ఈ 4 మొక్కలు మీ ఇంట్లో పెంచుకుంటే వద్దన్నా డబ్బే డబ్బు

ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆ ఇంటికి అందం వస్తుంది.. అయితే వాస్తు పరంగా కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వారి సంపద పెరుగుతుంది. ఆనందంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చెట్ల నుంచి వచ్చే పచ్చని గాలి మనకు ఆక్సిజన్ అందిస్తుంది. అంతేకాకుండా ఇంట్లోకి వచ్చే ఆ గాలి నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి.. ఆ గాలి మన ఇంట్లోకి వచ్చినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు […]

Share:

ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆ ఇంటికి అందం వస్తుంది.. అయితే వాస్తు పరంగా కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వారి సంపద పెరుగుతుంది. ఆనందంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చెట్ల నుంచి వచ్చే పచ్చని గాలి మనకు ఆక్సిజన్ అందిస్తుంది. అంతేకాకుండా ఇంట్లోకి వచ్చే ఆ గాలి నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి.. ఆ గాలి మన ఇంట్లోకి వచ్చినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మన ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే 4 లక్కీ ప్లాంట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం..

తులసి:

వాస్తు శాస్త్ర ప్రకారం.. తులసి మొక్క పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఎన్నో ఔషధాలు కలిగి ఉన్న మొక్క కూడా.. హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు సుఖ శాంతులతో, సిరిసంపదలతో వెల్లి విరుస్తుందని నమ్మకం. తులసి మొక్క గృహం తీర్థ స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ప్రసరించే గాలి శుద్ధి అవుతుంది. అంతేకాకుండా గాలిలోనే హానికర కెమికల్స్ ను కూడా శోషిస్తుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. ధనవృద్దికి దోహదం చేయటంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. 

మనీ ప్లాంట్: 

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో డబ్బులకు కొదవే ఉండదని చెబుతుంటారు. సంపదలను పొందడంలో సహాయపడుతుంది. మనీ ప్లాంట్ ను ఆగ్నేయ ముఖంగా ఉంచాలి. మనీ ప్లాంట్ ఎంత బాగా ఎదుగుతుంటే ఆ ఇంట్లో అంతా బాగా ధనవృద్ది జరుగుతుంది. ఈ మొక్కను ఎండిపోకుండా ప్రతినిత్యం చూసుకుంటూ ఉండాలి. మనీ ప్లాంట్ తీగను ప్రధాన ద్వారంపై ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.

మల్లె చెట్టు:

ఇంట్లో మల్లె చెట్టును పెంచుకోవడం వల్ల సువాసనలను అందించడంతోపాటు ఆ ఇల్లు సంపదతో నిండి ఉండడానికి సహాయపడుతుంది. మల్లె చెట్టు మీ ఇంట్లో పెంచుకోవడం చాలా అదృష్టం. ఈ చెట్టు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మల్లె చెట్టు దగ్గరికి వెళ్లి కాసేపు నిలబడితే చాలు మన మానసిక స్థితిని మార్చేస్తాయి. ఇంకా ఇవి ఆందోళన ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్ర కూడా ప్రేరేపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మల్లె చెట్టు తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలలో ఉంటే మంచిది. అదే దక్షిణం వైపు అయితే కిటికీ సమీపంలో ఇంటి లోపల పెంచుకోవాలి. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తిని ఆకర్షించడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను ప్రోత్సహిస్తుంది. 

స్నేక్ ప్లాంట్: 

వాస్తు శాస్త్రం ప్రకారం స్నేక్ ప్లాంట్ సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ మొక్క శాంతి, ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. కిటికీ దగ్గర ఉంచినప్పుడు.. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటుంది. ఇంకా గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది.