ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

తాజాగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  (ఈడీ ) విచారణకు హాజరయ్యారు. ఇక ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం అనిల్ అంబానీ చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయనను ఏ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. ఇకపోతే ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీని విచారించినట్లుగా తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఫారిన్ […]

Share:

తాజాగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  (ఈడీ ) విచారణకు హాజరయ్యారు. ఇక ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం అనిల్ అంబానీ చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయనను ఏ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. ఇకపోతే ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీని విచారించినట్లుగా తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ( ఫెమా) కింద అనిల్ అంబానీ తాజాగా ఈడీ అధికారుల ముందు హాజరైనట్టు తెలుస్తోంది. ఇకపోతే 2020లో మనీ లాండరింగ్ కేసులో కూడా ఎస్ బ్యాంక్ అధికారులను అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులను కూడా ఈడీ అధికారుల సలహా మేరకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ కి చెందిన కంపెనీలు సుమారుగా రూ.12,800 కోట్ల రుణాలు పొందాయి అని రిలయన్స్ తో పాటు చాలా కంపెనీలు ఆ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయని సమాచారం. అందుకే ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ గతంలో కూడా అనిల్ అంబానీ కి సమన్లు జారీ చేసి విచారించింది.

అసలు విషయంలోకి వెళితే.. 2020లో రాణా కపూర్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. బల్లార్డ్ ఎస్టేట్ లోని  కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించి.. ఆ సమాచారాన్ని రికార్డు చేసుకున్నారు. ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అంబానీ వద్ద వాంగ్మూలం తీసుకున్నట్లుగా కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే రూ.12,800 కోట్ల రుణాలను పొంది సకాలంలో చెల్లించని కారణంగా అవి నిరర్థక ఆస్తుల జాబితాలోకి వెళ్లిపోయాయి. అందుకే అనిల్ అంబానీని ఈ డీ అధికారులు విచారించడం జరిగింది. మరొకవైపు 2022 ఆగస్టులో కూడా ఐటీ శాఖ రెండు స్విస్ బ్యాంకు ఖాతాలో రూ.814 కోట్లకు పైగా వెల్లడించిన నిధులపై రూ.420 కోట్ల పనులు ఎగవేసిన ఆరోపణలపై అనిల్ అంబానీకి నల్లధనం నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు ఏడాది మార్చిలో ఐటీ శాఖ షోకాస్ నోటీసులు,  పెనాల్టీ డిమాండ్ పై మధ్యంతర స్టే విధించింది.

ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి కరోనా సమయంలో కూడా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో ఒక గోల్ఫ్ మైదానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త , రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తన కుటుంబంతో కలిసి సాయంత్రం వాకింగ్ చేస్తున్న వీడియోని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయగా.. అది కాస్త మరింత వైరల్ గా మారి దానిపై అధికారులు కూడా స్పందించారు ముఖ్యంగా ఆ గోల్ఫ్ కోర్స్  ను మూసివేయాలని అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. ఇలా జరగడానికి కారణం కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా మహాబలేశ్వర్ లో తన భార్య టీనా , పిల్లలతో కలిసి ఆయన అలా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.విపత్తు నిర్వహణ చట్టం సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.