జ్యోతిషశాస్త్రంలో వజ్రాలు ధరించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వజ్రాలకు అంత ప్రాముఖ్యత ఎందుకు?

 ప్రాచీన కాలం నుండి,వజ్రం ఐశ్వర్యానికీ స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేది. మిరుమిట్లు గొలిపే ప్రకాశం గల వజ్రాలకు వేరేదేదీ సాటి రాదని మనమందరం ఖచ్చితంగా నమ్ముతున్నాం.  ప్రాచీన కాలం నుండి, వజ్రం ఐశ్వర్యానికీ, స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేది. మిరుమిట్లు గొలిపే ప్రకాశం గల వజ్రాలకు వేరేదేదీ సాటి రాదు. నెక్లెస్‌లు, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కు పుడకలు, ఇలా ఎన్నో రకాలుగా ధరించే ఈ అద్భుతమైన రత్నాన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని స్త్రీలూ ఇష్టపడతారు.  వజ్రం ఆనందం, కీర్తి, […]

Share:

 ప్రాచీన కాలం నుండి,వజ్రం ఐశ్వర్యానికీ స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేది. మిరుమిట్లు గొలిపే ప్రకాశం గల వజ్రాలకు వేరేదేదీ సాటి రాదని మనమందరం ఖచ్చితంగా నమ్ముతున్నాం. 

ప్రాచీన కాలం నుండి, వజ్రం ఐశ్వర్యానికీ, స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేది. మిరుమిట్లు గొలిపే ప్రకాశం గల వజ్రాలకు వేరేదేదీ సాటి రాదు. నెక్లెస్‌లు, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కు పుడకలు, ఇలా ఎన్నో రకాలుగా ధరించే ఈ అద్భుతమైన రత్నాన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని స్త్రీలూ ఇష్టపడతారు. 

వజ్రం ఆనందం, కీర్తి, శ్రేయస్సులకు చిహ్నం. అంతే కాకుండా, ఈ అద్భుతమైన రత్నం, వైవాహిక జీవితంలో మధురిమలను జోడిస్తుందని, భార్యాభర్తల అనుబంధాన్ని కాపాడుతుందని  కూడా అంటారు. కానీ వజ్రాన్ని అన్ని రాశులవారూ ధరించకూడదు. కొన్ని రాశుల వారు వజ్రాన్ని ధరిస్తే వాళ్ళకి కొన్ని చెడ్డ పరిణామాలు కూడా కలుగవచ్చు.

ఏ రాశులవారు వజ్రాలకు దూరంగా ఉండాలి?

వజ్రాలను ధరించడం వల్ల అన్ని రాశుల వారూ ప్రయోజనాలు పొందలేరు. కొన్ని రాశులవారు వాటిని ధరించడం అసలు మంచిది కాదు. దానివల్ల చాలా నష్టపోతారు కూడా.

మేషం, మీనం, వృశ్చికం -ఈ రాశులవారు వజ్రాలను ధరించడం అస్సలు మంచిది కాదు. అందువల్ల ఈ రాశులవారు వజ్రాల జోలికి కూడా వెళ్లకపోవడమే మంచిదని నిపుణులైన జ్యోతిష్కులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ రాశులవారికి వారికి వజ్రం చేసే మేలు కంటే కీడే ఎక్కువ. ఇది వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రాశులవారికి ఇది దురదృష్టాన్ని కలుగజేస్తుందని కూడా నమ్ముతారు. అందువల్ల, వారు వజ్రాలు ధరించకుండా ఉండేలా చూడాలి.

వజ్రాలు ఏ రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తాయి? 

వజ్రానికి అధిపతి శుక్రుడు. అందువల్ల, జ్యోతిష్య పరమైన ప్రయోజనాలను పొందడం కోసం, జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రత్నాన్ని ధరించడం మంచిది.

అలాగే, మిథునం, తుల, కన్య, మకర రాశులవారికి కూడా వజ్రాలు ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వారికి ఎంతో అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది.

వజ్రాలు ధరించడానికి పాటించవలసిన ఇతర నియమాలు

జ్యోతిష్యులు వజ్రాలను శుక్రవారం రోజున ధరించడం మంచిదని అంటారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వజ్రాలను వెండిలో గానీ బంగారంలో  గానీ పొదిగి ధరించవచ్చు. వజ్రాలను

కొంతమందికి వజ్రాల వల్ల కలిగే ప్రయోజనాల మాట పక్కన పెడితే. జీవితంలో శాంతి, అభివృద్ధి కోసం కాంక్షించేవాళ్ళు, తమ ఉంగరపు వేలికి వజ్రాన్ని ధరిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయని కూడా  జ్యోతిష్య శాస్తంలో చెప్పబడింది. జీవితంలో ఆనందం, సంపద, ప్రశాంతత కావాలని కోరుకుంటున్నట్లయితే వాళ్ళు బొటనవేలు, చూపుడు వేలుకి వజ్రాలను ధరించవలసి ఉంటుంది. బొటనవేలు యొక్క అధిపతి శుక్రగ్రహం అని అంటారు. అందువల్ల, వజ్రాన్ని బొటనవేలుకి ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వేలిపై ధరించడం వల్ల ఆ గ్రహాధిపతి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్కుల మాట. ఈ విషయాలను కొంత మంది నమ్మకపోయినా కానీ కొంత మంది మాత్రం వాటిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. 

అందువల్ల మీ రాశిని బట్టి వజ్రాన్ని ధరించవచ్చో, ధరించకూడదో చూసుకొని, సరైన విధానంలో ధరించి ఆ దివ్య రత్నం యొక్క ఫలితాలను పొంది ఆనందించండి.