నకిలీ చైనీస్ అమూల్ బటర్ మార్కెట్లోకి వచ్చిందా? వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంతో తెలుసుకోండి

నకిలీ అమూల్ వెన్న చైనాలో ప్యాక్ చేయబడుతుందనేది ఫేక్ న్యూస్. డెయిరీ కంపెనీ సంబంధిత వ్యక్తులకు నోటీసు జారీ చేసింది మరియు నకిలీ వార్తలపై ఇతరులకు అవగాహన కల్పించాలని ప్రజలను అభ్యర్థించింది. గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల కంపెనీ ‘అమూల్’ భారతదేశంలో విశ్వసనీయమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్. అమూల్‌ ‘బటర్‌’ను భారత ప్రజలు ఎక్కువగా ఇష్టపడి కొంటుంటారు. అమూల్ బటర్ వినియోగం బాగా  పెరిగిందని, దాని కొరత కొనసాగుతోందని, ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అలాంటి […]

Share:

నకిలీ అమూల్ వెన్న చైనాలో ప్యాక్ చేయబడుతుందనేది ఫేక్ న్యూస్. డెయిరీ కంపెనీ సంబంధిత వ్యక్తులకు నోటీసు జారీ చేసింది మరియు నకిలీ వార్తలపై ఇతరులకు అవగాహన కల్పించాలని ప్రజలను అభ్యర్థించింది.

గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల కంపెనీ ‘అమూల్’ భారతదేశంలో విశ్వసనీయమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్. అమూల్‌ ‘బటర్‌’ను భారత ప్రజలు ఎక్కువగా ఇష్టపడి కొంటుంటారు. అమూల్ బటర్ వినియోగం బాగా  పెరిగిందని, దాని కొరత కొనసాగుతోందని, ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అలాంటి పరిస్థితి లేకపోయినా, ఈ మధ్యే చైనా తయారు చేసిన నకిలీ అమూల్ బటర్ మార్కెట్‌లో చెలామణిలోకి వచ్చిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు నకిలీ అమూల్ వెన్న గురించిన  నిజం ఏమిటో తెలుసుకోండి.

సోషల్ మీడియాలో ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రెండు ప్యాకెట్లను తీసుకొని నిజమైన మరియు నకిలీ అమూల్ వెన్నని ప్రజలకు చూపిస్తున్నాడు. వీడియోలో వ్యక్తి భారతదేశంలో తయారు చేయబడిన అమూల్ వెన్న మరియు చైనాలో తయారు చేయబడిన నకిలీ అమూల్ వెన్న ప్యాకేజింగ్ డిజైన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలో పేర్కొన్నాడు. ఈ వీడియో చూసి చాలా మంది ఆలోచనలో పడ్డారు.

నకిలీ అమూల్ వెన్న

నకిలీ అమూల్ వెన్న అని పేర్కొంటూ ఒక వీడియో ఫేస్‌బుక్ పేజీ ‘ది ప్రెస్ ఐ కాశ్మీర్’ ద్వారా పోస్ట్ చేయబడింది. దీనిలో ఒక వ్యక్తి రెండు ప్యాక్‌ల అమూల్ వెన్నని ప్లేట్‌లో తీసుకువెళుతున్నట్లు కనిపించాడు. వాటిలో ఒకటి నకిలీదని పేర్కొన్నాడు. నకిలీని గుర్తించడానికి వీడియోలో చూసిన వ్యక్తి వెన్న ప్యాకెట్ ముందు భాగంలో ఆకుపచ్చ చుక్క ఉందని, అలాగే నకిలీపై భారత ప్రభుత్వ ముద్ర లేదని చెప్పారు. ప్యాకెట్ వెనుక ముద్రించిన వివరాల్లో కూడా తేడా ఉంటుంది. అలాగే వెన్న రంగులో కూడా మార్పు వస్తుంది. ఈ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఇది అందరికి తెలిసింది..

నకిలీ అమూల్ బటర్ వైరల్ వీడియో

ఇప్పుడు నకిలీ వెన్న యొక్క ఈ వీడియో వైరల్ కావడంతో అమూల్ కంపెనీ దాని నిజాన్ని తెలియజేస్తూ ఒక వివరణ ఇచ్చింది. అమూల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ వీడియో యొక్క స్క్రీన్‌షాట్ తీసుకొని ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో “చైనాలో ప్యాక్ చేయబడిన నకిలీ అమూల్ బటర్ గురించి వాట్సాప్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ పోస్ట్ ఉందని మీకు తెలియజేయడానికి ఈ పోస్టు. వీడియోలో చూపిన అమూల్ బట్టర్ ప్యాకెట్లు రెండూ నిజమైనవి మరియు భారతదేశంలో అమూల్ చేత తయారు చేయబడినవి అని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సలహా ప్రకారం అన్ని తాజా పాల ఉత్పత్తుల ప్యాక్ ముందు భాగంలో ‘శాకాహారం’ లోగో ప్రదర్శించాలి, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అని తెలియజేసింది.

వైరల్ వీడియోలో వీడియో క్లిప్పింగ్ పాత ప్యాక్ మరియు కొత్త ప్యాక్ అమూల్ బటర్ మధ్య పోలికను చూపుతుందని, తప్పుడు సమాచారాన్ని సృష్టించడానికి,  వినియోగదారులలో భయాందోళనను సృష్టించడానికి ఇలా చేశారని అమూల్ చెప్పింది. ఈ తప్పుడు వార్తలను సృష్టించిన శ్రీనగర్‌‌లోని వాళ్లకు లీగల్ నోటీసు జారీ చేయబడిందని పేర్కొన్నారు. దయచేసి ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలిపి వారికి అవగాహన కల్పించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దీంతో చైనీస్ వెన్న అనే వాదన పూర్తిగా తప్పుదోవ పట్టించేది అని స్పష్టమైంది.