ద్వాదశ రాశుల వారు వారి రాశిని బట్టి తీసుకోవలసిన చిరుధాన్యాలు ఇవే..

మనమందరం మంచి ఆరోగ్యం, వ్యాధులు లేకుండా జీవించడానికి ప్రతినిత్యం కృషి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక శైలిని అలవాటు చేసుకోవాలి. రాశిచక్రం పరంగా, మీరు ఎలాంటి చిరుధాన్యాలలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ధైర్యవంతులు, సాహసం, పోటీని ఇష్టపడతారు. ప్రతిచోటా మొదటి స్థానంలో ఉండటంలో నిపుణులు. అదే సమయంలో, వారి భావోద్వేగ స్వభావం కారణంగా, వారు స్థిరంగా […]

Share:

మనమందరం మంచి ఆరోగ్యం, వ్యాధులు లేకుండా జీవించడానికి ప్రతినిత్యం కృషి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక శైలిని అలవాటు చేసుకోవాలి. రాశిచక్రం పరంగా, మీరు ఎలాంటి చిరుధాన్యాలలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ధైర్యవంతులు, సాహసం, పోటీని ఇష్టపడతారు. ప్రతిచోటా మొదటి స్థానంలో ఉండటంలో నిపుణులు. అదే సమయంలో, వారి భావోద్వేగ స్వభావం కారణంగా, వారు స్థిరంగా ఉండలేరు. వారు తమ బలాన్ని, సహనాన్ని, లోతైన విశ్వాసాన్ని సాధ్యమైనంత ఉత్తమ మార్గంలో జీవితంలో పురోగమించడానికి ఉపయోగించవచ్చు. కఠినమైన శారీరక బలం కలిగి వుంటారు.

ఈ రాశి వారు మసాలా, మాంస వంటకాలను ఇష్టపడతారు. అందువల్ల, ఎసిడిటీ, మొటిమలు, జీర్ణ రుగ్మత, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు మరియు వాపుతో సహా వ్యాధులు సంభవించవచ్చు. చిరుధాన్యాల విషయంలో ఈ రాశి వారు కాన్ ఫ్లెక్స్ తింటే మంచిది. 

వృషభం: ఈ రాశి జాతకులు ప్రశాంతంగా, సహనంగా ఉంటారు. వృషభ రాశి వారు ఆహార ప్రియులు. చాలా రుచికరమైన, అధికంగా ఉడికించిన ఆహారం, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తింటారు. ఈ రాశి వారు రీస్ పఫ్స్ తింటే మంచిది. 

మిథున రాశి: వీరు తెలివైనవారు, అవగాహన, ఆలోచనాత్మకంగా ఉంటారు. వ్యాయామం విషయానికి వస్తే, వారు దృఢంగా ఉండటం మరియు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం కష్టం కాదు. మిథున రాశి జాతకులు ఆరోగ్యంగా ఉండటానికి ట్రిక్స్ తినాలి. 

కర్కాటకం:  ఈ జాతకులు అతి సున్నితమైనవారు మాత్రమే కాదు, చాలా భావోద్వేగానికి గురవుతారు. కుటుంబంతో సమయం గడపాలని కోరుకుంటారు. అదే సమయంలో హార్డ్ వర్కర్ కూడా. వీళ్లు చిరుధాన్యాలలో హనీ నట్ చెరియాస్ తినాలి.

సింహరాశి:  వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీళ్లను అప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ వుండాలి. ఇతరులను ఇట్టే ఆకట్టుకునే గుణం వీరిలో వుంటుంది. సంగీతంలో వీరికి ఆసక్తి అధికం. వీరు ఆరోగ్యంగా వుండాలంటే వీరికి యోగా, వ్యాయామం కలిసివస్తుంది. వీరు తినాల్సిన చిరుధాన్యాల విషయానికి వస్తే ప్రోస్టెడ్ ఫ్లాక్స్ తినాలి..

కన్యారాశి:  వీళ్ళు సున్నితమనస్కులు. వీరి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వీరికి జాగింగ్, వాకింగ్, చేయడం మంచిది. ఫాస్ట్ ఫుడ్‌ను పక్కనబెట్టాలి. వీరి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన చిరుధాన్యాలలో విటమిన్ కే ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

తులారాశి: ఈ రాశి చక్రం వారు కిడ్నీ, నిద్రలేమితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వున్నందున వీరు ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అల్లం వెల్లుల్లి, పెరుగును డైట్‌లో చేర్చుకోవాలి. ఇక చిరుధాన్యాల విషయానికి వస్తే దాల్చిన చెక్క టోస్ట్ క్రంచ్ తింటే మంచిది.

వృశ్చిక రాశి: వీరు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. రెడ్ మీట్, డ్రింక్స్, అధిక కొలెస్ట్రాల్‌తో  కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. యోగా చేయడం, వ్యాయామం చేయడం తప్పకూడదు. చిరుధాన్యాల విషయానికి వస్తే రైస్ క్రిస్పీస్ మన భాషలో మరమరాలు. 

ధనస్సు రాశి: ఈ వారి వాళ్ళు ఆరోగ్యవంతులు. అయినప్పటికీ జంక్ ఫుడ్, మసాలా పదార్థాలు, కొలెస్ట్రాల్, స్వీట్లు తీసుకోకపోవడం మంచిది. ధనుస్సు రాశి జాతకులు చిరుధాన్యాలు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లి, బొప్పాయి, జామకాయ, ఆరెంజ్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం మంచిది. వీళ్లు చిరుధాన్యాలలో లక్కీ ఛార్మ్స్ తినాలి. 

మకర రాశి: వీళ్ళు మోకాలి నొప్పితో ఇబ్బంది పడే సూచనలున్నాయి. అందుకోసం వేడైన సూప్‌లు, మష్రూమ్, సీ ఫుడ్, పండ్లు, క్యాల్షియం, విటమిన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.  వీళ్లు క్యాప్ ఆన్ క్రంచ్ తినాలి.

కుంభరాశి: రక్తప్రసరణ మెరుగుపరుచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. స్విమ్మింగ్ చేయడం వీరికి ఆరోగ్యాన్నిస్తుంది. పిండి వంటలను వీరు తీసుకోకపోవడం మంచిది.  మీరు తినాల్సిన చిరుధాన్యాల విషయానికి వస్తే ఫ్రూట్ లూప్స్ తినాలి. 

మీనరాశి:  యోగా, డ్యాన్స్ చేయవచ్చు. వ్యాధినిరోధకతను పెంచుకునే ఆహారాన్ని తీసుకోవచ్చు. పీచు పదార్థాలు పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా జ్యూస్‌లు తీసుకోవచ్చు . నీటిశాతం ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా మీరు తీసుకోవలసిన చిరుధాన్యాల విషయానికి వస్తే రైసిన్ బ్రాన్ క్రంచ్ తినాలి.