెడితే ఆపిల్ ఐ ఫోన్ కొందామని చూస్తారు. పండగలప్పుడు కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్‌లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్స్ పెడుతుంటాయి. మీరు యాపిల్ ఫోన్ కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్..  యాపిల్ ఐఫోన్ 17 ప్రో త్వరలో రానుంది.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీ..

అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం యాపిల్ 2027లో అండర్ ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీని యాపిల్ ఐఫోన్ 17 ప్రో కి తీసుకురావాలని ఆలోచిస్తోంది. తాజా నివేదిక ప్రకారం.. 

ప్రో ఐఫోన్ మోడల్‌కు ఇది స్పెషల్ ఎడిషన్‌గా రానుంది.

డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఇటీవల ట్విట్టర్ లో ఈ విషయాన్నీ అధికారికంగా  పంచుకున్నారు. అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి ఆపిల్ పరికరం ఐఫోన్ 17 ప్రో అని ఆయన అన్నారు. 2025 లో అన్ని LTPO కి ఆపిల్, 120Hz రిఫ్రెష్ పొందడానికి బేస్ మోడల్స్ కూడా అని యంగ్ తెలిపారు. 

ఫీచర్స్..

ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ లో  అండర్-డిస్ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీతో పాటు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం సర్కిల్ షేప్ ఉన్న  ప్రో “ఐఫోన్ నమూనాలతో పాటు మరికొన్ని ఫోటోలు పంచుకున్నారు.. బహుశా  యాపిల్ ఐఫోన్ 17 ప్రో 2027 వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావలని భావిస్తున్నారు.

మొదటి ఐఫోన్ ఇదే..

అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి వ్యక్తి ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అని యంగ్ గతంలో మే 2022 లో అంచనా వేశారు. కానీ  సెన్సార్ సమస్యల కారణంగా మరొక సంవత్సరం ఆలస్యం జరుగుతుందని ఆయన ఇటీవల ప్రకటించారు.. యాపిల్ ఐఫోన్ 17 ప్రో 2027 లో కనుక అందుబాటులోకి వస్తే అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీ తో వచ్చిన ఇది మొదటి ఫోన్ అవుతుంది. ఈ టెక్నాలజీ వచ్చిన ఐఫోన్ 3 తరాలపాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని మూడు దశాబ్దాల పాటు ఈ ఫోన్ రాజ్యమేలుతుందని ఐఫోన్ నిర్వాహకులు ఇప్పటినుంచి అంచనా వేస్తున్నారు. 

అండర్-ప్యానెల్ ఫేస్ ఐడి టెక్నాలజీతో పాటు, ప్రామాణిక ఐఫోన్ 17 నమూనాలు ప్రస్తుతం ఆపిల్ యొక్క హై-ఎండ్ పరికరాలకు ప్రత్యేకమైన ప్రమోషన్‌ను అవలంబిస్తాయని భావిస్తున్నారు.  యాపిల్ కూడా ఈ సంవత్సరం తన ఐఫోన్‌లకు మరో పెద్ద మార్పు తీసుకురావాలని యోచిస్తోంది. రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ఒక ప్రత్యేకమైన కొత్త ఫీచర్స్‌తో వస్తుందని అనుకుంటున్నారు. రెగ్యులర్ మ్యూట్ స్విచ్‌కు బదులుగా మల్టీ పర్పస్ బటన్ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే, బయటకు వచ్చిన సమాచారం ప్రకారం..  ఐఫోన్ 15 ప్రో నార్మల్ బటన్‌ను కలిగి ఉంటుంది, వీటిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు, వీటిలో మ్యూటింగ్ కాల్స్, స్క్రీన్ షాట్‌లను తీసుకోవడం, ఇలా రకరకాలగా వాడవచ్చు. క్రొత్త బటన్ ప్రస్తుత మ్యూట్ స్విచ్ కంటే బహుముఖంగా ఉందని తెలుస్తోంది. ఇది ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లను, మ్యూట్ చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.