తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయం నుంచే పరిపాలన ప్రారంభించింది. ఇకపోతే అవసరమైన సౌకర్యాలు, క్యాంటీన్లు, పార్కింగ్ వంటివి లేకపోవడంతో ఉద్యోగస్తులు, సందర్శకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తరచుగా షార్ట్ సర్క్యూట్లు కావడం, కాంక్రీట్ బ్యాచులు సీలింగ్ లోని భాగాలు ఒకటికంటే ఎక్కువ కూలిపోవడం వల్ల ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉండేది. అయితే ఈ అంశాలన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పరిగణనలోకి తీసుకొని పాత సచివాలయం నిర్మాణ స్థిరత్వం మరియు ఇతర అంశాలను అధ్యయనం చేయడానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సభ కమిటీని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా సమగ్ర అధ్యయనం తర్వాత కమిటీ అనేక లోపాలను గుర్తించి.. రాష్ట్ర పరిపాలన అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు 2019 జూన్ 27వ తేదీన కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అంతేకాదు ఈ కొత్త సచివాలయానికి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అయిన డాక్టర్ పొన్ని ఎం కాన్సెసావో, డాక్టర్ ఆస్కార్ జి కాన్సెసావో రూపకర్తలుగా నియమితులయ్యారు. ఇక వీరు డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించగా ఆయన ఆమోదించిన తర్వాతనే షాపూర్జి పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి కొత్త సెక్రటేరియట్ ను నిర్మించే కాంట్రాక్టును అప్పగించడం జరిగింది.
ఇకపోతే అప్పటినుంచి కొత్త సచివాలయ పనులు తెలంగాణలో శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికీ ఆ భవనం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లకు పరిపాలన ఆమోదం లభించగా ఇప్పటివరకు రూ.550 కోట్లు వెచ్చించారు. అయితే గతంలో వేసిన అంచనాల కంటే ఈసారి 30 నుంచి 40 శాతం ఖర్చులు అదనంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఖర్చులు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని 6 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే.. ఈ ఖర్చులు పెరగడానికి కారణం అయిందని సమాచారం . ఇకపోతే ఫలితంగా నిర్మాణ సామాగ్రి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయని అందుకే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తోందని అధికారులు స్పష్టం చేశారు.
మొత్తానికి అయితే తెలంగాణలో కొత్త సచివాలయం ఏర్పాటు పూర్తయింది. ఈ నేపథ్యంలోని ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం జరగగా ఆయన నిన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యావత్ తెలంగాణ సమాజానికి గొప్ప సందర్భం అని గర్వించదగ్గ తరుణమని చంద్రశేఖర రావు వెల్లడించడం జరిగింది. తక్కువ వ్యవధిలో నిర్మించిన కొత్త సచివాలయం జాతి ఖ్యాతిని పొందిందని.. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. దృఢ సంకల్ప శక్తితో స్వార్థ ప్రయోజనాల వర్గాల ద్వారా ఏర్పడిన అడ్డంకులు భయాందోళనలు అధిగమించి తాము ఈరోజు సచివాలయ నిర్మాణం పూర్తి చేశామని ఆయన తక్కువ ఎవరిలో తెలంగాణ మోడల్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచింది. కొత్త సచివాలయం తెలంగాణ మోడల్ పాలన దేశ వ్యాప్తంగా విస్తరించడానికి దోహదపడుతుందని తెలిపారు. మొత్తానికైతే ఈరోజు తెలంగాణలో కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.