అమెజాన్ ప్రైమ్ డే సేల్ రికార్డ్!

7వ  ప్రైమ్ డే ఎడిషన్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రైమ్ డే ఈవెంట్ అని అమెజాన్ ఇండియా ప్రకటించింది .ప్రైమ్ డే 2023 జూలై 15-16న జరిగింది, ప్రైమ్ మెంబర్‌లు గొప్ప డీల్‌లు, కొత్త లాంచ్‌లు మరియు వినోదాన్ని పొందారు. జులై 15,16 తేదీల్లో జరిగిన ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని […]

Share:

7వ  ప్రైమ్ డే ఎడిషన్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ప్రైమ్ డే ఈవెంట్ అని అమెజాన్ ఇండియా ప్రకటించింది .ప్రైమ్ డే 2023 జూలై 15-16న జరిగింది, ప్రైమ్ మెంబర్‌లు గొప్ప డీల్‌లు, కొత్త లాంచ్‌లు మరియు వినోదాన్ని పొందారు. జులై 15,16 తేదీల్లో జరిగిన ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. గత సంవత్సరం కన్నా 14% అధికంగా కస్టమర్లు ఈ ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్నారట.

 ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, హౌజ్ హోల్డ్ ఐటమ్స్.. తదితర ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ లను ఆమెజాన్ ప్రకటించింది. 2022 ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య కన్నా 2023 ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య 14% అధికమని ఆమెజాన్ ప్రకటించింది. షాపింగ్ ఈవెంట్ విజయవంతం కావడం గురించి అమెజాన్ ఇండియా ప్రైమ్ అండ్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ అక్షయ్ సాహి మాట్లాడుతూ, “ఈ ప్రైమ్ డేని భారతదేశంలోనే అతిపెద్దదిగా చేయడానికి సహకరించిన మా అమ్మకందారులకు, బ్రాండ్ భాగస్వాములకు మరియు ప్రైమ్ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు .

OnePlus, iQOO, Realme NarzoWith, Samsung, Motorola, boAt, Sony, Allen Solly, Lifestyle, Titan, Fossil, Puma, Tata, Dabur మరియు ఇతర బ్రాండ్‌లు ప్రారంభించిన 45 వేల  కొత్త ఉత్పత్తుల నుండి ప్రైమ్ సభ్యులు షాపింగ్ చేశారని అమెజాన్ వెల్లడించింది. ప్రైమ్ డే సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. అందులో కూడా, 70% సేల్స్ చిన్న నగరాలు, పట్టణాల (Tier 2 & 3 cities) నుంచే జరిగాయని పేర్కొంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, వన్ ప్లస్ నార్డ్ 3 5జీ, సామ్సంగ్ గెలాక్సీ ఎం 34, మోటొరోలా రేజర్ 40 సిరీస్, రియల్ మి నార్జొ 60 సిరీస్ వంటి కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్స్, భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి.

ప్రైమ్ డే సేల్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 5జీ స్మార్ట్ ఫోన్ అత్యధికంగా అమ్ముడుపోయింది. Galaxy M34 5జీ విజయంతో మేము సంతోషిస్తున్నాము, ఇది అమెజాన్ ప్రైమ్ డేలో కొత్త లాంచ్‌లలో నంబర్ 1 సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిల్చింది . Galaxy M34 5G, అమెజాన్ స్పెషల్స్, గెలాక్సీ M సిరీస్ విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇది మా బ్రాండ్‌పై కస్టమర్‌లు ఉన్న నమ్మకాన్ని మరియు కొత్త ఆవిష్కరణల పట్ల మా నిబద్ధత వినియోగదారులతో కొనసాగుతుంది  అని శామ్‌సంగ్ ఇండియాలోని MX బిజినెస్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ అన్నారు.

 ఈ సేల్ లో పాల్గొన్న ప్రైమ్ కస్టమర్లలో 45% మంది ఆమెజాన్ పే తో చెల్లింపులు జరిపారు. వారిలో కూడా 82% చిన్న నగరాలు, పట్టణాలకు (Tier 2 & 3 cities) చెందిన వారే ఉన్నారు. ప్రతీ నలుగురు కస్టమర్లలో ఒకరు ఆమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను వినియోగించారు. 2022 ప్రైమ్ డే సేల్స్ తో పోలిస్తే 2023 ప్రైమ్ డే సేల్స్ లో 56% అధిక బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ లో రెండింతలు, ఆఫీస్ ఫర్నిచర్ లో 1.7 రెట్లు, కిచెన్ ప్రొడక్ట్స్ లో 1.4 రెట్లు సేల్స్ జరిగాయి