సత్తా చాటిన ఇండియన్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్

భారతదేశంలోనే ఐటీ దిగ్గజంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్.2023 వరల్డ్ బెస్ట్ కంపెనీల లిస్టులో టాప్ 100 లో స్థానాన్ని దక్కించుకుంది. టైం ప్రచురించిన కంపెనీల లిఫ్ట్ లో ఇన్ఫోసిస్ భారతదేశ కంపెనీ చోటు దక్కించుకోవడం నిజంగా గర్వకారణం. సత్తా చాటిన ఇన్ఫోసిస్: టైం ప్రచురించిన వరల్డ్ బెస్ట్ కంపెనీలలో ఇన్ఫోసిస్ 64వ స్థానాన్ని దక్కించుకుంది. నిజంగా భారతదేశం నుంచి ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ ప్రపంచంలోనే బెస్ట్ కంపెనీగా చోటు దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయం అని […]

Share:

భారతదేశంలోనే ఐటీ దిగ్గజంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్.2023 వరల్డ్ బెస్ట్ కంపెనీల లిస్టులో టాప్ 100 లో స్థానాన్ని దక్కించుకుంది. టైం ప్రచురించిన కంపెనీల లిఫ్ట్ లో ఇన్ఫోసిస్ భారతదేశ కంపెనీ చోటు దక్కించుకోవడం నిజంగా గర్వకారణం.

సత్తా చాటిన ఇన్ఫోసిస్:

టైం ప్రచురించిన వరల్డ్ బెస్ట్ కంపెనీలలో ఇన్ఫోసిస్ 64వ స్థానాన్ని దక్కించుకుంది. నిజంగా భారతదేశం నుంచి ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ ప్రపంచంలోనే బెస్ట్ కంపెనీగా చోటు దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అయితే మొదటి స్థానాల్లో మైక్రోసాఫ్ట్.. ఆపిల్ వంటి మైక్రోసాఫ్ట్ కంపెనీలు.. మెటా కంపెనీ ఫేస్బుక్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.

అయితే దేశీయ ఆర్థిక వ్యవస్థను కూడా మార్చగలగే సత్తా ఉన్న సుమారు 750 కంపెనీల గురించి టైం అలాగే స్టాటిస్ట తనదైన శైలిలో ప్రచురించడం జరిగింది.  అయితే ప్రపంచ బెస్ట్ కంపెనీలలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న చిన్న కంపెనీలు కూడా చోటు దక్కించుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం.

వేటి ఆధారంగా బెస్ట్ కంపెనీ గుర్తింపు వస్తుంది:

నిజానికి టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న కంపెనీలు తమ ర్యాంకింగ్ బట్టి తమ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో కంపెనీ సంబంధిత రెవెన్యూ గ్రోత్, ఉద్యోగుల సాటిస్ఫాక్షన్ సర్వే ప్రకారం, కంపెనీ వాతావరణం.. దేశంలో కంపెనీ ప్రకారం ఎటువంటి లాభాలు చోటు చేసుకుంటున్నాయో వీటి బట్టి కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 

ఇక చూసుకున్నట్లయితే, ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు మరియు వినియోగ వస్తువుల కంపెనీలను… వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ మరియు వ్యాపార సేవల కంపెనీలు వెనక్కి నెడుతున్నట్లు ర్యాంకింగ్‌లు చూపించాయి.

అంతేకాకుండా చాలా కంపెనీలు ద్వారా విడుదలవుతున్న కాలుష్యాలతో పోలిస్తే టెక్ కంపెనీలో వెలువడుతున్న కార్బన్ ఎమీషన్స్ అనేవి చాలా తక్కువ అంటూ.. ముఖ్యంగా ఎయిర్లైన్స్.. హోటల్స్.. ఇంకా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరర్ కంపెనీల సగటు విడుదల చేసే కాలుష్యం కారణంగా కూడా ర్యాంకింగ్ అందించడం జరుగుతుందని టైం (TIME)  ప్రకటించింది.

ఎంప్లాయ్ ఆనందం ముఖ్యం:

ముందుగా చెప్పుకున్నట్లుగానే పలు అంశాల కారణంగా ర్యాంకింగ్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎంప్లాయ్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కంపెనీలో పని చేసే మగవారితో సమానంగా ఆడవారికి.. అంతకన్నా ఎక్కువగా ప్రియారిటి ఇవ్వడంలో పలు కంపెనీలు ఎప్పుడూ ముందే ఉండడం వల్ల కూడా ర్యాంకింగ్ విషయాలలో.. ఆయా కంపెనీలు ముందున్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయి పనిచేస్తున్న కంపెనీ వాతావరణం.. కంపెనీ తమని గౌరవించే విధానం కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సుమారు 750 కంపెనీలు లిస్ట్ తీయగా అందులో వందలోపు కంపెనీలలో ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్ ఒకటిగా నిలిచింది. మిగిలిన చాలా ఇండియన్ కంపెనీస్ 750 కంపెనీలలో ఉన్నప్పటికీ.. అవి 100 లోపు ర్యాంకింగ్ లో స్థానం సంపాదించలేకపోయాయి.

మిగిలిన స్థానాల్లో బెస్ట్ కంపెనీస్:

విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి. అదే సమయంలో, ఇన్ఫోసిస్ కూడా ప్రపంచంలోని మొదటి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా నిలిచింది.