తాజా సర్వేలో రిటైర్మెంట్ పై పలు ఆసక్తికర విషయాలు

రిటైర్మెంట్ అనేది ఓ సరికొత్త ప్రయాణం. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం ఈ దశకు చేరుకునేసరికి ఎన్నో ఒడిదుడుకులను, సవాళ్లను ఎదుర్కొని బాధ్యతలను పూర్తి చేసి ఉంటారు. పదవీ విరమణ తర్వాత అయినా ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా వారి అభిరుచులకు తగినట్లుగా ప్రశాంతంగా జీవించడం అవసరం. ఈ విషయం పైన తాజాగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓ అధ్యయనం నిర్వహించగా.. పలు ఆసక్తికర విషయాలు ఆ సర్వేలో వెళ్ళడయ్యాయి. […]

Share:

రిటైర్మెంట్ అనేది ఓ సరికొత్త ప్రయాణం. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం ఈ దశకు చేరుకునేసరికి ఎన్నో ఒడిదుడుకులను, సవాళ్లను ఎదుర్కొని బాధ్యతలను పూర్తి చేసి ఉంటారు. పదవీ విరమణ తర్వాత అయినా ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా వారి అభిరుచులకు తగినట్లుగా ప్రశాంతంగా జీవించడం అవసరం. ఈ విషయం పైన తాజాగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓ అధ్యయనం నిర్వహించగా.. పలు ఆసక్తికర విషయాలు ఆ సర్వేలో వెళ్ళడయ్యాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జీవితాన్ని ఆస్వాదించడం:

83 శాతం మంది.. పదవీ విరమణ తర్వాత లైఫ్ స్టైల్ ను ఎక్కువగా ఫాలో అవ్వాలని సూచించారు. జీవనశైలిని కొనసాగించడం అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశం. ఇక ప్రతి ఐదుగురిలో ముగ్గురు పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ఆస్వాదించడం, స్నేహితులతో సన్నిహితంగా ఉండడం, విదేశాలకు వెళ్లడం ఆర్థికంగా సురక్షితంగా ఉండటం, మనశ్శాంతిగా ఉండటంతో పాటు రిటైర్మెంట్ తర్వాత జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని సూచించారు.

రిస్క్ లేని పెట్టుబడులు:

పదవీ విరమణ కోసం సిద్ధం కావడానికి వారి డబ్బులు రిస్క్ లేని స్కీమ్స్ లో పెట్టడం అతి ముఖ్యమైన అంశమని ఈ సర్వేలో పాల్గొన్న వారు చెబుతున్నారు. యాన్యుటి ప్లాన్ లు వంటి జీవితానికి హామీని ఇచ్చే రాబడిని అందిస్తారు. యాన్యుటి ప్లాన్ లు ప్రత్యేకంగా రిటైర్మెంట్ కోసం రూపొందించబడతాయి. 

40 ఏళ్లు కంటే ముందే ప్రణాళిక:

రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపడానికి.. 40 ఏళ్లు నిండకముందే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. NPS, PPF వంటి స్కీమ్స్ లో ముందుగానే పెట్టుబడి పెట్టి ఉంచాలి. రిస్క్ లేకుండా ఉండాలి అంటే NPS స్కీంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అనుకుంటే PPF లో పెట్టవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఆధారంగా ఇందులో రిటర్న్స్ అనేవి ఉంటాయి.

అలవాట్లు:

60 ఏళ్ల జీవితాన్ని గడిపిన తర్వాత వారి అలవాట్లకు కాస్తయినా సమయాన్ని ఇవ్వాలని కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు. 20 ఏళ్లు చదువులో.. మరో 40ఏళ్ల పాటు ఉద్యోగం, భార్య, పిల్లలు, వారి పెళ్లిళ్లతో కాలాన్ని గడిపేసి ఉంటారు. ఆ సమయంలో వారికి ఇష్టమైన అలవాట్లు, హాబీస్ నేర్చుకోవడానికి తీరిక ఉండకపోవచ్చు. ఆ కోరికలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చుకోవాలని, అందుకు తగిన సమయాన్ని కేటాయించుకోవాలని మరికొంతమంది అంటున్నారు.

లావాదేవీలు మీ పేరు మీదే..

రిటైర్మెంట్ డబ్బు రాగానే చాలామంది ఇల్లు కట్టుకోవడం, లేదంటే వారికి ఉన్న ఆస్తిని కొడుకులు కూతుర్ల పేరు మీద రాయాలని అనుకుంటారు. ఇది ఒక అందుకు మంచిదే అయినా కూడా.. అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. ఉన్న డబ్బులన్నీ మీరు ముందుగానే వారికి ఇస్తే.. ఏ అనాధాశ్రమంలోనూ మిమ్మల్ని నెట్టేయ్యారని గ్యారెంటీ లేదు. అందుకని మీ ఆస్తితో పాటు డబ్బులు, మిగతావి లావాదేవీలైనా సరే మీ సమక్షంలోనే జరిగేలా చూసుకోండి. మీ తరువాత వారికి చెందేలాగా వీలునామా రాసుకోవడం ఉత్తమం.

ఈ విషయాలను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ క్వాంటం కన్జ్యూమర్ సొల్యూషన్స్ తో కలిసి రిటైర్మెంట్ తరువాత వారి వైఖరిని అర్థం చేసుకోవడం కోసం 1100 మంది వ్యక్తులను సర్వే చేసింది. రెండు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల నుంచి 45 నుండి 75 సంవత్సరాలు గల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను  ఈ సర్వే తెలిపింది.