ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయట… మరి గాల్లో తేలిపోవటానికి మీరు సిద్ధమేనా?

ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు మనందరికీ తెలుసు కదా! మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా? సాధారణంగా కారు, బైక్, స్కూటర్ వంటి వాహనాలు రోడ్డుపై నడుస్తాయి. హెలికాప్టర్, విమానం వంటివి గాలిలో ఎగురుతుంటాయి. కానీ కారు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది? ఏంటి మీకేమైనా మతి పోయిందా… అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ… త్వరలోనే మార్కెట్‌లోకి ఎగిరే కార్లు రానున్నాయట! వివరాల్లోకెళ్తే.. ఫిబ్రవరి 1 న జపాన్‌‌లోని  ఓయిటా నగరంలోని తనౌరా బీచ్‌పై ఎగిరే […]

Share:

ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు మనందరికీ తెలుసు కదా! మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా? సాధారణంగా కారు, బైక్, స్కూటర్ వంటి వాహనాలు రోడ్డుపై నడుస్తాయి. హెలికాప్టర్, విమానం వంటివి గాలిలో ఎగురుతుంటాయి. కానీ కారు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది? ఏంటి మీకేమైనా మతి పోయిందా… అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ… త్వరలోనే మార్కెట్‌లోకి ఎగిరే కార్లు రానున్నాయట! వివరాల్లోకెళ్తే..

ఫిబ్రవరి 1 న జపాన్‌‌లోని  ఓయిటా నగరంలోని తనౌరా బీచ్‌పై ఎగిరే కారు క్రూయిజ్‌ను వీక్షించేందుకు దాదాపు 400 మంది ప్రేక్షకులు గుమిగూడారు. ఈ ప్రయోగానికి రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మొట్టమొదటిసారిగా మనుషులతో ప్రయాణించిన ఎగిరే కారు ప్రయోగంగా దీన్ని చెప్పుకోవచ్చు.

ఈ ఎగిరే కారు భూమి నుండి దాదాపు 30 మీటర్ల ఎత్తుకు లేచి, 400 మీటర్లు ప్రయాణించి, 3½ నిమిషాల పాటు గాలిలో ఉంది. దీని వల్ల ట్రాఫిక్ చింత లేకుండా హాయిగా పోవచ్చునని పలువురు భావిస్తున్నారు. ఎంత కాస్ట్లీ కారులో రోడ్డుపైన వెళ్లినా తప్పనిసరిగా ట్రాఫిక్​లో చిక్కుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగించేందుకు మెట్రో వంటివి ఉన్నా కానీ అవి డైరెక్టుగా మన ఇంటి దగ్గరి నుంచి ఉండవు. అంతే కాకుండా మనం పోవాలనుకున్న డెస్టినేషన్​కు అవి ఉంటాయో లేదో కూడా చెప్పలేం. కనుక ఈ గాల్లో ఎగిరే కార్లు వస్తే.. ట్రాఫిక్ చింతలు కొందరికైనా తప్పనున్నాయి. ఈ కార్లు కూడా బాగా అయితే గాలిలో వాటికి కూడా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందని వాటి వల్ల కింద ఉన్న వారికి కూడా ప్రమాదం తలెత్తుతుందని భావిస్తున్నారు. మరి ఈ కార్లు వస్తే ఎలా డిజైన్ చేస్తారో గాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం ఫీచర్ తీసుకొస్తారో వేచి చూడాలి. 

ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ వాహనం 5.6 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల ఎత్తు, 430 కిలోల బరువు ఉంది.

ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను రూపొందించడానికి ప్రధానంగా ఏవియేషన్ మరియు ఆటోమొబైల్ సంబంధిత కంపెనీల ద్వారా కురాషికి, ఓకయామా ప్రిఫెక్చర్‌లో స్థాపించబడిన MASC అనే సంస్థ ఈ పరీక్షను నిర్వహించింది.

“ఎగిరే సమయంలో ఎటువంటి ఇబ్బందీ కలగలేదు, హోవార్డ్‌‌లో మాత్రం చిన్న కుదుపు వచ్చినట్లు అనిపించింది” అని వాహనంలో ఉన్న MASC నాయకుడు హిరోషి కిరినో చెప్పారు.

“ఈ రైడ్ మామూలు కారులో ప్రయాణించినట్లే ఉంది,” అని అతను చెప్పాడు, ఎగిరే సమయంలో విమానం భద్రంగా ఉంది.

జపాన్  2025లో ఒసాకాలో జరగనున్న వరల్డ్ ఎక్స్‌పోలో ఎగిరే కార్లను భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఓయిటా మేయర్ కిచిరో సాటో మాట్లాడుతూ, ఎగిరే కారు సాంకేతిక దృక్కోణం నుండి ఆచరణాత్మకంగా ఉపయోగించబడే స్థాయికి చేరుకుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఇది 2025లో ఒయిటాలో ఉపయోగించడానికి సిద్ధం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

నిజంగా ఎగిరే కార్లు వస్తే… ప్రేమికులందరూ ‘మేఘాలలో తేలిపోతున్నది’ అని పాడుకుంటారేమో!వీటికోసం ఇప్పటికే చాలా మంది ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.