నాకు అక్కడ నిద్ర పట్టదు అంటున్న ఆనంద్ మహేంద్ర

ఆనంద్ మహేంద్ర ఈ పేరు వినగానే, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వైరల్ వీడియోలు. ఆనంద్ మహేంద్ర ఇటీవల కాలంలో ఆయన చూసిన కొన్ని వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఆయన ఇటీవల మాల్దీవ్స్ అండర్ గ్రౌండ్ హోటల్ గురించి, ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి ఉండేదో అనే దాని గురించి సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ముఖ్యంగా ఆయన అండర్ […]

Share:

ఆనంద్ మహేంద్ర ఈ పేరు వినగానే, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వైరల్ వీడియోలు. ఆనంద్ మహేంద్ర ఇటీవల కాలంలో ఆయన చూసిన కొన్ని వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఆయన ఇటీవల మాల్దీవ్స్ అండర్ గ్రౌండ్ హోటల్ గురించి, ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి ఉండేదో అనే దాని గురించి సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ముఖ్యంగా ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఉండేందుకు భయపడినట్లు, ఎక్కడ అద్దాలకు క్రాక్స్ వస్తాయో అని వెతుకుతూ, కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సి వస్తుందని ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఉండేందుకు నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు.

ఆనందం మహేంద్ర ట్వీట్: 

ఆనంద్ మహేంద్ర ఇటీవల కాలంలో ఆయన చూసిన కొన్ని వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఆయన ఇటీవల మాల్దీవ్స్ అండర్ గ్రౌండ్ హోటల్ గురించి, ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి ఉండేదో అనే దాని గురించి సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ముఖ్యంగా ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఉండేందుకు భయపడినట్లు, ఎక్కడ అద్దాలకు క్రాక్స్ వస్తాయో అని వెతుకుతూ, కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సి వస్తుందని ఆయన అండర్ గ్రౌండ్ హోటల్లో ఉండేందుకు నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు.

మాల్దీవ్ హోటల్: 

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన సూట్ వీడియోను షేర్ చేశారు. కానీ ట్విస్ట్ కింద ఆయన ఎక్స్పీరియన్స్ రాశారు. ఈ వీడియో విలాసవంతమైన నీటి అడుగున హోటల్‌కి సంబంధించినది. మాల్దీవుల్లో ఉన్న ఈ అండర్ వాటర్ హోటల్ పేరు ది మురాకా. సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన నెలకొని ఉన్న మురాకా, సముద్రంలోపల నిద్రిస్తున్న ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది, సముద్ర జీవులు మన కళ్ళ ముందు తిరుగుతూ మంత్రముగ్దులను చేస్తుంది.

అయితే, ఈ హోటల్ కి ఎంతో ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నప్పటికీ, మహీంద్రా ఈ సముద్రం అడుగులో ఉన్న సూట్‌లో ఒక రాత్రి గడపడానికి తన అయిష్టతను వ్యక్తం చేశారు. అతను రాత్రంతా మెలకువగా ఉండవచ్చని, గాజు సీలింగ్‌లో ఏమైనా పగుళ్లు ఉన్నాయా అని ఆత్రుతగా వెతుకుతానని హాస్యాస్పదంగా తన పోస్టులో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆయన చేసిన ట్విట్టర్ పోస్ట్‌లో, మహీంద్రా ఇలా రాసుకొచ్చారు, “మురాకా ది మాల్దీవులు’ ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉండే అద్భుతమైన హోటల్ సూట్. అయితే ఇక్కడ విశ్రాంతి కోసం ప్రశాంతత కోసం చూసే వాళ్ళు కచ్చితంగా ఈ హోటల్ చెయ్యొచ్చు. కానీనిజం చెప్పాలంటే, నేను చేయను, ఎందుకంటే ఇందులో ప్రత్యేకించి నాకు నిద్ర వస్తుందని అనుకోవట్లేదు, నాలాంటి వాళ్ళు కచ్చితంగా గాజు సీలింగ్‌లో పగుళ్లను వెతుక్కుంటూ మెలకువగా ఉంటారు అనుకుంటా” అంటూ మహేంద్ర సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి తమదైన శైలిలో అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

మహీంద్రా చేసిన వీడియో సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే కొందరు ఈ హోటల్ గురించి మాట్లాడుతూ, మీరు చెప్పింది నిజమే సార్ అంటూ, వారికి కూడా టైటానిక్ సినిమా చివరిలో వచ్చే యాక్సిడెంట్ గుర్తు వచ్చిందని నవ్వుతూ కామెంట్ పెట్టారు. మరి కొంతమంది హోటల్ చాలా విలాసవంతంగా ఉందని అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ధైర్యవంతులై ఉండాలని రాసుకుచ్చారు మరికొందరికి. అయితే వినూత్నంగా మరికొంతమంది కామెంట్ చేస్తూ, హోటల్ ఎంట్రీ ఫ్రీగా పెట్టాలి అని, అయితే మధ్య రాత్రిలో తమకి భయం వేసినప్పుడు, అరుస్తున్నప్పుడు తలుపులు తీయడానికి ఫీజు పెట్టాలని హాస్యాస్పదంగా కామెంట్ చేశారు.