వృషభ రాశి వారు ఈ 5 రాశుల వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవచ్చు

కృత్రిక నక్షత్రం 1,2,3 మూడు పాదాలు, రోహిణి నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకు వస్తారు.. వృషభ రాశి  వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనుకునే విధంగా వీరు ఉంటారు.. రిస్క్ తో కూడిన పనుల కంటే కూడా నిదానంగా సాఫీగా వెళ్లే విధానాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని చేసుకోబోయే జీవి స్వామిని […]

Share:

కృత్రిక నక్షత్రం 1,2,3 మూడు పాదాలు, రోహిణి నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకు వస్తారు.. వృషభ రాశి  వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనుకునే విధంగా వీరు ఉంటారు.. రిస్క్ తో కూడిన పనుల కంటే కూడా నిదానంగా సాఫీగా వెళ్లే విధానాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని చేసుకోబోయే జీవి స్వామిని వీరు కూడా అర్థం చేసుకుంటారు. అలాగే వారు కూడా తనని ఇష్టపడాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని ప్లాన్ ప్రకారం ముందు నుంచే అమలు చేయడానికి ఇష్టపడతారు. అది ఏ విషయం అయినా కూడా. వృషభ రాశి వారికి అనుకూలమైన, జీవిత భాగస్వామిగా చేసుకునే ఐదు రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కర్కాటక రాశి:

వృషభ రాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. వృషభానికి అధిపతి శుక్రుడు అవ్వడం వల్ల శుక్రుడు వివాహకారుడు, భాగ్యగారకుడు, కళద్రకారకుడు.. శుక్రుడు మన జీవితంలో ఎన్నో విషయాలను నిర్ణయిస్తారు. శుక్రుడు మంచి విషయాలలో ముఖ్యమైనవాడు. అదేవిధంగా  వృషభ రాశి వారు కర్కాటక రాశి వారిని చేసుకుంటే జీవితం ఆనుకూలంగా ముందుకెళ్తుంది.

కన్యరాశి: 

ఈ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాస్తవికానికి ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహిస్తారు. వృషభ రాశికి కన్యారాశిని గొప్ప మ్యాచ్ గా చెప్పవచ్చు.. మీరు స్థిరత్వం, విశ్వనీయతకు కూడా చక్కటి విలువలు ఇస్తారు. ఈ రెండు సంకేతాలు కష్టపడి అంకితభావంతో పనిచేసే లక్షణాలను కలిగి ఉంటాయి. జీవితంలో వీరిద్దరి మధ్య మంచి ప్రేమ బంధం ఏర్పడుతుంది. ఒకరు గురించి ఒకరు అవగాహన చేసుకోవడంతో పాటు బలమైన స్థిరమైన బంధాన్ని ఇద్దరూ ఏర్పరచుకుంటారు. 

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు మృదువైన స్వభావిగా అనిపిస్తారు. అదేవిధంగా సవాళ్లను స్వీకరిస్తారు. ఈ రెండు రాశులలో కూడా నిబద్ధత విధేయత కలిగి ఉంటాయి. వీరిద్దరిదీ శక్తివంతమైన పేరుగా చెప్పుకోవచ్చు ఈ రెండు రాశుల వారు కనుక పెళ్లి చేసుకుంటే లోతైన సంబంధాన్ని సృష్టించేందుకు మీరు ప్రతినిత్యం కష్టపడుతూనే ఉంటారు. ఒకరి ప్రేమలో మరొకరు కూరుకుపోతారు. అంతేకాకుండా వీరి జీవితంలో వచ్చిన కష్టాలను అధిగమించడానికి ఇద్దరూ ఒక తాటిపైకి వచ్చి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారు. 

మకర రాశి: 

మకర రాశి వారు కృషి, పట్టుదల, అంకిత భావంతో ఉంటారు. అందువలన వృషభ రాశికి మకర రాశి వారు అనుకూలంగా ఉంటారు. ఇద్దరూ కూడా ప్రతి విషయాన్ని జీవితానికి తగిన విధంగా ఆచరణాత్మకంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రణాళికలు చేసుకుంటారు. ఇంకా ఇద్దరి కలలు ఆశయాలు సాధించడానికి ఒకరికి ఒకరు సహాయపడతారు. ఒకరి మీద ఒకరు అమితమైన నమ్మకాన్ని ఏర్పరుచుకోవడంతోపాటు ప్రేమ బంధాన్ని సృష్టించుకుంటారు. 

మీన రాశి: 

మీన రాశి వారు సున్నితత్వం, సృజనాత్మక ను కలిగి ఉంటారు. వృషభ రాశికి మీనరాశి అనుకూలమైన జీవిత భాగస్వామి రాశి అని చెప్పుకోవచ్చు. వృషభం మీనం రెండు రాశులు కూడా విధేయత నిబద్ధతకు చక్కటి విలువని ఇస్తాయి ఒకరి భావోద్వేగాన్ని మరొకరు చక్కగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ వైవాహిక జీవితంలో అన్యోన్యంగా ఉంటారు. వీరి దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా ఏకాంత జీవితాన్ని గడపడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశికి కన్యా , కర్కాటకం , మకరం, వృశ్చికం, మీనా రాశుల వారు బలమైన శాశ్వత బంధానికి దారితీస్తుంది. వీరితో కనుక వృషభ రాశి వారు అడుగు వేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. వీరి బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం అనునిత్యం నిబద్ధతగా ఉంటారు.  వృషభ రాశి వారికి ఈ ఐదు రాశులు జీవిత భాగస్వామిగా అనుకూలమైన రాశులుగా చెప్పుకోవచ్చు.