పొరపాటునో, తొందరలోనో మంచాల మీద కూర్చొని తింటున్నారా?

చాలా మంది నేలపై కూర్చోకుండా మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ అలవాటు ఒక తప్పుడు అలవాటు, మంచం మీద ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలను చూపుతుంది. మంచం మీద ఆహారం తీసుకోవడం వల్ల మనకు చాలా హాని జరుగుతుంది. మంచం మీద భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  దాని వల్ల కలిగే చెడు ప్రభావాలేమిటో తెలుసుకోండి. ఆర్ధిక సమస్యలు మిమ్మల్ని […]

Share:

చాలా మంది నేలపై కూర్చోకుండా మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ అలవాటు ఒక తప్పుడు అలవాటు, మంచం మీద ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలను చూపుతుంది. మంచం మీద ఆహారం తీసుకోవడం వల్ల మనకు చాలా హాని జరుగుతుంది. మంచం మీద భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

దాని వల్ల కలిగే చెడు ప్రభావాలేమిటో తెలుసుకోండి.

ఆర్ధిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? అప్పుల బాధల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి. ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ చేయడం వలన అప్పులు ఎక్కువగా అవుతాయని కొంత మంది నమ్ముతారు. మీరు కూడా అటువంటి వారిలో ఉంటే ఇవి మీ కోసమే… 

వాస్తుకు సంబంధించిన చిన్న పొరపాట్ల వల్ల అప్పులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందులలో పడతాము. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వాస్తు విషయంలో మనం చేసే తప్పులు ఏమిటి? తెలుసుకుందాం.

నాణేనికి రెండు వైపులా బొమ్మా బొరుసు ఉన్నట్టే, జీవితంలో కూడా మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే ఈ రెండూ కలకాలం ఉండవు. కానీ ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నామని కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఎవరైనా చెప్తే కూడా మనం మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తాం. నిజానికి మనకు చెప్పే నియమాలలో చాలా వరకు శుభ్రతకు సంబంధించినవి గానీ, మనకు వీలుగా ఉండటానికి చెప్పబడినవి గానీ, ఆరోగ్యానికి సంబంధించినవి గానీ ఉంటాయి. ఈ నియమాలు పాటించడం వల్ల మనకు లాభమే ఉంటుంది. ఏ పుట్టలో ఏ పాముందో అనుకొని పాటించడంలో తప్పులేదు. 

మంచం మీద కూర్చొని తినడం వల్ల కలిగే నష్టాలు

1. చాలా మంది బాగా ఆకలిగా ఉన్నప్పుడు మంచం మీద కూర్చొని తినేస్తారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల పేదరికం వస్తుంది. అప్పులపాలు అవుతారు. ఎన్నో కష్టాలపాలు అవుతారు. జీవితంలో సంతోషం దూరమవుతుంది. ఈ నియమం శుభ్రతకు సంబంధించినది కూడా. మంచం పైన తింటే దానిపైన ఆహార పదార్థాలు పడి చీమలు రావచ్చు. శుభ్రం చేసుకోవాలంటే కూడా కష్టం. అందువల్ల మంచం పైన తినకపోవడం ఎలా అయినా మంచిదే. 

2. రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో పాత్రలు రాత్రిపూట శుభ్రం చేయలేకపోతే వాటిని అక్కడే సింకులో ఉంచకూడదు. బయట వేసుకోవాలి. దీని వల్ల వంటింట్లోకి దోమలు, బొద్దింకలు కూడా చేరకుండా ఉంటాయి.

3. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్తబుట్టను ఉంచవద్దు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆగ్రహంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అందువల్ల చెత్తబుట్టను ఇంటి గుమ్మానికి కుదిరినంత దూరంగా ఉంచితే మంచిది.

4. మనలో చాలామంది సాయంత్రం పాలు, పెరుగు, ఉప్పు దానం చేసే అలవాటు ఉంటుంది. కానీ నిజానికి సాయంత్రం పూట ఇలా పాలు కానీ పెరుగు కానీ లేదంటే ఉప్పును కానీ దానం చేయకూడదు. అంటే.. ఇరుగు పొరుగు వారు అడిగినా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

5. మనలో చాలామందికి బాత్ రూంలో బకెట్ ను ఖాళీగా ఉంచుతారు. రాత్రిపూట బాత్‌రూమ్‌లో ఖాళీ బకెట్ ఉంచకూడదు. ఎందుకంటే దీనివల్ల కలిగే నెగటివ్ ఎనర్జీ వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండాలంటే  నిద్రపోయే ముందు బాత్‌రూమ్‌లో బకెట్ నిండుగా నీళ్ళు నింపి పెట్టాలి.

మనం తెలిసీ తెలియక చేసే వాస్తు దోషాలు, నియమ ఉల్లంఘనలు ఎన్నో కష్టాలను కలుగజేస్తాయి. 

అందువల్ల ఇటువంటి తప్పులను చేయకుండా ఉంటూ సంతోషంగా ఉండండి.