మెట్ గాలా 2023: అద్భుతమైన వస్త్రాదరణతో రెడ్ కార్పెట్ పై నడిచిన ఆలియా, ప్రియాంకా, ఈశా అంబానీ

మెట్ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రతి ఏడాదీ ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి బాలీవుడ్ నుంచి ఆలియాభట్, ఈశా అంబానీతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా హాజరై ఈవెంట్లో సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ భామల అందానికి ఫిదా అవుతూ లైక్స్, […]

Share:

మెట్ గాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రతి ఏడాదీ ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి బాలీవుడ్ నుంచి ఆలియాభట్, ఈశా అంబానీతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా హాజరై ఈవెంట్లో సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ భామల అందానికి ఫిదా అవుతూ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. 

తాజాగా మెట్ గాలా 2023 ఫ్యాషన్ డే రెడ్ కార్పెట్ పై ఇండియన్ సెలబ్రిటీలైన ఆలియా భట్, ప్రియాంక చోప్రా ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ పై నడిచి తమ ఉనికిని చాటుకున్నారు. ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అతిపెద్ద నగరం న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మే 1న అంటే భారతదేశ కాలమానం ప్రకారం మే రెండవ తేదీన మెట్ గాలా 2023 ఫ్యాషన్ షో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల శ్రేణి ఇప్పటికే రెడ్ కార్పెట్ పై నడవడం ప్రారంభించారు. తాజాగా మెట్ గాలా రెడ్ కార్పెట్ లైవ్ స్ట్రీమ్ వోగ్ వెబ్సైట్లో సాయంత్రం 6:30 EST కి ( మే 2 4:00am IST) స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. ఇకపోతే బాలీవుడ్ సినీ పరిశ్రమ నుండి ప్రియాంక చోప్రా అలాగే ఆలియా భట్ ఇద్దరు కూడా తమ అద్భుతమైన దుస్తులతో అందరినీ అబ్బురపరిచారు. అంతేకాదు తమ డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

 బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ ఏడాది మొదటిసారి మెట్ గాలాలో అరంగేట్రం చేసింది. తాజాగా ఈమె గాల్ గాడోట్ హార్ట్ ఆఫ్ స్టోన్ తో హాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ఈ అద్భుతమైన క్షణం కోసమే ఆమె ఎదురుచూసినట్లు సమాచారం. ఈ వేడుకల్లో ఫ్యాషన్ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన ఒక ముత్యాల గౌన్ ని ఆలియా ధరించింది. ఈ వైట్ గౌన్ తయారు చేయడానికి తయారీదారులకు సుమారుగా 1లక్షకి పైగా ముత్యాలు ఉపయోగించినట్లు సమాచారం. ఈ అందమైన ముత్యాలు పొదిగిన గౌన్ ధరించి పాలధారలా మెరిసిపోయింది ఆలియా భట్. అసలే వైట్ స్కిన్ పైగా ఇలాంటి అద్భుతమైన వైట్ డ్రెస్ ధరించి మరొకసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇంత అద్భుతమైన గౌన్ ధరించిన ఈమె అందుకు మ్యాచింగ్‌గా ముత్యాల ఇయర్ రింగ్స్, స్టేట్మెంట్ రింగును కూడా ధరించింది. ఆలియా అలా ముత్యాల గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తుంటే అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకి పని చెప్పేశారు. అంతేకాదు అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు అంతా కూడా ఈమె వైపే తమ దృష్టి సారించారని చెప్పాలి.

ఇక మరొక సెలబ్రిటీ ప్రియాంక చోప్రా.. వాస్తవానికి ఈమె 2017లో మెట్ గాలా లోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుండి మూడుసార్లు ఫ్యాషన్ మెట్ గాలకు హాజరైన ఈమె ఈసారి తన భర్త నిక్ జోనస్ తో కలిసి రెడ్ కార్పెట్ పైన నడిచింది. ప్రియంకా, తన భర్త ఇద్దరూ కూడా బ్లాక్ కలర్ దుస్తులు ధరించి అందరిని ఆకర్షించారు. ప్రియాంక బ్లాక్ హాఫ్ షోల్డర్ గౌనులో థైస్ కనిపించేలా తన అద్భుతమైన వస్త్రధారణతో యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె రఫ్ఫుల్ కేప్ కూడా ధరించింది. అంతేకాదు మ్యాచింగ్ తగ్గట్టుగా డైమండ్ నెక్లెస్‌తో పాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వేసుకుని తన జుట్టును బన్ లాగా కట్టుకుంది. ప్రియాంకా భర్త నిక్ జోనస్ కూడా నలుపు రంగు సూట్‌లో ఆమెను కూడా డామినేట్ చేసేలా రెడీ అయ్యాడు. మొత్తానికైతే వీరంతా రెడ్ కార్పెట్ పైన నడిచి మరొకసారి ఇండియన్ ఉనికిని చాటారని చెప్పాలి. ఈషా అంబానీ కూడా ఈ వేడుకల్లో పాల్గొని బ్లాక్ డ్రెస్ లో విజువల్ ట్రీట్ ఇచ్చారు.