తలంటు స్నానానికి సంబంధించిన నియమాలు

తలంటు స్నానం ఏ రోజుల్లో చేస్తే దరిద్ర దేవత మనల్ని వదిలేస్తుంది? ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాస్తు శాస్త్రం చెబుతున్నదిదే తలస్నానం ఏ రోజు చేయాలి? తలస్నానం ఏ రోజుల్లో చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి? తలంటు స్నానం ఏ రోజున చేస్తే మంచిది? సైన్స్ అనేక విషయాలను చాలా వివరంగా వివరించింది. మన ఆరోగ్యాన్ని బట్టి తలంటు స్నానం చేయడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. కొందరు ఎప్పుడు […]

Share:

తలంటు స్నానం ఏ రోజుల్లో చేస్తే దరిద్ర దేవత మనల్ని వదిలేస్తుంది? ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాస్తు శాస్త్రం చెబుతున్నదిదే

తలస్నానం ఏ రోజు చేయాలి? తలస్నానం ఏ రోజుల్లో చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి? తలంటు స్నానం ఏ రోజున చేస్తే మంచిది? సైన్స్ అనేక విషయాలను చాలా వివరంగా వివరించింది. మన ఆరోగ్యాన్ని బట్టి తలంటు స్నానం చేయడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. కొందరు ఎప్పుడు పడితే అప్పుడు తలంటు స్నానం చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు అంటున్నారు.

తలస్నానానికి, తలంటు స్నానానికి మధ్య చాలా తేడా ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలి. తలస్నానం అంటే తలపై నీరు పోసుకుని చేసే స్నానం. తలకు మెడకు నూనె రాసుకున్న తర్వాత కుంకుడు కాయలతో తలంటు స్నానం చేస్తారు. దీనినే అభ్యంగన స్నానము అని కూడా అంటారు. స్త్రీలు ప్రతిరోజూ తల స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పురుషులు ప్రతిరోజూ స్నానం చేయవచ్చని సూచిస్తుంది.

తలస్నానమైనా, తలంటు స్నానమైనా సూర్యోదయానికి ముందు చేయడమే మంచి సమయమని చెబుతారు. అల్పాహారం తర్వాత లేదా తిన్న తర్వాత ఏమి చేసినా ఫలితం ఉండదని, అనారోగ్యాలు వస్తాయన్నారు. అయితే వృద్ధులు కాస్త ఉదయం పూట ఎండ వచ్చిన తర్వాత చేస్తే పర్వాలేదు. రోజూ తలస్నానం చేయడం, తలంటూ స్నానం చేయడం మంచిది కాదు. కొన్ని రోజులలో తలంటు స్నానం చేయడం వల్ల కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయి.

తలంటు స్నానానికి రెండు రోజులు మంచివి. పురుషులు ప్రతిరోజూ తలస్నానం చేయవచ్చు. కానీ స్త్రీలు ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలంటు స్నానం విషయానికి వస్తే కొన్ని రోజులు ప్రత్యేక రోజులుగా సూచించబడ్డాయి. ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతోంది. 

కొన్ని రోజుల్లో తలంటు స్నానం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆదివారం తలంటు స్నానం చేయడం మంచిది కాదు. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సంతానానికి హాని కలుగుతుంది. సోమవారం తలంటు స్నానం చేస్తే ఎప్పటికీ తీరని వేదనలు కలుగుతాయి. భయం వెంటాడుతుంది. శరీరం కాంతిని కోల్పోతుంది. మంగళవారం తలంటు స్నానం చేస్తే ప్రాణహాని కలుగుతుంది. భార్యలు మంగళవారం తలంటు స్నానం చేయడం వల్ల భర్తకు ప్రమాదం ఏర్పడుతుంది. 

శుక్రవారం, గురువారాల్లో తలస్నానం లేదా తలంటు స్నానం చేస్తే ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. శత్రు బాధలు పెరుగుతాయి. అశాంతి ఉంటుంది. చదువుకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. శుక్రవారం స్నానం చేయడం వల్ల అశాంతి కలుగుతుంది. వ్యాధులు పెరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో తలస్నానం, తలంటు స్నానం చేయమని ఎవరూ చెప్పరు.

బుధ, శనివారాల్లో తలంటు స్నానం మంచిదే. బుధవారం తలంటు పోసుకోవడం వల్ల కీర్తి, ఐశ్వర్యం, ధనలాభం వంటి సకల శుభ ఫలితాలు వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. శనివారం తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవిత కాలం పెరుగుతుంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. శనివారం తలస్నానం చేయడం అన్ని విధాలా మేలు చేస్తుంది. ఈ రెండు రోజుల్లో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనల్ని వదిలి వెళ్లిపోతుంది. అయితే ఇవి కాకుండా పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు, జన్మదినాల్లో తలస్నానం లేదా తలంటు స్నానం చేయాలనే నిబంధనలు లేవు.