ఆస్ట్రేలియాలో మన ఇండియన్స్ పరువు తీసిన భారతీయుడు బాలేష్ ధన్కర్

విదేశాల్లో ఉంటూ మన భారతదేశం గర్వపడే పనులు చేసిన భారతీయులు ఎంతోమంది ఉన్నారు, వారివల్ల మన దేశ ప్రతిష్ట పదింతలు పెరిగింది. అది చూసి మురిసిపోతున్న మనకి బాలేష్ ధన్కర్ అనే వ్యక్తి చేసిన ఒక నీచమైన పని మన దేశ ప్రతిష్టకి భంగం కలిగేలా చేసింది. బాలేష్ ధన్కర్ ఆస్ట్రేలియాలో గొప్పగా స్థిరపడిన ఒక భారతీయుడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇతను చేసిన దుర్మార్గాలు తెలిస్తే మన చెప్పు తీసుకొని […]

Share:

విదేశాల్లో ఉంటూ మన భారతదేశం గర్వపడే పనులు చేసిన భారతీయులు ఎంతోమంది ఉన్నారు, వారివల్ల మన దేశ ప్రతిష్ట పదింతలు పెరిగింది. అది చూసి మురిసిపోతున్న మనకి బాలేష్ ధన్కర్ అనే వ్యక్తి చేసిన ఒక నీచమైన పని మన దేశ ప్రతిష్టకి భంగం కలిగేలా చేసింది. బాలేష్ ధన్కర్ ఆస్ట్రేలియాలో గొప్పగా స్థిరపడిన ఒక భారతీయుడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఈ ఇతను చేసిన దుర్మార్గాలు తెలిస్తే మన చెప్పు తీసుకొని కొడతాము. అవసరాలలో ఉన్న ఆడబిడ్డలను పసిగట్టి, వారికి మాదక ద్రవ్యాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గుడు చేసిన నీచమైన కార్యకలాపాలను ఆస్ట్రేలియన్ పోలీసులు పసిగట్టి ఇతనిని అరెస్ట్ చేశారు. ఇక బాలేష్ ధన్కర్ గురించి పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అతని గురించి తెలిసిన కొన్ని నిజాలు తెలిసి అందరూ షాక్ కి గురి అవుతున్నారు. 

బాలేష్ ధన్కర్ ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీకి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇతగాడు మన ఇండియాకి సంబంధించిన ఒక పార్టీ కోసం పని చేశాడు కూడా. ఇతనికి మొదటి నుండి కొరియన్ భాష అన్నా, అక్కడి సినిమాలన్నా పిచ్చి. ముఖ్యంగా కొరియన్ సినిమాల్లో హీరోయిన్స్ ని చూస్తే ఈ కామాంధుడు మెంటలెక్కిపోతాడు. ఆ క్రమంలోనే కొరియన్ అనువాదకులు కావాలంటూ 2017 వ సంవత్సరంలో ఒక ప్రకటన చేశాడు. అప్పుడే కొత్తగా సిడ్నీకి వచ్చి ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువత ఈ ప్రకటన చూసి ఇతని వద్దకు ఉద్యోగం చెయ్యడానికి వచ్చారు. మొదట ఒక హోటల్లో ఇంటర్వ్యూ చేసేవాడు. వాళ్ళు మాట్లాడిన మాటలను మొత్తం రికార్డు చేసేవాడు, ఆ తర్వాత వారికి లేని పోనీ మాయమాటలు చెప్పి డిన్నర్‌కి రావాలంటూ ఒత్తిడి చేసేవాడు. అంత పెద్ద సంస్థకి అధినేత పిలిచాడు కాబట్టి, వెళ్లకపోతే బాగుండదు కాబట్టి వాళ్ళు కూడా డిన్నర్‌కి వచ్చేవారు. 

అలా డిన్నర్‌కి వచ్చిన కొరియన్ ఆడ బిడ్డలకు వైన్‌లోను, ఐస్‌క్రీం‌లోను డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. వాళ్ళు అపస్మారక స్థితికి వెళ్లిపోయిన తర్వాత వాళ్లపై అత్యాచారం జరిపేవాడు. మళ్ళీ ఆ సంఘటనలను తన కెమెరాలతో వీడియో తీసేవాడు ఈ కీచకుడు. ఇతనిపై వచ్చిన ఆరోపణలను గమనించి 2018 వ సంవత్సరంలో పోలీసులు ఇతని అపార్ట్మెంట్స్‌పై సోదాలు నిర్వహించారు. అప్పుడు వారికి పదుల సంఖ్యలో వీడియోలు దొరికాయి. ఆ వీడియోలను దాచిపెట్టిన ఫోల్డర్లకు కొరియన్ మహిళల పేర్లు పెట్టాడు. ఇది ఇలా ఉండగా డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైనా ఒక అమ్మాయిపై అకృత్యాలు చేసిన వీడియోతో ఇతనిపై కేసు నమోదు చెయ్యబడింది. ఇతని కేసు నిన్న వాయిదాకి రాగా, చేసిన ఈ నీచపు పనులకు తాను సిగ్గు పడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా ప్రాధేయ పడ్డాడు. ఇతనికి సపోర్టుగా ఇతని భార్య కూడా వచ్చింది. కానీ కోర్టు ఇతగాడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. భారతీయుడు అయ్యుండి, విదేశాలలో మన పరువు తీసినందుకు గాను ఇతగాడిపై మన ఇండియన్స్ ఆవేశంతో రగిలిపోతున్నారు. సరైన శిక్ష వెయ్యకపోతే మేమే అక్కడికి వచ్చి అతనిని  చంపేస్తాము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.