వాస్తు చిట్కాలు.. సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏవో తెలుసా?

పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను సరిగ్గా పాటించకపోతే ఆర్థిక సమస్యలు,  కుటుంబ సమస్యలు,  ఇంట్లో కలహాలు ఇంకా మరెన్నో కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యోతిష్యం ఎంతటి ప్రాముఖ్యతను సంకరించుకుందో వాస్తు శాస్త్రం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక ఇంటిని నిర్మించాలన్నా.. లేదా ఆ ఇంట్లో వస్తువులను సవ్య దిశలో ఉంచాలన్నా వాస్తు తప్పనిసరిగా పాటించాల్సిందే.  ఒకవేళ వాస్తును మనం సరిగ్గా పాటించకపోతే ఆర్థిక సమస్యలు,  కుటుంబ సమస్యలు,  ఇంట్లో కలహాలు మరెన్నో నష్టాలను […]

Share:

పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను సరిగ్గా పాటించకపోతే ఆర్థిక సమస్యలు,  కుటుంబ సమస్యలు,  ఇంట్లో కలహాలు ఇంకా మరెన్నో కష్టాలను కొనితెచ్చుకున్నట్టే.

హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యోతిష్యం ఎంతటి ప్రాముఖ్యతను సంకరించుకుందో వాస్తు శాస్త్రం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక ఇంటిని నిర్మించాలన్నా.. లేదా ఆ ఇంట్లో వస్తువులను సవ్య దిశలో ఉంచాలన్నా వాస్తు తప్పనిసరిగా పాటించాల్సిందే.  ఒకవేళ వాస్తును మనం సరిగ్గా పాటించకపోతే ఆర్థిక సమస్యలు,  కుటుంబ సమస్యలు,  ఇంట్లో కలహాలు మరెన్నో నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత కాలంలో కూడా వాస్తు శాస్త్రాలను ప్రతి ఒక్కరూ తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. అంటే ఇక మనపై వాటి ప్రభావం ఏ విధంగా పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా మంగళవారం రోజున గోర్లను కత్తిరించకూడదు .. వెంట్రుకలు కట్ చేయకూడదు.. షేవింగ్ చేయకూడదు అంటూ చెబుతారు.  మరి శుక్రవారం అయితే చాలు అప్పులు ఇవ్వకూడదు.. ఉప్పు, పప్పులు ఇతరులకు దానం చేయొద్దు అంటూ ఉంటారు. సాధారణంగా అస్తమానం మన పెద్దలు ఇలాంటివి చెబుతూ ఉంటే మనం చాదస్తం అని వాటిని పట్టించుకోవడం లేదు.. కానీ ఇవన్నీ కూడా హిందూ మత గ్రంథాలలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అంతేకాదు వీటి వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.. ఇకపోతే నేటి జ్యోతిష్య,  వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఇప్పుడు చెప్పబోయే కొన్ని పనులు చేయకూడదట. ఒకవేళ చేస్తే వాటివల్ల ఆర్థిక నష్టాలే కాదు కుటుంబ గౌరవం కోల్పోవడం, ఇంట్లో కలహాలు ఇలా మనకు ఎన్నో నష్టాలు కలుగుతాయట.

సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు. చాలామంది ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది.  నిత్యం తులసి పూజ చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.  అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత సంధ్య వేళలో తులసి మొక్కను తాకడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆర్థిక నష్టాలను మిగులుస్తుందట.

ఇలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవడం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడింది.  పొరపాటున కూడా మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకి పోతుందని విశ్వసిస్తారు. ఇల్లు శుభ్రం చేయాలంటే సూర్యాస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.

అలాగే సూర్యాస్తమయం తర్వాత  ఎవరికైనా సరే పాలు, పెరుగు,  పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులు ఏవైనా సరే ఇవ్వకూడదు. తెల్లటి వస్తువులు చంద్రుడికి ప్రతీకగా పరిగణించబడతాయి.  అందుకే సాయంత్రం వేళల్లో తెల్లని వస్తువులను ఇతరులకు దానం చేస్తే ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. వీటితోపాటు వెల్లుల్లి,  ఉల్లిపాయలు కూడా ఇవ్వకూడదు.

సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఇవ్వకండి.  ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి.

సాయంత్రం పూట్ల గోర్లను కత్తిరించడం,  జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు.

వైవాహిక బంధంలో ఉండేవారు కూడా సూర్యాస్తమయ సమయంలో కలయికలో పాల్గొనకూడదు. ఇలా చేస్తే బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది.

అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో చెత్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడవేయకూడదు. పొరపాటున సాయంకాలం వేళల్లో చెత్తను బయట వేస్తే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.  తద్వారా ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి నష్టాలను కలుగజేస్తుంది.