అక్కడ డబ్బులు పెడితే మీ అదృష్టం పండినట్లే!

మీ కుటుంబ సభ్యుల శాంతి సౌఖ్యాల కోసం ఈ పది వాస్తు సూత్రాలు పాటించండి. ప్రతి వాస్తు సలహా వెనుక శాంతి, సౌఖ్యాలను పెంపొందించే లోతైన శాస్త్రీయ కారణం ఉందనే విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టి దశ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. అయితే, ఇక ఇళ్ళు, ఆఫీసులలో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదాని […]

Share:


మీ కుటుంబ సభ్యుల శాంతి సౌఖ్యాల కోసం ఈ పది వాస్తు సూత్రాలు పాటించండి. ప్రతి వాస్తు సలహా వెనుక శాంతి, సౌఖ్యాలను పెంపొందించే లోతైన శాస్త్రీయ కారణం ఉందనే విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి.

మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టి దశ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. అయితే, ఇక ఇళ్ళు, ఆఫీసులలో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదాని గురించి కూడా వాస్తుశాస్త్రం వివరంగా చెబుతుంది. ప్రతి వాస్తు సలహా వెనుక శాంతి, సౌఖ్యాలను పెంపొందించే లోతైన శాస్త్రీయ కారణం ఉందనే విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. అవి ఆమోదయోగ్యమైనవని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి వాస్తుశాస్త్ర నిపుణులు చెపుతున్న దాని ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉండాలనేది ఇప్పుడు చూద్దాం.

కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అదృష్టం కలగడం కోసం వీటిని పాటిస్తే తేడా మీరే చూస్తారు!

1. భోజనాల గదికి ఉత్తర దిశలో లేదా ఈశాన్యపు దిశలోని గోడపై పెద్ద అద్దం అమర్చాలి. దీనివల్ల సంపద, శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి. 

2. ఇంటి నైరుతి మూలలో దక్షిణం వైపు తల పెట్టి నిద్రించడం మంచిది. కొంత మంది ఇళ్లలో మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. 

3. ఏ రూపంలోనైనా హింసను చూపించే చిత్రాలు, ఫోటోలు ఉంచకూడదు. ఇంట్లోనైనా, వ్యాపార సంస్థలలోనైనా, ఆఫీసులోనైనా సరే ఉంచకూడదు. హింస ప్రతికూలతను ఆకర్షిస్తుంది. అందువల్ల మీ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 

 4. ఇంటిలో దక్షిణం వైపు ఎర్రటి వెలుగులు చిమ్మే లైటు, లేదా దీపాన్ని ఉంచడం వల్ల కీర్తి, విజయం లభిస్తాయి.

5. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి, ఆ కుటుంబ సభ్యుల చిత్రాలను నైరుతి దిశలో ఉంచాలి.

6. ఉత్తరం వైపు కూర్చొని చదువుకుంటే పిల్లలు చదువులో విజయం సాధిస్తారు. 

7. పెళ్లి కావలసిన వాళ్ళు తమ ఇంటిలోని వాయువ్య దిశలో ఉన్న గదులలో ఉండాలి. అలా కాదని వేరే దిశలో ఉండకూడదు. 

8. డ్రాయింగ్ రూమ్‌లోని నైరుతి దిశలో పనీర్ పువ్వులను ఉంచాలి.

9. ఉత్తరాన ఉన్న అలమరాలలో నగదు ఉంచడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ధన సమృద్ధి కలుగుతుంది. అలాగే లోపల అద్దం అమర్చాలి. నగదు ఉన్న లాకర్​పై లక్ష్మీ దేవి ఫొటో ఉండేలా చూసుకోవాలని కూడా సూచిస్తారు. 

10. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కొట్లాటల వంటి సమస్యలను పరిష్కరించడానికి స్ఫటికాలతో కూడిన విండ్ చైమ్‌లను, అంటే క్రిస్టల్ విండ్ చైమ్‌లను బెడ్‌రూమ్ కిటికీలపై ఉంచాలి. 

ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అభివృద్ధి కలగడం కోసం ఇంటిలోని వారు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. కొంత మంది ఈ వాస్తు శాస్త్రాలను నమ్మరు కానీ కొంత మంది మాత్రం వీటిని ఎక్కువగా నమ్ముతారు. నమ్మేవారు మేము అందంచిన ఈ చిట్కాలను పాటించి, శుభ ఫలితాలను పొందుతారని ఆకాంక్షిస్తున్నాము.