తమిళనాడులో బీజేపీ నాయకుడిని దారుణ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

రాజకీయాలు రోజురోజుకి ఎంత దిగజారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన ఆంధ్ర ప్రదేశ్ లో తరుచు ఇలాంటివి జరగడం మనం టీవీలలోను దిన పత్రికలలోను చూస్తూనే ఉన్నాము. అయితే పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే మనవే కాస్త బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అందరిని తీవ్రమైన విషాదంలోకి నెట్టేసింది. ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడులోని వరపురం పంచాయత్ కౌన్సిల్ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర ట్రెజరర్ PPJ […]

Share:

రాజకీయాలు రోజురోజుకి ఎంత దిగజారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, మన ఆంధ్ర ప్రదేశ్ లో తరుచు ఇలాంటివి జరగడం మనం టీవీలలోను దిన పత్రికలలోను చూస్తూనే ఉన్నాము. అయితే పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే మనవే కాస్త బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అందరిని తీవ్రమైన విషాదంలోకి నెట్టేసింది. ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడులోని వరపురం పంచాయత్ కౌన్సిల్ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర ట్రెజరర్ PPJ శంకర్ ని కొందరు గుర్తు తెలియని వ్యక్తి అతనిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసిన ఘటన యావత్తు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అధికార పార్టీ DMK పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది. ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన లా & ఆర్డర్ నేడు అదుపు తప్పి గూండా మూకల చేతుల్లోకి వెళ్లిందని, పోలీసులు ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా చూడాల్సింది పోయి, ప్రభుత్వానికి తొత్తుగా మారి వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకుంటోందని మండిపడుతున్నాయి.

ఈ రాష్ట్రానికి తానే నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటూ చెప్పుకొని తిరిగే స్టాలిన్, పోలీసులను మరియు లా & ఆర్డర్ ని తన చేతిలో పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తున్నాడని, లేని పోనీ కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పై విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, ఈ దుర్మార్గానికి పాల్పడిన హంతకుడిని పట్టుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఆగవని, ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామంటూ తమిళనాడు బీజేపీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చాడు.PPG శంకర్ ఎన్నో ఏళ్ళ నుండి తమిళనాడు బీజేపీ పార్టీ లో ఎనలేని సేవలను అందిస్తూ వచ్చాడు. అయితే PPG శంకర్ పై అంతకు ముందు 15 క్రిమినల్ కేసులు ఉన్నాయి, రెండు సార్లు గూండా యాక్ట్ కూడా అతని మీద పడింది. ఎప్పుడూ గొడవల్లోనే ఉంటాడు కాబట్టి అతనిని చంపాలని కాచుకొని కూర్చున్న శత్రువులే ఈ పని చేసారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ పై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీ తరుపున ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాడట. ప్రభుత్వం ని ప్రశ్నించాల్సిన సమయం లో ఏ మాత్రం తడబడకుండా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిన చరిత్ర ఆయన సొంతం,ఇంకొన్ని రోజులు పోతే బీజేపీ పార్టీ ఆయనకీ ఉన్నత పదవి కూడా ఇచ్చేది, వచ్చే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలలో MLA సీట్ కూడా వచ్చేదట, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న సమయం లో ఆయనకీ ఇలా జరగడం బీజేపీ పార్టీ కార్యకర్తలను శోకసంద్రం లోకి నెట్టేసింది. దీనిపై కేవలం బీజేపీ పార్టీ నాయకులూ మాత్రమే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా శంకర్ కి మద్దతుగా నిలిచారు, ఆయన మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. మరి శంకర్ ని హత్య చేసిన హంతకులను పోలీసులు పట్టుకుంటారా, ప్రభుత్వం ఈ విషయంలో చురుగ్గా పని చేస్తుందా లేదా అనేది చూడాలి. కనీసం ఇప్పుడైనా శంకర్ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చెయ్యకుండా మన నాయకులు మానవత్వం చూపిస్తారో లేదో చూడాలి. ఆయన ఆత్మకు ఎక్కడున్నా శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు కొండంత ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము.