శనిదేవుడి ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి

తరచుగా మీరు తమ చేతులకు మరియు కాళ్ళకు నల్ల దారాన్ని కట్టుకునే వ్యక్తులను చూసి ఉంటారు. ఇది నరదిష్టి నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు. కానీ బ్లాక్ థ్రెడ్ మిమ్మల్ని ప్రతికూల శక్తుల నుండి సురక్షితంగా ఉంచడంలో మాత్రమే కాకుండా విజయాన్ని తీసుకురావడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బ్లాక్ థ్రెడ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. శనివారం ఇలా నల్ల దారం వేసుకుంటే శనిగ్రహం నుండి విముక్తి ఈ రాశి వారు చేతులకు, కాళ్లకు నల్ల దారం కట్టుకోకూడదు  […]

Share:

తరచుగా మీరు తమ చేతులకు మరియు కాళ్ళకు నల్ల దారాన్ని కట్టుకునే వ్యక్తులను చూసి ఉంటారు. ఇది నరదిష్టి నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు. కానీ బ్లాక్ థ్రెడ్ మిమ్మల్ని ప్రతికూల శక్తుల నుండి సురక్షితంగా ఉంచడంలో మాత్రమే కాకుండా విజయాన్ని తీసుకురావడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బ్లాక్ థ్రెడ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

శనివారం ఇలా నల్ల దారం వేసుకుంటే శనిగ్రహం నుండి విముక్తి

ఈ రాశి వారు చేతులకు, కాళ్లకు నల్ల దారం కట్టుకోకూడదు 

నేటి కలియుగంలో శని దేవుడిని కర్మ దేవత అని కూడా పిలుస్తారు. ప్రతి వ్యక్తికి వారి గత చర్యల ఆధారంగా శని ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇందువల్ల ప్రజలు శని దేవుడి ప్రభావం గురించి భయపడుతుంటారు. అయితే శని దేవుడు కేవలం కర్మల ప్రకారమే ఫలితాలను ఇస్తాడు తప్ప.. అందరికీ హాని చేయడు.

ఇతరులకు హాని చేసేవారిని, తప్పులు చేసేవారిని, ప్రజలను మోసగించేవారిని, అబద్ధాలు చెప్పేవారిని మాత్రమే శని దేవుడు శిక్షిస్తాడు. శని దేవుడి రాశిచక్రం కాలక్రమేణా మారుతుంది. కానీ శని ప్రభావం ఉన్న సమయంలో మనము బాధలను సైతం భరించే శక్తి లభిస్తుంది. 

మీరు శని దేవుడి దోషాన్ని నివారించాలనుకుంటే నల్ల దారం ధరించడం మంచిది. ఒక నల్ల దారం శని గ్రహ ప్రభావాన్ని కొంతమేర తగ్గిస్తుంది. కానీ శనిదేవుని అనుగ్రహం పొందడానికి మీరు నల్ల దారం ధరించాలనుకుంటే అనుసరించాల్సిన నియమాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

నల్ల దారాన్ని ధరించడం వలన జాతకంలో శని గ్రహం యొక్క స్థానం పెరిగి.. శని దేవుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. అందుకే శని దేవుడి దోషాన్ని నివారించడానికి నల్ల దారాన్ని అధిక మంది ధరిస్తారు.

నల్ల దారం ఎక్కడ ధరిస్తారు?

చాలామంది నల్లటి దారాన్ని చేతులకు లేదా పాదాలకు ధరించవచ్చు. శని దేవుడిని ఆరాధించిన తర్వాత “ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్” అని మంత్రాన్ని జపించిన తర్వాత మాత్రమే ధరించాలి. ఆ తరువాత కుడి చేతికి నల్ల దారం ధరించవచ్చు. అలా చేసేటప్పుడు మీ చేతిలో మరే ఇతర దారం ఉంచుకోకూడదు.చాలామంది ఒకటి కన్నా ఎక్కువ దారాలను చేతులకు కలిగి ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. కేవలం నల్ల దారాన్ని మాత్రమే కలిగి ఉండటడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు కూడా నల్ల దారాన్ని చేతికి కట్టుకునే ముందు అంతకు ముందు ఉన్న అన్ని దారాలను తీసి వేసి, కేవలం నల్ల దారాన్ని మాత్రమే కట్టుకుంటే మంచిది.

ఏ రాశుల వారు నల్ల దారం ధరించాలి?

నల్ల దారం ధరించడం వల్ల మకరం, కుంభం, తుల రాశిలో జన్మించిన వారికి అదృష్టం వస్తుందని భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నల్ల దారం ధరించడం వల్ల జీవితం, వ్యాపారం, డబ్బు, ఉద్యోగం, కుటుంబ ఆనందం మరియు ఆస్తిలో పురోగతిని పొందుతారు.

ఈ రాశుల వారు నల్ల దారం ధరించకూడదు

మేష, వృశ్చికరాశిలో జన్మించిన వారు నల్ల దారం కట్టుకోకూడదు. అంగారకుడు ఈ రెండు రాశులకు అధిపతి. అయితే అంగారకుడు, శని ఒకరికొకరు శత్రుత్వం కలిగి ఉంటారు. అందువల్ల వీరు నల్ల దారం ధరించకూడదని చెబుతారు.

పురాణాల ప్రకారం నలుపు రంగుకు అంగారక గ్రహానికి పడదని చెబుతారు. దీంతో ఈ అంగారక గ్రహానికి సంబంధించిన రాశుల వారు ఎవరైనా నల్లని దుస్తులు, ఆభరణాలను ధరిస్తే అంగారకుడిలో కోపం పెరుగుతుందని అంటారు. దీంతో ప్రతికూల పరిస్థితులను కల్పించి జీవితంలో ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, కుటుంబ కలహాలు, మరెన్నో సమస్యలను కలిగిస్తాడని అందరూ నమ్ముతారు. మీరు కూడా ఇటువంటి విషయాలు నమ్మేవారిలో ఒకరిగా ఉంటే పైన పేర్కొన్న రాశులకు చెంది ఉంటే మీరు కూడా నల్లదారం ధరించండి.