“కూ” లోనూ ఉద్యోగాల తొలగింపు

దేశీయ ట్విట్టర్‌గా పేరుపొందిన ” కూ” తాజాగా తమ ఉద్యోగస్తులలో మూడో వంతు ఉద్యోగులను తొలగించి ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చేసింది. ఫండింగ్ నెమ్మదించడం, నష్టాలు, ఆర్థిక  వనరులు దెబ్బతినడంతో ఇలాంటి కారణాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. టెక్ సంస్థల్లో లే ఆఫ్ లు ఇప్పుడు బాగా కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయని చెప్పాలి.  ఏదేమైనా అంటే ఆర్థిక పరిస్థితి మందగించింది.. ఉద్యోగులకు […]

Share:

దేశీయ ట్విట్టర్‌గా పేరుపొందిన ” కూ” తాజాగా తమ ఉద్యోగస్తులలో మూడో వంతు ఉద్యోగులను తొలగించి ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చేసింది. ఫండింగ్ నెమ్మదించడం, నష్టాలు, ఆర్థిక  వనరులు దెబ్బతినడంతో ఇలాంటి కారణాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సంఖ్యను తగ్గించినట్లు సమాచారం. టెక్ సంస్థల్లో లే ఆఫ్ లు ఇప్పుడు బాగా కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయని చెప్పాలి.  ఏదేమైనా అంటే ఆర్థిక పరిస్థితి మందగించింది.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి అంటూ సంస్థలు చెప్పడం నిజంగా అధ్వాన్నం అనే చెప్పాలి.

ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక కూ (Koo) కూడా 30 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నష్టాలు, నిధుల సమీకరణ కష్టతరం కావడం వంటి కారణాలతో దాదాపు 250 మంది ఉద్యోగులను ఇటీవల కాలంలో తొలగించినట్లు బ్లూమ్ బెర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇకపోతే ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా మన దేశంలో కూ అని ఒక యాప్ గత మూడు సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా కేంద్రంతో ట్విట్టర్ గొడవ పడినప్పుడు బెంగళూరుకి చెందిన ఈ స్టార్టప్ సంస్థ భారీగా లాభపడింది. ఇక పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు, రాజకీయ నాయకులూ కూడా ఈ యాప్‌ను ప్రమోట్ చేయడంతో తక్కువ కాలంలోనే భారీగా ప్రజాదరణను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఇదే దూకుడుతో ఇతర దేశాల్లో కూడా అడుగు పెట్టింది కానీ ఇప్పుడు ఫండింగ్ కాస్త నెమ్మదించడంతో ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ సంస్థ. ఇకపోతే గత ఏడాది, అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే కూ సంస్థ కి మార్చ్ తో ముగిసిన ప్రేమాసికంలో 75% మేర ఫండింగ్ తగ్గిందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ట్రాక్సన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తొలగింపులు చేపట్టడం గమనార్హం ఇకపోతే ఇదే సంస్థ గత ఏడాది 15 మందిని తొలగించింది. అప్పుడు త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పిన ఈ సంస్థ ఇప్పుడు ఊహించని విధంగా 30% మంది ఉద్యోగులను తొలగించడం పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే లే ఆఫ్ లపై ఆ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ గ్లోబల్ సెంటిమెంట్తో పాటు వృద్ధి కంటే సామర్థ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఇలా ఉద్యోగాలను తొలగించడానికి కారణం అయ్యింది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇకపోతే తొలగించిన ఉద్యోగుల కోసం నష్ట పరిహార ప్యాకేజీ తో పాటు ఆరోగ్య బీమా, కొత్తగా ఉద్యోగ అన్వేషణలో  తొలగించిన ఉద్యోగులకు తోడ్పాటు వంటివి అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే కూ సంస్త పైన ఎంతోమంది తమ ఆశలను పెట్టుకుని కొత్త జీవితాలను ప్రారంభించిన వారు కూడా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా సడన్‌గా ఉద్యోగులను తొలగించడంతో వారందరూ నిరుద్యోగులు అయ్యారనే చెప్పాలి. అయితే వీరందరూ బాధపడకుండా ఇప్పుడు కొత్తగా వీరు ఉద్యోగాలను వెతుక్కోవడానికి కూ సంస్థ వారికి సహాయం చెయ్యనుంది. ఇకపోతే ఉద్యోగం అన్వేషణలో సహాయం చేసినప్పటికీ తమ సంస్థను కోల్పోవడం వారికి ఇష్టం లేదన్నట్టుగా ఉద్యోగులు చెబుతున్నారు.