కుజదోషం అంటే ఏమిటి? దానికి పరిష్కార మార్గాలు ఏమిటి?

కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు. కుజదోష నివారణకు అనేక పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఆయా పరిహారాలు చేయడం వల్ల కుజదోషం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కుజదోషం వల్ల వివాహం కావడం ఆలస్యమవడం, సంతానం పొందడంలో సమస్యలు ఏర్పడతాయని చెబుతారు. కుజదోషం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుందని కొంత మంది చెబుతుంటారు.   సుబ్రహ్మణ్య స్తోత్రాలు, కుజగ్రహ మంత్రాలను పఠించడం ద్వారా కుజదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. […]

Share:

కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు. కుజదోష నివారణకు అనేక పరిహారాలు ఉన్నాయి.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఆయా పరిహారాలు చేయడం వల్ల కుజదోషం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కుజదోషం వల్ల వివాహం కావడం ఆలస్యమవడం, సంతానం పొందడంలో సమస్యలు ఏర్పడతాయని చెబుతారు. కుజదోషం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుందని కొంత మంది చెబుతుంటారు.  

సుబ్రహ్మణ్య స్తోత్రాలు, కుజగ్రహ మంత్రాలను పఠించడం ద్వారా కుజదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. నిజానికి కుజుడు అంటే అంగారక గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఈ క్రింది స్థానాలలో ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెబుతారు.

జన్మ రాశిలో 1, 2, 4, 8, 12 పాదాల్లో కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఉన్నట్లేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే, ఇలా అందరికీ ఉండదు. జాతకంలో ఇలా ఉన్నవాళ్ళకి మాత్రమే కుజదోషం ఉంటుంది. మంగళవారం జన్మించిన వారికి మాత్రం ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుందట. అంతేకాకుండా సింహ, మకర రాశులవారికి కుజదోషం వర్తించదని జ్యోతిష్యులు చెబుతుంటారు. కావున ఈ రాశుల వారు కుజదోషం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతారు.   

కుజదోష నివారణకు చేయదగిన పరిహార మార్గాలు

కుజదోష నివారణకు సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళీ పారాయణం రోజుకు 9 సార్లు 12 రోజులపాటు చేయాలి. ఇలా చేయడం వల్ల కుజదోషం తగ్గిపోయి… మనసుకు ప్రశాంతత లభిస్తుందని, అంతే కాకుండా జీవితంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని అందరూ నమ్ముతారు. 

అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమ వారాల్లోని రాహుకాలంలో ఇలా చేయాలి. 

కుజదోష నివారణకు 42 రోజుల పాటు సుబ్రహ్మణ్య మూల మంత్రాన్ని రోజుకు ఒకసారి పఠించాలి.

సుబ్రమణ్య కరావలంబ స్తోత్రాన్ని 80 రోజుల పాటు రోజుకు 11 సార్లు పఠించాలి.

ఏడు మంగళ వారాలు ఉదయం 7 గంటలలోపు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి.

ఆదివారం ఉపవాసం ఉండి, సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు నిమ్మకాయ దొప్పలో దీపారాధన చేయాలి. ఆ తరువాత  సుబ్రమణ్యాష్టకం చదవాలి.

మీకు కుజదోషం ఉందని తెలిస్తే మీకు నమ్మకమున్న జ్యోతిష్కులను కలిసి పరిహారాలను తెలుసుకోండి. వారు మీ దోష పరిహారం కోసం పూజలు, హోమాలు ఏమి చేయాలో తెలిపి, ఏ రత్నం ధరించాలో తెలియజేస్తారు.  

అయితే, మన జీవితంలో జరిగే ఏ పరిణామానికైనా మన కృషి, పట్టుదల, ధైర్యం, ఆత్మస్థైర్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. జ్యోతిషశాస్త్రం ఎంతో శాస్త్రీయత కలిగి ఉన్న శాస్త్రమే అయినప్పటికీ మనిషికి తన కృషే ప్రధానమని, భవిష్యత్తును ఎవరైనా పూర్తిగా తెలుసుకోలేరని గుర్తుంచుకోండి. ఈ నివారణలు అన్నీ కూడా మనకు మనశ్శాంతి కల్పించేందుకు ఉన్నాయని వాస్తవాన్ని గ్రహించాలి. ఇంకా కొంత మంది వీటిని అస్సలుకే నమ్మరు. అటువంటి వారికి ఈ దోషాల గురించి చెప్పినా ప్రయోజనం ఉండదు.