కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్డేట్స్: రోడ్ షోలో విరుచుకుపడ్డ రాజ్ నాథ్ సింగ్

తాజాగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా అవినీతి పెరిగిపోతోందని కోవిడ్ 19 నుంచి ఇటీవల కోలుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.  బెలగావిలో జమకండీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని […]

Share:

తాజాగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా అవినీతి పెరిగిపోతోందని కోవిడ్ 19 నుంచి ఇటీవల కోలుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.  బెలగావిలో జమకండీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వారి మంత్రివర్గంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్ళవలసి వచ్చింది కానీ ఈ తొమ్మిది సంవత్సరాల నుండి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు మన ప్రధాని గానీ ఇంకే మంత్రి గానీ కూడా అవినీతికి పాల్పడలేదు. 

కాంగ్రెస్ అవినీతికి మారుపేరు.. కాంగ్రెస్ నాయకులంతా అవినీతిపరులు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పలు పార్టీల నాయకులు ప్రచారం చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారంలో నాయకులు కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నారు.  ప్రముఖ హీరో బహుభాషా నటుడు ఈసారి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో దుమ్ము దులిపేస్తున్నారని చెప్పాలి. సుదీప్ అభిమానులు బీజేపీ నాయకులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కిచ్చా సుదీప్ చేపట్టిన ఈ ర్యాలీలో యువత నుంచి అనుభ్యమైన స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం. 

ఇకపోతే తాజాగా గురువారం (ఈ రోజు) ఉదయం హీరో కిచ్చా సుదీప్ బీజేపీ తరఫున రోడ్డు షోలో పాల్గొని ఆయన అభిమానులు బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో కొట్టూరు సమీపంలోని హెలిపాడ్ చేరుకున్న హీరో సుదీప్ కి బీజేపీ నాయకులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన హీరో సుదీప్ రోడ్డు షోలో పాల్గొన్నారు. కూడ్లగి బీజేపీ అభ్యర్థి లోకేష్ నాయక్ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన హీరో సుదీప్ ఆయన అభిమానులను కూడా పలకరించారు. ఎలాగైనా సరే లోకేష్ నాయక్ ను గెలిపించాలని హీరో సుదీప్ బీజేపీ కార్యకర్తలకు, తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే గురువారం హీరో సుదీప్ బళ్ళారి, హవేరి ,రాణీ బెన్నూరు, బ్యాడగి, కుందగూల సండూరులో ఎన్నికల ప్రచారం చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అంతేకాదు ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా హీరో సుదీప్ ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారం చేయాలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అదే కులానికి చెందిన హీరో సుదీప్ తో ఎన్నికల ప్రచారం చేయించి ఆ కులం ఓట్లు బీజేపీకి పడేలా ఆ పార్టీ నాయకులు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వాల్మీకి కులం ఓటర్లతో పాటు హీరో సుదీప్ అభిమానుల ఓట్లు ఎక్కడికీ పోకుండా బీజేపీ నాయకులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

మరొకవైపు కర్ణాటకలోని పలు నియోజకవర్గాలలో కూడా ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలన్నా సరే వాల్మీకి కులం ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. అందుకే హీరో సుదీప్ తో పాటు వాల్మీకి కులానికి చెందిన మాస్ లీడర్ మంత్రి బళ్లారి శ్రీరాములతో కూడా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు. ఏది ఏమైనా ఈసారి బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.